మెగాడాటర్ నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
చదవండి: నటి ఖుష్భూ కూతుర్ని చూశారా? గ్లామర్ షోతో రచ్చరచ్చ
దీనికి తోడు భార్యభర్తలిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయటంతో విడాకుల రూమర్స్ తెరమీదకి వచ్చాయి. దీనిపై నిహారికతో పాటు మెగా ఫ్యామిలీ కూడా సైలెంట్‌గా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అంతేకాకుండా పెళ్లి తర్వాత యాక్టింగ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టిన నిహారిక ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా నిహారిక షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. జిమ్‌లో వర్కవుట్ వీడియోను షేర్ చేస్తూ.. మనసుకు తగిలిన అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది అంటూ కొటేషన్‌ను యాడ్ చేసింది. దీంతో భర్త జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు నిహారిక ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే వృత్తిపరంగా బిజీ అయ్యేందుకు చూస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment