అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన తేజ్‌పై నిహారిక కామెంట్‌ | Niharika Comments On Allu Arjun And Sai Durga Teja Issue | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన తేజ్‌పై నిహారిక కామెంట్‌

Published Sat, Jun 15 2024 7:31 AM

Niharika Comments On Allu Arjun And Sai Durga Teja Issue

ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే మెగా హీరో సాయిధుర్గ తేజ్‌ తీసుకున్న నిర్ణయంతో సినిమా అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను సోషల్‌ మీడియాలో ఆయన అన్‌ఫాలో చేశారు. దీంతో మెగా vs అల్లు అంటూ సోషల్‌ మీడియాలో రచ్చ మొదలైంది.  అయితే సాయి దుర్గ తేజ్‌  తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్‌ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.

తాజాగా ఈ వివాదం గురించి నిహారిక రియాక్ట్‌ అయింది.  'కమిటీ కుర్రోళ్లు' అనే సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఇదే విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించింది. అల్లు అర్జున్‌, సాయిదుర్గ తేజ్‌ విషయం గురించి తనకు ఇంకా తెలియదని చెప్పింది.  అయినా, ఎవరి కారణాలు వారికి ఉంటాయని ఆమె చెప్పింది.

కొత్త నటులను పరిచయం చేస్తూ  'కమిటీ కుర్రోళ్లు' అనే చిత్రాన్ని  నిహారిక  సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ద్వారా 11 మంది గొప్ప ఆర్టిస్టులను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నట్లు చిత్ర డైరెక్టర్‌  యధు వంశీ తెలిపాడు. ఈ సినిమా గురించి నిహారిక మాట్లాడుతూ.. తామంతా  ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తెరకెక్కించామని తెలిపింది. ఈ చిత్రంలోని ఎమోషన్స్‌కు అందరూ కనెక్ట్‌ అవుతారని ఆమె చెప్పింది. త్వరలో 'కమిటీ కుర్రోళ్లు' ట్రైలర్‌ విడుదల చేస్తామని నిహారిక పేర్కొంది. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement