సైన్స్‌ రాజా | Ravi Teja’s next film to be Title logo launched on his birthday | Sakshi
Sakshi News home page

సైన్స్‌ రాజా

Published Fri, Jan 25 2019 3:02 AM | Last Updated on Fri, Jan 25 2019 3:02 AM

Ravi Teja’s next film to be Title logo launched on his birthday - Sakshi

రవితేజ

రవితేజ బర్త్‌డే ఈ నెల 26న. పుట్టినరోజుకి అభిమాన హీరో నుంచి కొత్త సినిమా ప్రకటన వస్తుందా? అని కొన్ని రోజులుగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకో తీపి వార్త. రవితేజ చేయబోయే తాజా చిత్రం టైటిల్‌ అండ్‌ టైటిల్‌ లోగోను ఆ రోజు విడుదల చేయనున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు.

ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. పాయల్‌ రాజ్‌పుత్‌ కన్ఫార్మ్‌ అయ్యారు. మరో హీరోయిన్‌గా నభా నటేష్‌ కన్ఫార్మ్‌ అయ్యారట. ‘‘జనవరి 26 రిపబ్లిక్‌ డే. అలాగే రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తాం. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. సైంటిఫిక్‌ అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్ర చేయనున్న ఈ సినిమాలో విలన్‌గా తమిళ నటుడు బాబీ సింహా నటిస్తారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement