పోలీస్‌ ఆఫీసర్‌గా పాయల్‌.. | Payal Rajput New Movie First look On 4th March | Sakshi
Sakshi News home page

మార్చి 4న పాయల్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌

Published Fri, Feb 28 2020 7:57 PM | Last Updated on Fri, Feb 28 2020 8:05 PM

Payal Rajput New Movie First look On 4th March - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. కెరీర్‌ ఆరంభంలో గ్లామర్‌ పాత్రల్లో కనిపించిన పాయల్‌.. వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాల్లో మంచి నటనతో ఆకట్టుకున్నారు. అయితే పాయల్‌ ఇప్పటివరకు తాను చేసినా పాత్రలకు భిన్నంగా ఓ సినిమా చేస్తున్నారు. తాజా చిత్రంలో ఆమె పోలీస్‌గా కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ వద్ద పలు చిత్రాలకు పనిచేసిన ప్రణదీప్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ మిస్టరీ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది. 

పాయల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ రోల్‌ చేస్తున్నారు. కైవల్య క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మార్చి 4న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు ప్రణదీప్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ పాయల్‌ను ప్రేక్షకులు ఒక విధంగా చూశారు. ఈ సినిమాలో ఆమెను మరో విధంగా చూస్తారు. పాయల్ ఇమేజ్ మార్చే విధంగా ఆమె క్యారెక్టర్ ఉంటుంది. నటిగా పాయల్‌ వైవిధ్యం చూపిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటాయి. ఒక షెడ్యూల్ మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. మార్చి మొదటివారంలో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. మార్చి నెలాఖరుకు సినిమా మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా పూర్తి చేసి వేసవిలో సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement