సాయితేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ నెల రెండో వారంలో ఈ చిత్రం థీమ్ వీడియోను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్‌లో జరుగుతోంది. ‘‘సోలో సోదర సోదరీమణులారా.. ఈ వేలెంటైన్స్ వీకెండ్‌ని మనం అంతా కలిపి జరుపుకుందాం.. మన నినాదం ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్’’ అన్నారు సాయితేజ్.
Comments
Please login to add a commentAdd a comment