నభా నటేశ్, రవితేజ
ఆన్ స్క్రీనైనా.. ఆఫ్ స్క్రీనైనా రవితేజ ఎనర్జీ లెవల్స్ ఓ లెవల్లో ఉంటాయి. ఆ రేంజ్‌లో కాకపోయినా ఆల్మోస్ట్ అదే రేంజ్ ఎనర్జీ అనేలా ఉండే ఓ నాయికను తన నెక్ట్స్ సినిమా కోసం ఎంపిక చేశారట రవితేజ అండ్ టీమ్. ఆమె ఎవరో కాదు. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తున్న ‘నన్ను దోచుకుందవటే’ హీరోయిన్ నభా నటేశ్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
ఇందులో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ నభా నటేశ్‌ని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. సో.. డిస్కో రాజాకు ఫన్ రాణి తోడయ్యారన్నమాట. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో స్టార్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్‌ను ఈ చిత్రదర్శకుడు శ్రీను వైట్ల బర్త్‌డే సందర్భంగా ఈ నెల 24న ఇవ్వనున్నారు టీమ్. ఇందులో ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment