థ్రిల్లర్ మూవీలో హాట్ బ్యూటీ పాయల్.. ఫస్ట్ లుక్ చూశారా? | Payal Rajput Rakshana Movie First Look Poster Released, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Payal Rajput: పోలీస్ గెటప్ పాయల్.. లుక్ భలే ఉంది!

Published Sun, May 12 2024 3:27 PM | Last Updated on Sun, May 12 2024 5:02 PM

Payal Rajput Rakshana Movie First Look Poster

ఆర్ఎక్స్100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్.. సరికొత్తగా అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పోలీస్‌గా సందడి చేయనుంది. ఈ మేరకు పాయల్ నటిస్తున్న కొత్త మూవీకి 'ర‌క్ష‌ణ‌' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)

క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ కథతో తీస్తున్న ఈ సినిమాలో పాయ‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా కనిపించబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ నిర్మిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాల్ని వెల్లడించబోతున్నారు.

(ఇదీ చదవండి: తెలుగు సీరియల్‌ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్‌ పోస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement