
మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల రూమర్స్ హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటుందని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని,దీంతో విడిపోనున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై అటు చైతన్య కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే కెరీర్‌పై మరింత ఫోకస్ పెట్టిన నిహారిక సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి నిర్మాతగా మారింది.
ఈమధ్య కాలంలో వరుస ఫోటోషూట్స్‌తో అలరిస్తుంది. ఈ క్రమంలో నిహారిక మళ్లీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తుందా అనే సందేహం కలుగుతుంది. ఒక మనసు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఆమె పెళ్లి తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా విడాకుల రూమర్స్ నేపథ్యంలో నిహారిక ఫోటోషూట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment