
‘‘పెళ్లిచూపులు’ వంటి భారీ హిట్ తర్వాత నేను బిగ్ మూవీ చేస్తానని అందరూ అనుకున్నారు. నాకూ చేయాలని ఉంది. కానీ కొత్త దర్శకులతో పని చేస్తే ఎక్కువ ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఎడిటింగ్, కెమెరా, ఆర్ట్.. ఇలా డిఫరెంట్ క్రాఫ్ట్స్‌లో కొత్తవారిని పరిచయం చేశా’’ అన్నారు రాజ్ కందుకూరి. శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో ఆయన నిర్మించిన ‘మెంటల్ మదిలో’ సినిమా ఈ రోజు విడుదల కానుంది.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘నా మనసుకు నచ్చిన కథ ఇది. హీరో పాత్రకు సరిపోయే టైటిల్ పెట్టాం. శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడు. శివాజీరాజాగారి పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్. వివేక్ బాగా తెరకెక్కిం చాడు. సురేశ్‌బాబు గారు సినిమా చూసి బాగుంది అంటే చాలా ఆనందంగా ఉంటుంది. రాజ్ కందుకూరి చేస్తే మంచి సినిమాలే చేస్తాడు. బ్యాడ్ మూవీ మాత్రం చేయడని అందరూ చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. నెక్ట్స్ మరో షార్ట్‌ఫిల్మ్ దర్శకునితో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment