Sai Dharam Teja
-
అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేసిన తేజ్‌పై నిహారిక కామెంట్
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే మెగా హీరో సాయిధుర్గ తేజ్ తీసుకున్న నిర్ణయంతో సినిమా అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో ఆయన అన్‌ఫాలో చేశారు. దీంతో మెగా vs అల్లు అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అయితే సాయి దుర్గ తేజ్ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.తాజాగా ఈ వివాదం గురించి నిహారిక రియాక్ట్ అయింది. 'కమిటీ కుర్రోళ్లు' అనే సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఇదే విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించింది. అల్లు అర్జున్, సాయిదుర్గ తేజ్ విషయం గురించి తనకు ఇంకా తెలియదని చెప్పింది. అయినా, ఎవరి కారణాలు వారికి ఉంటాయని ఆమె చెప్పింది.కొత్త నటులను పరిచయం చేస్తూ 'కమిటీ కుర్రోళ్లు' అనే చిత్రాన్ని నిహారిక సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ద్వారా 11 మంది గొప్ప ఆర్టిస్టులను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నట్లు చిత్ర డైరెక్టర్ యధు వంశీ తెలిపాడు. ఈ సినిమా గురించి నిహారిక మాట్లాడుతూ.. తామంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తెరకెక్కించామని తెలిపింది. ఈ చిత్రంలోని ఎమోషన్స్‌కు అందరూ కనెక్ట్ అవుతారని ఆమె చెప్పింది. త్వరలో 'కమిటీ కుర్రోళ్లు' ట్రైలర్ విడుదల చేస్తామని నిహారిక పేర్కొంది. -
అందుకే నా పేరులో మా అమ్మ పేరు పెట్టుకున్నా!
‘‘నేను సినిమా కెరీర్ప్రాంరంభించినప్పటి నుంచి మా అమ్మ పేరు (విజయ దుర్గ) మీద నిర్మాణ సంస్థ ఆరంభించాలని ఉండేది. అందుకే అమ్మ పేరు మీద విజయదుర్గప్రో డక్షన్స్నుప్రాంరంభించి, ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్‌తో కలిసి ‘సత్య’ షార్ట్ ఫిలిం నిర్మించాను. మా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. అందుకే నా పేరును సాయిధరమ్ తేజ్ నుంచి సాయిదుర్గ తేజ్‌గా మార్చుకున్నాను’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. నవీన్ విజయకృష్ణ దర్శకత్వంలో సాయిదుర్గతేజ్, ‘కలర్స్’ స్వాతి జంటగా హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన షార్ట్ ఫిలిం ‘సత్య’. ఈ చిత్రం ప్రెస్మీట్లో సాయిదుర్గ తేజ్ మాట్లాడుతూ– ‘‘సత్య’ దాదాపు 25 ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. అవార్డులు కూడా వచ్చాయి’’ అన్నారు. ‘‘సమాజానికి తమ వంతు ఏదైనా చేయాలని చేసిన సినిమా ‘సత్య’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఇప్పటివరకు మా చిత్రానికి 25 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అన్నారు నవీన్ విజయకృష్ణ. -
సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన అబ్దుల్ ఇతనే..
-
సాయిధరమ్‌తేజ్ కోలుకుంటున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: అభిమానులు ఆందోళన పడవద్దని.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సాయిధరమ్‌తేజ్ కోలుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.. రెండు రోజుల్లో సాయిధరమ్ తేజ్ తిరిగి వస్తాడని చిరంజీవి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్‌తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో శుక్రవారం రాత్రి చిరంజీవి, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. మెరుగైన వైద్యం కోసం మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రి నుండి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి సాయిధరమ్‌తేజ్‌ను తరలించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు రోడ్డు ప్రమాదంలో హీరో సాయి ధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు -
పెళ్లికి రెడీ అవుతోన్న సాయి ధరమ్ తేజ్
-
ఐఏఎస్ ఆఫీసర్
త్వరలో ఐఏఎస్ ఆఫీసర్‌గా చార్జ్ తీసుకోబోతున్నారు హీరో సాయిధరమ్ తేజ్. దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారట సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్ల విధివిధానాలు, వారి బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారట సాయిధరమ్. ఫిట్‌గా కనిపించేందుకు బరువు తగ్గేలా వర్కౌట్స్ కూడా చేస్తున్నారని తెలిసింది. నార్త్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. కరోనా పరిస్థితులు కాస్త కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలని అనుకుంటున్నారట. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. -
ఒకటే నినాదం.. సోలో బ్రతుకే సో బెటర్
సాయితేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ నెల రెండో వారంలో ఈ చిత్రం థీమ్ వీడియోను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్‌లో జరుగుతోంది. ‘‘సోలో సోదర సోదరీమణులారా.. ఈ వేలెంటైన్స్ వీకెండ్‌ని మనం అంతా కలిపి జరుపుకుందాం.. మన నినాదం ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్’’ అన్నారు సాయితేజ్. -
కాంబినేషన్ కుదిరింది
యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతున్నారు హీరో సాయిధరమ్ తేజ్. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మంచి వినోదాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంటారు దర్శకుడు మారుతి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా కుదిరింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయని తెలిసింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే రూపొందిన సంగతి తెలిసిందే. -
అభిలాషకి జరిగినట్లుగానే తేజ్‌కి జరిగింది – సాయిధరమ్ తేజ్
‘‘ఈ సినిమా టోటల్ క్రెడిట్ హీరో సాయిధరమ్ తేజ్‌కే చెందుతుంది. ఎందుకంటే నాకు తేజ్ డేట్స్ ఇచ్చిన ఏడాదిన్నర వరకు మంచి కథలు దొరకలేదు. ఓ రోజు ఫోన్ చేసి ‘నేను ఒక కథ విన్నాను. నాకు నచ్చింది, మీకు న చ్చితే ఆ సినిమా చేద్దాం’ అని తేజ్ అన్నారు. కరుణాకరన్ వచ్చి కథ చెప్పారు. నాకు నచ్చటంతో సినిమా స్టార్ట్ అయ్యింది. యూత్‌ను ఆకట్టుకునే సినిమా ఇది. నా బ్యానర్లో ఎన్నో íß ట్ సినిమాలు నిర్మించాను. వాటికి ఏ మాత్రం తగ్గకుండా మా బ్యానర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీస్ అవుతుంది’’ అన్నారు కేయస్ రామారావు. సాయిధరమ్ తేజ్ , అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యూ’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. పలువురు సినీ పి.ఆర్.ఓ (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్)ల సమక్షంలో సాయిధరమ్, ఇంద్ర ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం సాయిధరమ్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు నటించిన ‘అభిలాష’ సినిమా పబ్లిసిటీ పి.ఆర్.ఓలు, జర్నలిస్టులతో ప్రారంభమైందని విన్నాను. నేను నటించిన ‘తేజ్’ సినిమా ట్రైలర్కూడా పి.ఆర్.ఓల సమక్షంలో జరగటం ఆనందంగా ఉంది. కరుణాకరన్‌గారు మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. కేయస్ రామారావుగారికి కథ నచ్చాకే సినిమాను స్టార్ట్ చేశాం. మంచి సినిమా తీశాం. గోపీసుందర్ సంగీతం, ‘డార్లింగ్’ స్వామి మాటలు, ఆండ్రూ కెమెరా పనితనం, సాహీ సురేశ్ ఆర్ట్ డైరెక్షన్ సినిమాకు ఎస్సెట్స్‌గా నిలుస్తాయి. ప్రతి ఒక్కరికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమాలో లవ్ ఫీల్ ఉంది. కరుణాకరన్‌గారికి మంచి హిట్, కేయస్ రామారావు గారికి బాగా డబ్బు రావాలి’’ అని మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి అన్నారు. -
లాట్ మొబైల్స్ డిస్కౌంట్ ఆఫర్స్
ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ రిటైల్ సంస్థ ‘లాట్ మొబైల్స్’ తాజాగా బ్లాక్‌బస్టర్ డీల్స్ పేరిట పలు ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు ఈ ఆఫర్లలో భాగంగా మొబైల్ కొనుగోలుపై టీవీలు, టవర్ ఫ్యాన్లు, రైస్కుక్కర్లను ఉచితంగా పొందొచ్చని కంపెనీ తెలిపింది. అలాగే మొబైల్స్‌పై 55 శాతం వరకు, బ్రాండెడ్ యాక్ససరీస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని, 0 శాతం ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొంది. బ్లాక్‌బస్టర్ డీల్స్‌లో భాగంగా 1 జీబీ ర్యామ్ ఫోన్‌ను రూ.2,999లకు, 2 జీబీ ర్యామ్ ఫోన్‌ను రూ.4,999లకు, 3 జీబీ ఫోన్‌ను రూ.5,999లకు, 4 జీబీ ఫోన్‌ను 8,999లకు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. -
మేనల్లుడికి గెస్ట్‌గా...
సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 9న జరగనుంది. ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి అటెండ్ కానున్నారు. ‘‘నువ్వు నా ప్రపంచం. థ్యాంక్యూ మామా’’ అని ఈ సందర్భంగా సాయిధరమ్ పేర్కొన్నారు. -
మరో సాంగ్ రీమిక్స్ చేయనున్న మెగా హీరో
సంగీత ప్రియులను అలరించే పాత పాటలను రీమిక్స్ చేయడం టాలీవుడ్లో కొత్తేం కాదు. సమయానుకూలంగా చాలా మంది హీరోలు పాత సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో కొన్నింటిని సందర్భానుసారం వాడుకుంటుంటే, మరికొంత మంది సెంటిమెంట్ కోసం రీమిక్స్ చేస్తారు. మెగా మేనళ్లుడు సైతం ఇప్పటికే రెండు సూపర్‌డూపర్ హిట్ పాటలను తన సినిమాల్లో వాడేశాడు. వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో సాయి ధరమ్ తేజ్ మళ్లీ రీమిక్స్ మార్గం ఎంచుకున్నాడు. మెగాస్టార్ పాటలను రీమిక్స్ చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో మామయ్య మెగాస్టార్ పాటలను తిరిగి రీమిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు సాయి. ఇందుకోసం కొండవీటి దొంగ సినిమాలోని ఛమకు ఛమకు ఛామ్ అనే పాటను రీమిక్స్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. మరి మామయ్య సాంగ్ సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. -
బ్రదర్స్... బాక్సర్స్?
ఎన్టీఆర్–రామ్‌చరణ్ కాంబినేషన్లో రాజమౌళి ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. నిజంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ‘జవాన్’ ప్రమోషన్స్‌లో.. ఈ సినిమా ఉందని సాయిధరమ్ తేజ్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మరో చర్చ మొదలైంది. ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? ఇందులో ఎన్టీఆర్–చరణ్ అన్నదమ్ములుగా నటిస్తారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. దాంతోపాటు సినిమా బ్యాక్‌డ్రాప్‌ని కూడా కొందరు బయటపెట్టారు. ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందన్నది వారి ఊహ. ఇందులో ఎన్టీఆర్–చరణ్ బాక్సర్లుగా కనిపిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. అది మాత్రమే కాదు.. హీరోలిద్దరూ అసలు సిసలైన బాక్సర్లుగా కనిపించడం కోసం ఫిజిక్ పెంచనున్నారట. కండలు పెంచి, బాక్సింగ్ రింగ్‌లో ఈ ఇద్దరూ పంచ్‌లు కొడుతుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవని చెప్పుకుంటున్నారు. మరి.. రాజమౌళి మనసులో ఏ కథ ఉందో? వేచి చూద్దాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. -
సాయిధరమ్ తేజ్ ‘జవాన్’ ప్రి రిలీజ్ వేడుకలు
-
సూయ.. పాట అనసూయ కోసమే అనుకున్నా
‘విన్నర్’ సినిమా కోసం పాట పాడమని సంగీత దర్శకుడు తమన్ అడిగిప్పుడు తమాషా చేస్తున్నాడనుకున్నా. అయితే తను సీరియస్‌గానే అని చెప్పడంతో చెన్నై వెళ్లి పాట పాడా’’ అని యాంకర్ సుమ చెప్పారు. సాయిధరమ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన చిత్రం ‘విన్నర్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ 24న సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ‘సూయ సూయ’ పాట పాడిన సుమ, ఆ పాటలో నర్తించిన యాంకర్ అనసూయ తమ అనుభూతులు పంచుకున్నారు. సుమ మాట్లాడుతూ– ‘‘తమన్ ఇచ్చిన లిరిక్స్‌లో ‘సూయ సూయ’ పల్లవి చదవగానే ఇది అనసూయ కోసం రాసిన పాట కదా? అని అడగడంతో అవునన్నాడు. తర్వాత అనసూయకు ఫోన్ చేసి నేను పాట పాడా, అది నువ్వు డ్యాన్స్ చేసే పాట అనగానే థ్రిల్ అయ్యింది. బాగా పాడానని ఎస్పీబీగారు ప్రశంసించడం మరచిపోలేను’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు నన్ను ‘క్షణం’ చిత్రం అనసూయగానే గుర్తు పెట్టుకో వాలని, ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు. ‘విన్నర్’లో పాట చేయమనడంతో భయపడి వద్దన్నా. కానీ, ఆ పాటలో కొన్ని లిరిక్స్ వినగానే చేయాలనిపించి చేశా’’ అన్నారు అనసూయ. -
ఆ బాధలోంచి పుట్టుకొచ్చిన కథ ఇది!
‘‘శతమానం భవతి’ కథను తొలుత సాయిధరమ్ తేజ్, రాజ్ తరుణ్‌కి వినిపించాం. వాళ్లకు నచ్చింది. వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కథాంశం కావడంతో ఎలాగైనా పండగకి విడుదల చేయాలనుకున్నాం. ఈ పాత్రకు శర్వానంద్ సరిపోతాడనిపించి, కథ వినిపించాం. తనకు కథ నచ్చి, అంగీకరించారు’’ అన్నారు దర్శకుడు సతీష్ వేగేశ్న. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘శతమానం భవతి’ ఈ సంక్రాంతికి విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు పలు విశేషాలు పంచుకున్నారు. ♦ పదిహేడేళ్ల కింద ఉద్యోగ రీత్యా సంక్రాంతి పండుగ అప్పుడు మా అమ్మానాన్నలను మిస్ అయ్యాను. చాలా బాధ అనిపించింది. అప్పుడు ‘పల్లె పయనమెటు’ అని ఓ షార్ట్ స్టోరీ రాశా. ‘కబడ్డీ కబడ్డీ’ క్లయిమాక్స్ టైమ్‌లో జగపతిబాబుగారికి చెబితే నేను ప్రొడ్యూస్ చేస్తా, షార్ట్ ఫిలిం తీద్దామన్నారు. ఆ స్టోరీతో ఫీచర్ ఫిల్మ్ తీయొచ్చు కదా అన్న నా మిత్రుల సలహా మేరకు ‘దిల్’ రాజుగారిని కలిసి, స్టోరీ లైన్ వినిపించా. డెవలప్ చేయమన్నారు. ఏడాదిన్నర టైమ్ తీసుకుని ‘శతమానం భవతి’ కథ తయారు చేశా. ♦ రచయితగా, దర్శకుడిగా నాపై ఈవీవీ సత్యనారాయణగారి ప్రభావం ఉంది. సినిమాను సినిమాగానే చూడాలి. చిన్నదా? పెద్దదా? అనే తేడా ఉండకూడదని చెప్పేవారాయన. స్క్రిప్ట్ రెండు మూడు సార్లు చదివి, కరెక్షన్స్ ఫైనల్ చేశాకే షూటింగ్ మొదలు పెట్టేవారు. అందుకే ఈవీవీగారు త్వరగా షూటింగ్ పూర్తి చేసేవారు. ♦ దర్శకుడిగా నా మొదటి సినిమా ‘దొంగలబండి’ హిట్ కాలేదు. కథ మనకు నచ్చేలా కాదు.. ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని ఆ ఓటమి నాకు పాఠం నేర్పింది. రచయితగా నలభై సినిమాలకు పని చేసిన నాకు డైరెక్టర్‌గా ‘లైఫ్ అండ్ డెత్’ అనుకుని ‘శతమానం భవతి’ చేశా. మా నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చేయకుండా ఆదరించారు. ♦ ‘శతమానం భవతి’ కథ కొత్తది కాకున్నా, సన్నివేశాలు కొత్తగా అనిపిస్తున్నాయి. మా చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఇది నా కథ అని ఎక్కడో ఒక చోట ఫీలయ్యారు. మా చిత్రం బాగుందని దర్శకులు కె.విశ్వనాథ్, దాసరి, రాఘవేంద్ర రావుగార్లు అభినందించడం మరచిపోలేను. ఈ విజయం నా బాధ్యత మరింత పెంచింది. ♦ తరాలు మారినా ఎమోషన్స్ మారవు. కమర్షియల్ సినిమాకు కథ త్వరగా రాయొచ్చు. కానీ, ఎమోషన్స్‌తో కూడిన కథ రాయడానికి టైమ్ పడుతుంది. ♦ నా తర్వాతి ప్రాజెక్ట్ ‘దిల్’ రాజుగారి బ్యానర్లోనే ఉంటుంది. త్వరలో పూర్తి వివరాలు చెబుతాం. -
సాయిధరమ్ తేజ్ స్టార్‌గా ఎదుగుతాడు
- సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ‘‘సుప్రీమ్ సినిమా చూశాను. ముఖ్యంగా ఇందులో మానసిక వికలాంగులతో తీసిన యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్‌గా ఎదుగుతాడు’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘సుప్రీమ్’ సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఈ సినిమాలో చాలా సీన్స్‌లో సాయిధరమ్ మా అన్నయ్య చిరంజీవిని గుర్తు చేశాడు’’ అని సాయికుమార్ అన్నారు, ‘‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అనిల్‌కే దక్కుతుంది. పేపర్ వర్క్ లేకుండా నాతో ఈ సినిమా చేయించాడు’’ అని రాజేంద్రప్రసాద్ చెప్పారు. ‘‘దర్శకుడు అనిల్ ఇన్పుట్స్తోనే బాలు అనే క్యారెక్టర్‌ను బాగా చేయగలిగా. రాజేంద్రప్రసాద్‌గారు, మిఖేల్, నా కాంబినేషన్లో వచ్చే సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. ‘‘నటీనటులందరూ వానరసైన్యంలా సపోర్ట్ చేశారు’’ అని అనిల్ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ క్లైమాక్స్ ఫైట్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఇంకా ఈ వేడుకలో నటులు ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాసరెడ్డి, రాశీఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
పక్కా యాక్షన్ ఎంటర్టైనర్!
సాయిధ రమ్‌తేజ్ తాజా చిత్రానికి రంగం సిద్ధమైంది. ‘పండగ చేస్కో’ చిత్రంతో గత ఏడాది ఓ కమర్షియల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ- ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. జూన్ 10న చిత్రీకరణ మొదలుపెడతాం. వైజాగ్, హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథ’’అని తెలిపారు. సాయిధరమ్‌తేజ్ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాకి మంచి కథ, మంచి టీమ్ కుదరిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: చోటా కె.నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాశ్, సమర్పణ: బేబీ భవ్య . -
అతని ఇష్టం, కష్టం ఉన్నతస్థాయికి చేరుస్తాయి..
- నిర్మాత అల్లు అరవింద్ ‘‘ ‘దిల్’ రాజు మా కుటుంబ నిర్మాత. బన్నీతో ‘ఆర్య’ తీశాడు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మా ఫ్యామిలీ నటులందరికీ తారురోడ్డు వేసి నడిపించిన చిరంజీవిగారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సాయిధరమ్ తేజ్‌కు సిన్మాలపై ఉండే ఆసక్తి, కష్టపడే తత్వమే అతణ్ణి ఉన్నతస్థాయికి తీసుకెళతాయి. ఈ వేడుక చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ విజయవంతమైన అనుభూతి కలుగుతోంది’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో రూపొందిన చిత్రం ‘సుప్రీమ్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించారు. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్ర గీతాల్ని చిరంజీవి తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్, థియేటర్ ట్రైలర్‌ని హీరోలు వరుణ్ తేజ్, నాని విడుదల చేశారు. చిరంజీవి చెల్లెళ్ళు విజయదుర్గ (సాయిధరమ్‌తేజ్ తల్లి), మాధవి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘13 ఏళ్లలో మేం 20 సినిమాలు తీయగా 16 విజయవంతమయ్యాయి. ఏడుగురు దర్శకులను పరిచయం చేశాం. నేను మా సంస్థలో సమర్పిస్తున్న తొలి సిన్మా ఇది. చిరంజీవిగారితో సినిమా చేయాలనుకుని సాయిధరమ్‌తేజ్‌తో, పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రం తీయాలనుకుని వరుణ్‌తేజ్‌తో చేస్తున్నా. సమ్మర్లో ‘సుప్రీమ్’ విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘రాజ స్థాన్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్న రవికిషన్‌కి యాక్సిడెంట్ అయింది. అయినా సరే ఆయన వచ్చి, షూటింగ్లో పాల్గొన్నారు’’ అని దర్శకుడు అన్నారు. ‘‘అభిమానుల్లో ఒక్కరిగా ఉండే నేను ఈరోజు హీరో అయ్యానంటే అందుకు కారణం - మా ముగ్గురు మావయ్యలు (చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్). ‘సుప్రీమ్’ టైటిల్ వినగానే కంగారుపడి చిరంజీవి మావయ్యకు చెబితే, ‘కంగారొద్దు. కష్టపడి చేయ’మన్నారు. వెయ్యి ఏనుగుల బలమొచ్చి చేశా’’ అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. రాశీఖన్నా, రామజోగయ్య శాస్త్రి, దర్శకులు మలినేని గోపీచంద్, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి మాట్లాడారు. -
కమాన్.. డ్యాన్స్
మేడ్చల్ మండలంలోని కండ్లకోయు సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకలో సినీ హీరో సాయిధరమ్‌తేజ్ సందడి చేశారు. విద్యార్థులతో కలిసి స్టెప్పులేసి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఉన్నత విద్యాశాఖ చైర్మన్ పాపిరెడ్డి, డెఫెన్స్ సర్వీసెస్ ఐఏఎస్ అధికారి పీఎస్ఎన్ మూర్తి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో సాయిధరమ్‌తేజ్ మేడ్చల్ రూరల్ : మండలంలోని కండ్లకోయు సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ హీరో సాయిధరమ్‌తేజ్ హాజరై సందడి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత విద్యాశాఖ చైర్మన్ పాపిరెడ్డి, డెఫెన్స్ సర్వీసెస్ ఐఏఎస్ అధికారి పీఎస్ఎన్ మూర్తి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డిలు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం కళాశాలలో రాణించిన విద్యార్థులకు హీరో సాయిధరమ్‌తేజ్, అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. అయితే వీరితో హీరో సాయి ధరమ్‌తేజ్ కలవడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కార్యక్రమంలో సీఎంఆర్ కళాశాలల కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రావులింగారెడ్డి, రోహిణీరెడ్డి, వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సెయింట్ పీటర్స్ కళాశాల వార్షికోత్సవం... మండలంలోని మైసమ్మగూడ సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం రాత్రి కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తవు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.