కమాన్.. డ్యాన్స్ | CMR Engineering College Anniversary Celebration chief guest as Sai Dharam Teja | Sakshi
Sakshi News home page

కమాన్.. డ్యాన్స్

Published Sat, Apr 9 2016 2:08 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కమాన్.. డ్యాన్స్ - Sakshi

కమాన్.. డ్యాన్స్

మేడ్చల్ మండలంలోని కండ్లకోయు సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకలో సినీ హీరో సాయిధరమ్‌తేజ్ సందడి చేశారు. విద్యార్థులతో కలిసి స్టెప్పులేసి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఉన్నత విద్యాశాఖ చైర్మన్ పాపిరెడ్డి, డెఫెన్స్ సర్వీసెస్ ఐఏఎస్ అధికారి పీఎస్‌ఎన్ మూర్తి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
 
ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో సాయిధరమ్‌తేజ్
 మేడ్చల్ రూరల్ : మండలంలోని కండ్లకోయు సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ హీరో సాయిధరమ్‌తేజ్ హాజరై సందడి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత విద్యాశాఖ చైర్మన్ పాపిరెడ్డి, డెఫెన్స్ సర్వీసెస్ ఐఏఎస్ అధికారి పీఎస్‌ఎన్ మూర్తి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డిలు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

అనంతరం కళాశాలలో రాణించిన విద్యార్థులకు హీరో సాయిధరమ్‌తేజ్, అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. అయితే వీరితో హీరో సాయి ధరమ్‌తేజ్ కలవడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కార్యక్రమంలో సీఎంఆర్ కళాశాలల కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రావులింగారెడ్డి, రోహిణీరెడ్డి, వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
సెయింట్ పీటర్స్ కళాశాల వార్షికోత్సవం...
మండలంలోని మైసమ్మగూడ సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం రాత్రి కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తవు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement