
సాయిదుర్గ తేజ్
‘‘నేను సినిమా కెరీర్‌ప్రాంరంభించినప్పటి నుంచి మా అమ్మ పేరు (విజయ దుర్గ) మీద నిర్మాణ సంస్థ ఆరంభించాలని ఉండేది. అందుకే అమ్మ పేరు మీద విజయదుర్గప్రో డక్షన్స్‌నుప్రాంరంభించి, ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్‌తో కలిసి ‘సత్య’ షార్ట్ ఫిలిం నిర్మించాను. మా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. అందుకే నా పేరును సాయిధరమ్ తేజ్ నుంచి సాయిదుర్గ తేజ్‌గా మార్చుకున్నాను’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు.
నవీన్ విజయకృష్ణ దర్శకత్వంలో సాయిదుర్గతేజ్, ‘కలర్స్’ స్వాతి జంటగా హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన షార్ట్ ఫిలిం ‘సత్య’. ఈ చిత్రం ప్రెస్‌మీట్‌లో సాయిదుర్గ తేజ్ మాట్లాడుతూ– ‘‘సత్య’ దాదాపు 25 ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. అవార్డులు కూడా వచ్చాయి’’ అన్నారు. ‘‘సమాజానికి తమ వంతు ఏదైనా చేయాలని చేసిన సినిమా ‘సత్య’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఇప్పటివరకు మా చిత్రానికి 25 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అన్నారు నవీన్ విజయకృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment