
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్‌లో నిహారిక ఉండటం సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో నిహారికతో పాటు బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు ప్రముఖుల పిల్లలు ఉండటం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చదవండి: హీరోయిన్ మాట్లాడుతుంటే చై ఏం చేస్తున్నాడో చూడండి..
అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత నిహారిక బయట పెద్దగా కనిపించలేదు. దీనికి తోడు అంతకుముందే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడంతో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లయ్యింది. అయితే ఈ వివాదం తర్వాత తొలిసారిగా నిహారిక తన భర్తతో కలిసి ఓ ఈవెంట్‌లో కనిపించింది. ‘హలో వరల్డ్ ‘పేరుతో నిహారిక నిర్మిస్తున్న ఓ వెబ్‌సిరీస్ ఓపెనింగ్ ఈవెంట్‌లో భర్తతో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్
Comments
Please login to add a commentAdd a comment