‘బింబిసార’ బ్లాక్‌బస్టర్‌.. మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్‌ రామ్‌ | Kalyan Ram New Movie Is Amigos Expecting in Theatres on Feb 10, 2023 | Sakshi
Sakshi News home page

Kalyan Ram: ‘బింబిసార’ తర్వాత మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్‌ రామ్‌

Published Tue, Nov 8 2022 8:46 AM | Last Updated on Tue, Nov 8 2022 8:47 AM

Kalyan Ram New Movie Is Amigos Expecting in Theatres on Feb 10, 2023 - Sakshi

‘బింబిసార’ వంటి హిట్‌ సినిమా తర్వాత కల్యాణ్‌ రామ్‌ నటిస్తున్న చిత్రం ‘అమిగోస్‌’. రాజేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో 19వ సినిమాగా రూపొందుతుంది. ఈ చిత్రానికి ‘అమిగోస్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రం బృందం.

చదవండి: చిక్కుల్లో షారుక్‌ చిత్రం, డైరెక్టర్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు

అంతేకాదు ఈ సినిమాను 2023 ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ‘దె సే వెన్‌ యు మీట్‌ సమ్‌బడీ దట్‌ లుక్స్‌ జస్ట్‌ లైక్‌ యు, యు డై’ (నీలాగే కనపడే ఇంకో వ్యక్తి నీకు ఎదురుపడితే నువ్వు చస్తావు) అనేది పోస్టర్‌పై క్యాప్షన్‌గా ఉంది. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement