రవితేజ
ఏ విషయాన్నైనా సైన్స్ సాధించగలదు. ఏ మంచైనా, ఏ చెడైనా, క్రేజీగా అయినా అంటూ... ‘డిస్కో రాజా’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శనివారం టైటిల్ లోగో రిలీజ్ చేశారు. సీతాకోక చిలుక డిజైన్‌లో డిస్కోరాజా టైటిల్ పెట్టడం, మోషన్ పోస్టర్‌లో మైండ్‌లోని న్యూరాన్స్ చూపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముగ్గురు కథానాయికలు నటించనున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఓ కథానాయికగా కన్ఫార్మ్ అయ్యారు. ‘వెన్నెల’ కిశోర్ కీలకపాత్ర చేయనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment