Mental Madilo
-
కొత్త హీరో... కొత్త డైరెక్టర్
‘పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో’ వంటి చిత్రాలని నిర్మించడంతో పాటు జాతీయ, ఫిల్మ్ ఫేర్ అవార్డులని సొంతం చేసుకున్న నిర్మాత రాజ్ కందుకూరి. ఇప్పుడు ఆయన తన కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇండియాకి వచ్చారు శివ. ధర్మపథ క్రియేషన్స్‌పై రూపొందనున్న ఈ చిత్రంతో శేష సింధురావ్ అనే లేడీ డైరెక్టర్ని సినిమా రంగానికి పరిచయం చేస్తున్నారు రాజ్ కందుకూరి. దర్శకులు సుకుమార్, క్రిష్‌ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు శేష సింధురావ్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘96’ చిత్రం ఫేమ్ వర్ష ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ‘మహానటి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన పద్మావతి విశ్వేశ్వర్ ఈ చిత్రానికి దర్శకురాలితో కలిసి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ చిత్రానికి సమర్పణ: దగ్గుబాటి సురేశ్ బాబు, ‘మధుర’ శ్రీధర్, కెమెరా: వేద వర్మ. -
నెలలోపు టీవీలో వేస్తే నష్టమే – డి. సురేశ్‌బాబు
‘‘ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్, చాలా మంది సక్సెస్ మీట్లు పెడుతున్నారు. అయితే నిజమైన సక్సెస్‌మీట్‌లేవో తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సినిమా రిలీజ్ అయి నెల దాటకుండానే టీవీలో వేసేస్తున్నారు. దానివల్ల చాలా నష్టం వస్తుంది. కోటి రూపాయిల సినిమాకు పబ్లిసిటీ కోసం మరో కోటి ఖర్చు చేస్తున్నారు. అదే థియేటర్లో ఫ్రీగా ట్రైలర్లు ప్రదర్శించుకునే అవకాశం కలిపిస్తే చిన్న సినిమాలకు ఊరటగా ఉంటుంది. అలాగే వారంలో పదీ పదిహేను సినిమాలు రిలీజ్ చేయడంవల్ల థియేటర్లు లేక ఇబ్బందులుపడుతున్నారు. నిర్మాతలు కలిసికట్టుగా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చు’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. ‘పెళ్లి చూపులు’ వంటి విజయం తర్వాత డి. సురేశ్‌బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ గత నెల 24న విడుదలైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీ విష్ణు, నివేధా పెతురాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ‘‘ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్స్‌తో పాటు మంచి టాక్‌తో దూసుకెళ్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా అనాలసిస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘బ్రోచెవారెవరు రా’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని శ్రీ విష్ణు, వివేక్ ఆత్రేయ అన్నారు. సినిమా విజయం పట్ల సంగీతదర్శకుడు ప్రశాంత్ విహారి ఆనందం వ్యక్తం చేశారు. -
రియల్ లైఫ్‌లో ఫుల్ క్లారిటీ
‘‘అప్పట్లో ఒకడుండేవాడు’ రిలీజ్ టైమ్‌లో నిర్మాత రాజ్ కందుకూరి దర్శకుడు వివేక్‌ను నా వద్దకు పంపారు. మొదటి 10 నిముషాల కథ వినగానే ‘మెంటల్ మదిలో’ చిత్రానికి ఓకే చెప్పేశా’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు.శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ... ► ఈ చిత్రంలో ప్రతి విషయానికీ కన్ఫ్యూజ్ అయ్యే పాత్ర నాది. కానీ, రియల్ లైఫ్‌లో సరైన నిర్ణయాలు తీసుకుంటా. నాకు ఏది సరిపోతుందో దాన్నే ఎంచుకుంటా. కథ బాగుండీ నాకు సెట్టవ్వకపోతే చేయను. అదే నా పాలసీ. మా చిత్రాన్ని ఫస్ట్ చూసింది నారా రోహితే. చాలా బాగుందన్నారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఎక్కువ డబ్బులు వచ్చింది ‘మెంటల్ మదిలో’ చిత్రానికే. ► ఇది రెగ్యులర్ స్టోరీ కాదు. స్క్రీన్‌ప్లేలో చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఇందులో నచ్చకపోవడానికి ఏమీ ఉండదు. సింపుల్‌గా ఉంటుంది. కొంతమందికి విపరీతంగా నచ్చేసింది. నాకు, శివాజీరాజాగారికి మధ్య వచ్చే సీన్లు, హీరోయిన్లతో నా లవ్ ట్రాక్స్ ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేశాయి. ► కథలో నేను ఒక్కడినే మార్పులు చెప్పను. అందరం చర్చించుకున్నాక అవసరమైన మార్పులు.. చేర్పులు చేసుకుంటుంటాం. దర్శకులు చెప్పిన కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తా. ► నా తాజా సినిమా ‘నీది నాది ఒకే కథ’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘సుర’ డైరెక్టర్ విజయ్‌తో ‘తిప్పరా మీసం’ సినిమా చేస్తున్నా. ‘వీర భోగ వసంతరాయలు’ కూడా చిత్రీకరణలో ఉంది. -
విజయంతో పాటు గౌరవం
‘‘పెళ్ళి చూపులు’కు ఎంత పేరొచ్చిందో ‘మెంటల్ మదిలో’ చిత్రానికీ అంతే పేరొచ్చింది. సినిమా బాగుందని అందరూ అభినందిస్తున్నారు’’ అని రాజ్ కందుకూరి అన్నారు. శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్ నిర్వహించారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా పదిమంది టెక్నీషియన్స్ పరిచయమయ్యారు. వీళ్లు మరో ఇరవై సినిమాలు చేస్తారు. నా బ్యానర్ నుంచి వచ్చిన వారు ఇలా సినిమాలు చేస్తున్నారని గొప్పగా ఫీలవుతా. ఇటువంటివారిలో వివేక్ ఆత్రేయ, సంగీత దర్శకుడు ప్రశాంతి విహారి, కెమెరామెన్ వేద రామన్, ఎడిటర్ విప్లవ్ కూడా ఉంటారనడంలో సందేహం లేదు. నేను ఏడాదికి ఒక సినిమా చేయగలను. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే కొత్తవారిని నా సినిమాల ద్వారా పరిచయం చేస్తా’’ అన్నారు. ‘‘మంచి హిట్‌తో పాటు గౌరవం తెచ్చిన సినిమా ఇది. ఈ చిత్రం బాగుందని అందరూ అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘ఇళయరాజాగారి, ఎ.ఆర్. రెహమాన్‌గారి పాటలు విన్నప్పుడు అప్పుడే అయిపోయాయా అనే ఫీలింగ్ కలుగుతుంది. ‘మెంటల్ మదిలో’ జర్నీలో ఈ సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించింది’’ అన్నారు వివేక్ ఆత్రేయ. ‘మా’ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, రచయితలు భాస్కరభట్ల, సిరా శ్రీ, నటి అనితా చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లిళ్లు, శుభకార్యాలున్నా... ప్రేక్షకులు థియేటర్లకొచ్చారు!
‘‘ఈ నాలుగు రోజుల్లో బోల్డన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నాయి. అయినా... ప్రేక్షకులు సినిమాను చక్కగా ఆదరిస్తున్నారు. 80 శాతం థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మెంటల్ మదిలో’ శుక్రవారం విడుదలైంది. డి. సురేశ్‌బాబు సమర్పకులుగా వ్యవహరించిన ఈ సినిమా సక్సెస్ మీట్ శనివారం జరిగింది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ కాపీ రాగానే సురేశ్‌బాబుగారు 10రోజులు స్పెషల్ షోలు వేయమని చెప్పారు. ఆయన కాన్ఫిడెన్స్‌కి థ్రిల్లయ్యా. ఆ పది రోజులూ ఐసీయులో పేషెంట్ ఎలా ఉన్నాడని ఆరా తీసినట్టు... టెన్షన్ పడేవాణ్ణి. ప్రేక్షకులు సినిమాను ఆదరించడంతో హ్యాపీగా ఉంది. వివేక్ లాంటి దర్శకులు ఎక్కువమంది ఉన్నా... రాజ్ కందుకూరి వంటి నిర్మాత ఒక్కరే ఉన్నారు. ఇటువంటి సినిమాలను ఆదరిస్తే... ఎక్కువమంది రాజ్ కందుకూరిలు ఇండస్ట్రీకి వస్తారు’’ అన్నారు. ‘‘సినిమా విడుదలకు ముందు సురేశ్‌బాబుగారు అందించిన సహకారం మరువలేనిది. శ్రీవిష్ణు, శివాజీరాజా (హీరో తండ్రి పాత్ర) ఇద్దరూ మా సినిమాలో హీరోలే. శ్రీవిష్ణు కోసం అతిథి పాత్రలో నటించిన నారా రోహిత్‌గారికి థ్యాంక్స్. మా టీమ్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘రోజా రమణిగారు ‘ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమా చూసి, ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుకి కాల్ చేయడం ఇదే తొలిసారి’ అన్నారు. అంతకంటే గొప్ప అభినందన ఏముంటుంది’’ అన్నారు శివాజీ రాజా. ఈ కార్యక్రమంలో దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి, నటి అనితా చౌదరి, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి తదితరులు పాల్గొన్నారు. -
మనసుకు నచ్చిన కథ
‘‘పెళ్లిచూపులు’ వంటి భారీ హిట్ తర్వాత నేను బిగ్ మూవీ చేస్తానని అందరూ అనుకున్నారు. నాకూ చేయాలని ఉంది. కానీ కొత్త దర్శకులతో పని చేస్తే ఎక్కువ ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఎడిటింగ్, కెమెరా, ఆర్ట్.. ఇలా డిఫరెంట్ క్రాఫ్ట్స్‌లో కొత్తవారిని పరిచయం చేశా’’ అన్నారు రాజ్ కందుకూరి. శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో ఆయన నిర్మించిన ‘మెంటల్ మదిలో’ సినిమా ఈ రోజు విడుదల కానుంది. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘నా మనసుకు నచ్చిన కథ ఇది. హీరో పాత్రకు సరిపోయే టైటిల్ పెట్టాం. శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడు. శివాజీరాజాగారి పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్. వివేక్ బాగా తెరకెక్కిం చాడు. సురేశ్‌బాబు గారు సినిమా చూసి బాగుంది అంటే చాలా ఆనందంగా ఉంటుంది. రాజ్ కందుకూరి చేస్తే మంచి సినిమాలే చేస్తాడు. బ్యాడ్ మూవీ మాత్రం చేయడని అందరూ చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. నెక్ట్స్ మరో షార్ట్‌ఫిల్మ్ దర్శకునితో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. -
విశ్వనాథ్‌గారి కథను మణిరత్నం డైరెక్ట్ చేస్తే...– శ్రీవిష్ణు
శ్రీవిష్ణు, నివేతా పెతురాజ్ జంటగా డి. సురేశ్‌బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన సినిమా ‘మెంటల్ మదిలో’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ నెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్, పాటల వేడుక నిర్వహించారు. ఆడియో సీడీలను సురేశ్‌బాబు–విజయ్ దేవరకొండ, ట్రైలర్‌ను నారా రోహిత్ విడుదల చేశారు. ‘‘సినిమా చూసి బాగా ఏంజాయ్ చేశా. శ్రీవిష్ణు బాగా నటించాడు. నా సిన్మా కూడా ఈ 24నే విడుదలవుతోంది. రెండూ బాగా ఆడి నిర్మాతలకు డబ్బులు తీసుకురావాలి. పోటీగా అనుకోవడం లేదు’’ అన్నారు నారా రోహిత్. ‘‘ప్రీమియర్ షోలు చూసిన వాళ్లంతా సినిమా బాగుందంటున్నారు. పరీక్ష రాశాం. ప్రేక్షకుల రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సురేశ్‌బాబుగారు కొండంత అండ. నన్ను, నా టీమ్‌ని నమ్మి మరొక్క అవకాశం ఇచ్చిన ఆయనకి థ్యాంక్స్. తరుణ్ భాస్కర్ (‘పెళ్లి చూపులు’ దర్శకుడు) తర్వాత వివేక్‌ను మా బ్యానర్లో పరిచయం చేయడం ఆనందంగా ఉంది. శ్రీ విష్ణు బాగా నటించాడు’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘లైప్ ఈజ్ బ్యూటీఫుల్’లో నేను, శ్రీ విష్ణు చిన్న పాత్రల్లో నటించాం. తన సినిమాలు బాగుంటాయని వింటూనే ఉన్నాను. ఈ సినిమా పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘విశ్వనాథ్‌గారి కథను తీసుకుని, ఆ కథకు జంధ్యాలగారు మాటలు రాసి చిన్న బడ్జెట్‌తో మణిరత్నంగారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంటుందీ సిన్మా. ఇది నా పర్సనల్ ఫీలింగ్’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ వేడుకలో దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్, నిర్మాత ‘మధుర’ శ్రీధర్, ప్రశాంత్ విహరి, ‘కళామందిర్’ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
'మెంటల్ మదిలో..' ప్రీ రిలీజ్ వేడుక
-
ఇద్దరు మిత్రుల సవాల్
నారా వారబ్బాయి రోహిత్, యంగ్ హీరో శ్రీవిష్ణుల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. తన ప్రతీ సినిమాలో శ్రీవిష్ణుకు కీలక పాత్రలు ఇవ్వటంతో పాటు తానే స్వయంగా నిర్మాతగా మారి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో శ్రీవిష్ణుకు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న వీరభోగవసంత రాయలు సినిమాలో కూడా ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అయితే ఇంతటి స్నేహంగా ఉంటున్న ఈ ఇద్దరు యంగ్ హీరోలు బాక్సాఫీస్ ముందు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ఫ్యాక్షన్ మూవీ బాలకృష్ణుడు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన మెంటల్ మదిలో సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య పోటీ తప్పేలాలేదు. రోహిత్ సిక్స్ప్యాక్లుక్లో కనిపిస్తుండటంతో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ బాలకృష్ణుడు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేశాయి. పెళ్లిచూపులు లాంటి క్లాస్ హిట్ తరువాత రాజ్ కందుకూరి, సురేష్ బాబులు నిర్మిస్తున్న మెంటల్ మదిలో సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ ఇద్దరు మిత్రుల్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. -
పెళ్లి చూపులు అంతటి హిట్ అవ్వాలి
– డి. సురేశ్‌బాబు ‘‘మెంటల్ మదిలో’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్లో కథ గురించి చెప్పిన విషయాలు ఆసక్తిగా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘పెళ్లి చూపులు’లానే ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలి’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘మెంటల్ మదిలో’. ఈ చిత్రం ట్రైలర్‌ను సురేశ్‌బాబు విడుదల చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘షార్ట్ ఫిల్మ్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకొన్న వివేక్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. మా టీమ్ అంతా సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ట్రైలర్ రిలీజ్ చూసి, మమ్మల్ని సురేశ్‌గారు అభినందించడం హ్యాపీగా ఉంది. త్వరలోనే పాటలను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
మెంటల్ మదిలో...
మన మన మెంటల్ మదిలో... పాటను మరచిపోలేం? ‘ఓకే బంగారం’ తర్వాత యూత్ మొత్తం ఈ పాటనే పాడుకుంటోంది. అంత పాపులర్ అయింది. ఇప్పుడు అదే పాటలోని ‘మెంటల్ మదిలో’ అనే పదాలనే టైటిల్‌గా పెట్టి, ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి ఓ సినిమా నిర్మించారు. శ్రీ విష్ణు, నివేతా పేతురాజ్ జంటగా ధర్మపద క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్S జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలను కుంటున్నారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘పెళ్ళి చూపులు’ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాను. శ్రీ విష్ణు, నివేతాల నటన అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. వివేక్ ఆత్రేయ టేకింగ్ సూపర్. ప్రశాంత్ విహారి పాటలు సినిమాకు హైలైట్. త్వరలోనే ట్రైలర్, ఆడియో విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేదరామన్, ఎడిటింగ్: విప్లవ్ న్యాషాదమ్. -
పెళ్లిచూపులు తరువాత మెంటల్ మదిలో
పెళ్లిచూపులు సినిమాతో బిగ్ హిట్ అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో ఇంట్రస్టింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లిచూపులు తరహాలోనే 'మెంటల్ మదిలో' పేరుతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించిన శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నాడు. నివేథ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీవిష్ణు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేన్ లా కనిపిస్తున్నాడు. కథ ఎపింకలో కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్న శ్రీవిష్ణు ఈ సినిమాతో మరో విజయం అందుకుంటానన్న నమ్మకంతో ఉన్నాడు. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండటం సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది.