
సమంత ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకొని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటుంది. చివరగా యశోద సినిమాతో అలరించిన సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సమంత విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాతో పాటు సిటాడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది.
ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డికే ‘సీటాడెల్’ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ కోసం సామ్ ప్రత్యేకంగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకొని ఇలా కనిపించడం సంతోషంగా ఉందని కామెంటస్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment