పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్!
సాయిధ రమ్‌తేజ్ తాజా చిత్రానికి రంగం సిద్ధమైంది. ‘పండగ చేస్కో’ చిత్రంతో గత ఏడాది ఓ కమర్షియల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ- ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. జూన్ 10న చిత్రీకరణ మొదలుపెడతాం. వైజాగ్, హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథ’’అని తెలిపారు. సాయిధరమ్‌తేజ్ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి మంచి కథ, మంచి టీమ్ కుదరిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: చోటా కె.నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాశ్, సమర్పణ: బేబీ భవ్య .