Niharika Konidela To Play Key Role In Allu Arjun Pushpa 2 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Niharika Konidela In Pushpa 2: అల్లు అర్జున్‌ పుష్ప-2లో నిహారిక!.. అలాంటి పాత్రలో మెగాడాటర్‌

Published Sat, May 6 2023 2:42 PM | Last Updated on Sat, May 6 2023 3:20 PM

Niharika Konidela To Play Key Role In Allu Arjun Pushpa2 - Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల పేరు ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. భర్తతో కొంతకాలంగా దూరంగా ఉంటున్న నిహారిక ప్రస్తుతం వర్క్‌పైనే ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే సొంతంగా ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించిన నిహారిక ఈమధ్యే నటిగానూ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరకు సినిమాలు చేసిన నిహారిక ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పింది.

అయితే విడాకుల రూమర్స్‌ నేపథ్యంలో మరోసారి నటిగా తనకు తాను పరీక్షించుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట వైరల్‌గా మారింది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌  నటిస్తున్న పుష్ప-2లో నిహారిక కీలక పాత్రలో కనిపించనుందట. చదవండి: యంగ్‌ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్‌

ఈ పాత్ర కోసం గతంలో సాయిపల్లవిని సంప్రదిస్తే ఆమె నో చెప్పిందట. ఇప్పుడు ఆ రోల్‌లో నిహారిక కనిపించనున్నట్లు సమాచారం. గిరిజన యువతిగా పుష్ప-2లో ఓ ముఖ్యమైన పాత్రలో మెగా డాటర్‌ మెస్మరైజ్‌ చేయనుందన్నమాట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement