Niharika Konidela Skipped To Answer Divorce Rumours With Chaitanya - Sakshi
Sakshi News home page

Niharika Konidela : భర్తతో విడాకులు నిజమేనా? నిహారిక రియాక్షన్‌ ఇదే..

May 18 2023 2:30 PM | Updated on May 18 2023 3:19 PM

Niharika Konidela Skipped To Answer Divorce Rumours With Chaitanya - Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఇప్పుడు మళ్లీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తుంది. కొంతకాలంగా డివర్స్‌ రూమర్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న నిహారిక  భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటుందని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తుంది.

ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని,దీంతో విడిపోనున్నారనే గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్‌ చేయడంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్‌ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఇదే విషయంపై నిహారికకు ప్రశ్న ఎదురైంది. ఆమె నటించిన 'డెడ్ పిక్సెల్స్' వెబ్ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ జర్నలిస్ట్‌ నిహారికను.. మీరు మీ భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు రూమర్స్‌ వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా నిహారిక.. సున్నితంగా ఆ ప్రశ్నను దాసివేసింది. సమాధానం చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దీంతో నిహారిక విడాకుల రూమర్స్‌ నిజమేనంటూ పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement