ఐఏఎస్‌ ఆఫీసర్‌ | Deva Katt is powerful story for Supreme Hero Sai Dharam Tej | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ ఆఫీసర్‌

Published Mon, Jul 13 2020 2:17 AM | Last Updated on Mon, Jul 13 2020 2:17 AM

Deva Katt is powerful story for Supreme Hero Sai Dharam Tej - Sakshi

సాయిధరమ్‌ తేజ్

త్వరలో ఐఏఎస్‌ ఆఫీసర్‌గా చార్జ్‌ తీసుకోబోతున్నారు హీరో సాయిధరమ్‌ తేజ్‌. దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారట సాయిధరమ్‌ తేజ్‌. ప్రస్తుతం ఐఏఎస్‌ ఆఫీసర్ల విధివిధానాలు, వారి బాడీ లాంగ్వేజ్‌ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారట సాయిధరమ్‌. ఫిట్‌గా కనిపించేందుకు బరువు తగ్గేలా వర్కౌట్స్‌ కూడా  చేస్తున్నారని తెలిసింది. నార్త్‌ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. కరోనా పరిస్థితులు కాస్త కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలని అనుకుంటున్నారట. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement