టైమ్‌ మిషన్‌ ఎక్కుతున్నారు | ravi teja dual role in disco raja movie | Sakshi
Sakshi News home page

టైమ్‌ మిషన్‌ ఎక్కుతున్నారు

Published Mon, Jan 14 2019 2:52 AM | Last Updated on Mon, Jan 14 2019 2:52 AM

ravi teja dual role in disco raja movie - Sakshi

రవితేజ

పుట్టినరోజుకి ఎవరైనా ఒక సంవత్సరం ముందుకెళ్తారు. కానీ రవితేజ మాత్రం ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్లబోతున్నారట. టైమ్‌ మిషన్‌ కానీ ఎక్కబోతున్నారా? అంటే.. అలాంటిదే. దాని పేరే ‘డిస్కో రాజా’. రవితేజ  లేటెస్ట్‌ చిత్రం ఇది. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీ కొడుకుల్లా ద్విపాత్రాభినయం చేయనున్నారు.

రవితేజ పుట్టినరోజు (జనవరి 26)న ఈ చిత్రం ప్రారంభం కానుందట. రవితేజతో ‘నేల టిక్కెట్టు’ నిర్మించిన రామ్‌ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేశ్, ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ అంధురాలి పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement