రవితేజ
ఒక సినిమాను పూర్తి చేయడం ఆలస్యం మరో సినిమా సెట్లో జాయిన్ అయిపోతారు హీరో రవితేజ. ఈసారి కూడా ‘అమర్ అక్బర్ ఆంటొనీ’ షూటింగ్ అవ్వగానే మరో సెట్లో జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో యాక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు.
ఈ సినిమా దసరాకు స్టార్ట్ కానుందని సమాచారం. ముహూర్తంతో పాటు రెగ్యులర్ షూటింగ్‌ను కూడా వెంటనే స్టార్ట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో సాహసోపేతంగా ఈ స్క్రిప్ట్ ఉండబోతుందని వినికిడి. ఈ సినిమాకు ‘డిస్కో రాజా’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ తండ్రీ కొడుకుల్లా ద్విపాత్రాభినయం చేయనున్నారు. రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్స్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment