Masooda Movie OTT release date and Platform Confirmed - Sakshi
Sakshi News home page

Masooda Movie OTT Release: ఓటీటీకి 'మసూద' చిత్రం.. స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే..!

Published Thu, Dec 15 2022 3:12 PM | Last Updated on Fri, Dec 16 2022 6:41 PM

Masooda Movie OTT Release Date Fix In AHA Platform - Sakshi

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన చిత్రం 'మసూద'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవంబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మసూద బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్  అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన తిరువీర్‌కు.. చాలా గ్యాప్‌ తరువాత మంచి పాత్రతో కనిపించిన సంగీతకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది మసూద. దర్శకుడు మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా.. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌ రామ్‌, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement