
మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక తాజాగా కూకట్‌పల్లి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో రాజస్థాన్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత రెండేళ్ల పాటు బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు.
(ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక)
ఇటీవల జరిగిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌లోనూ చైతన్య కనిపించలేదు. జొన్నలగడ్డ చైతన్య కూడా తన ఫ్యామిలీతో కలిసి తిరుమలలో కనిపించారు. దీంతో వీరిద్దరు డైవర్స్ తీసుకుంటున్నట్లు చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా నిహారిక పిటిషన్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు కన్‌ఫార్మ్ చేసింది. అయితే ఈ జంట ఇంత త్వరగా విడిపోవడానికి కారణాలేంటనేది ఇప్పటికి వరకు తెలియరాలేదు. అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనలే విడాకులకు దారితీసి ఉంటాయని నెట్టింట చర్చ మొదలైంది. మరికొందరు పరస్పర విభేదాలే ఈ జంట విడిపోవడానికి కారణమని చెబుతున్నారు.
పెళ్లి తరువాత నిహారిక నిత్యం వివాదాలు తలెత్తాయి. ఒకసారి పబ్ పార్టీలో నిహారిక పేరు వినిపించడంతో ఆ వార్త పెద్దఎత్తున వైరలైంది. ఆ తర్వాత అపార్ట్‌మెంట్ వాళ్లతో గొడవ సందర్భంగా నిహారికను మరో వివాదం చుట్టుముట్టింది. దీంతో ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తి విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!)
Comments
Please login to add a commentAdd a comment