ఓటీటీలో ఆకట్టుకుంటోన్న శ్రీలీల కొత్త చిత్రం శాండల్‌వుడ్ బ్యూటీ శ్రీలీలకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి అందిరికీ తెలిసిందే. ఇటీవలె ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. కన్నడ, తెలుగు ఇండస్ట్రీల్లో ఆమె నటించిన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అవుతుండటంతో శ్రీలీల బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.
తాజాగా ఆమె నటించిన 'ఐ లవ్ యు ఇడియట్' సినిమా ఇప్పుడు ఆహాలో ఆకట్టుకుంటోంది. గతేడాది డిసెంబర్17న థియేటర్‌లోకి వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించింది. ఇప్పుడీ చిత్రం భవానీ మీడియా సంస్థ ద్వారా ఆహాలోనూ సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీలీల అందాలు, డ్యాన్సులు సినిమాకు ప్లస్‌గా మారాయి. ఆహాలో ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment