బ్రదర్స్‌... బాక్సర్స్‌? | Ram Charan and Jr NTR As Boxers For SS Rajamouli's Movie | Sakshi
Sakshi News home page

బ్రదర్స్‌... బాక్సర్స్‌?

Published Tue, Nov 28 2017 11:29 PM | Last Updated on Tue, Nov 28 2017 11:48 PM

Ram Charan and Jr NTR As Boxers For SS Rajamouli's Movie - Sakshi

ఎన్టీఆర్‌–రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రాజమౌళి ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. నిజంగా ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ‘జవాన్‌’ ప్రమోషన్స్‌లో.. ఈ సినిమా ఉందని సాయిధరమ్‌ తేజ్‌ క్లారిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పుడు మరో చర్చ మొదలైంది. ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? ఇందులో ఎన్టీఆర్‌–చరణ్‌ అన్నదమ్ములుగా నటిస్తారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. దాంతోపాటు సినిమా బ్యాక్‌డ్రాప్‌ని కూడా కొందరు బయటపెట్టారు. ఇది స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందన్నది వారి ఊహ. ఇందులో ఎన్టీఆర్‌–చరణ్‌ బాక్సర్లుగా కనిపిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. అది మాత్రమే కాదు.. హీరోలిద్దరూ అసలు సిసలైన బాక్సర్లుగా కనిపించడం కోసం ఫిజిక్‌ పెంచనున్నారట. కండలు పెంచి, బాక్సింగ్‌ రింగ్‌లో ఈ ఇద్దరూ పంచ్‌లు కొడుతుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవని చెప్పుకుంటున్నారు. మరి.. రాజమౌళి మనసులో ఏ కథ ఉందో? వేచి చూద్దాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement