
మెగా డాటర్ నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధాన్ని కాపాడుకోలేకపోయారు. పెళ్లయిన మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు. విడాకుల గురించి చాలాకాలం మౌనంగా ఉన్న నిహారిక ఇటీవలే కాస్త ఓపెన్ అయింది. ఓ పాడ్‌కాస్ట్‌లో.. పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని.. అందరూ కన్నతల్లిదండ్రుల్లా ప్రేమగా మెదలరని చైతన్య గురించి చెప్పకనే చెప్పింది.
మూడేళ్లకే విడాకులు
పెళ్లి- విడాకుల వ్యవహారం ద్వారా ఎవరినీ నమ్మకూడదని తెలిసొచ్చిందని, ఇదొక గుణపాఠమని వ్యాఖ్యానించింది. దీనిపై చైతన్య జొన్నలగడ్డ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. పెళ్లి పెటాకులైతే ఆ బాధ ఇద్దరికీ ఉంటుంది.. దానినుంచి బయటపడటం కూడా రెండువైపులా ఒకేలా ఉంటుంది. ఒకరి వర్షనే మాట్లాడి దాన్ని హైలెట్ చేయడం గొప్ప కాదని విమర్శించాడు. తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. నిశ్శబ్దం ఎంత పదునైందో వివరిస్తూ ఓ లేఖ పంచుకున్నాడు.
జీవితం ఎటు పోతోందో..
'విశాల అంతరిక్షంలో నిశ్శబ్దం.. నీటి అడుగున ఉన్నప్పుడు అదే నిశ్శబ్దం.. చల్లని శీతకాలపు రాత్రుల్లో ఆవరించే నిశ్శబ్దం.. షో ముగియగానే చప్పట్లు కొట్టేముందు వచ్చే నిశ్శబ్దం.. మీ మనసును ముక్కలు చేసే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం.. జీవితం ఎటు పోతోందో అర్థం కాని ఆలోచనల్లో అలుముకునే నిశ్శబ్దం.. ఈ సైలెన్స్ ప్రాణ శక్తి నుంచి ప్రకృతి శక్తిని దూరం చేస్తుందా..! భౌతిక రూపం నుంచి విముక్తి పొందండి.. అప్పుడు భగవంతుడితో మనల్ని కలిపే మాధ్యమే ఈ సైలెన్స్ అని మీరు తప్పక గుర్తిస్తారు' అని రాసుకొచ్చాడు. నిశ్శబ్దమే అన్నింటికంటే అతిపెద్ద ఆయుధమని పరోక్షంగా చెప్తున్నాడు.
చదవండి: ఇంత దారుణమైన ట్రోలింగ్ ఎప్పుడూ చూడలేదు.. నటి ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment