మెంటల్‌ మదిలో... | Mental Madilo Movie Released in July | Sakshi
Sakshi News home page

మెంటల్‌ మదిలో...

Published Tue, May 2 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

మెంటల్‌ మదిలో...

మెంటల్‌ మదిలో...

మన మన మెంటల్‌ మదిలో... పాటను మరచిపోలేం? ‘ఓకే బంగారం’ తర్వాత యూత్‌ మొత్తం ఈ పాటనే పాడుకుంటోంది. అంత పాపులర్‌ అయింది. ఇప్పుడు అదే పాటలోని ‘మెంటల్‌ మదిలో’ అనే పదాలనే టైటిల్‌గా పెట్టి, ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్‌ కందుకూరి ఓ సినిమా నిర్మించారు.

శ్రీ విష్ణు, నివేతా పేతురాజ్‌ జంటగా ధర్మపద క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌S జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలను కుంటున్నారు. ఈ సందర్భంగా రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ– ‘‘పెళ్ళి చూపులు’ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాను.

 శ్రీ విష్ణు, నివేతాల నటన అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. వివేక్‌ ఆత్రేయ టేకింగ్‌ సూపర్‌. ప్రశాంత్‌ విహారి పాటలు సినిమాకు హైలైట్‌. త్వరలోనే ట్రైలర్, ఆడియో విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేదరామన్, ఎడిటింగ్‌: విప్లవ్‌ న్యాషాదమ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement