రవితేజ
దీపావళికి సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు రవితేజ. ‘ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డిస్కో రాజా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా కథాంశం ఎలా ఉంటుందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టైమ్ మిషన్ నేపథ్యంలో సినిమా ఉంటుందన్నది సారాంశం. ఈ ఊహాగానాలకు తెర దించాలని చిత్రబృందం నిర్ణయించుకున్నారు.
అందుకే దీపావళి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ లేదా కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో స్టార్ట్ కానుంది. అంటే.. సెట్స్‌పైకి వెళ్లక ముందే సాంపిల్ చూపిస్తారన్న మాట. నభా నటేష్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ఈ సంగతి అలా ఉంచితే... శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం నవంబర్ 16న విడుదల కానుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment