ఇద్దరు మిత్రుల సవాల్‌ | Nara Rohith, Srivishnu movies to release on same date | Sakshi
Sakshi News home page

ఇద్దరు మిత్రుల సవాల్‌

Nov 5 2017 10:41 AM | Updated on Nov 5 2017 10:41 AM

Nara Rohith, Srivishnu movies  to release on same date - Sakshi

నారా వారబ్బాయి రోహిత్‌, యంగ్‌ హీరో శ్రీవిష్ణుల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. తన ప్రతీ సినిమాలో శ్రీవిష్ణుకు కీలక పాత్రలు ఇవ్వటంతో పాటు తానే స్వయంగా నిర్మాతగా మారి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో శ్రీవిష్ణుకు బ్రేక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం సెట్స్‌ మీదున్న వీరభోగవసంత రాయలు సినిమాలో కూడా ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అయితే ఇంతటి స్నేహంగా ఉంటున్న ఈ ఇద్దరు యంగ్‌ హీరోలు బాక్సాఫీస్‌ ముందు అమీతుమీకి సిద్ధమవుతున్నారు.

నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కిన ఫ్యాక్షన్‌ మూవీ బాలకృష్ణుడు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన మెంటల్‌ మదిలో సినిమాను రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య పోటీ తప్పేలాలేదు. రోహిత్‌ సిక్స్‌ప్యాక్‌లుక్‌లో కనిపిస్తుండటంతో పాటు ఇప్పటికే రిలీజ్‌ ​అయిన స్టిల్స్‌ బాలకృష్ణుడు సినిమా మీద మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. పెళ్లిచూపులు లాంటి క్లాస్‌ హిట్‌ తరువాత రాజ్‌ కందుకూరి, సురేష్‌ బాబులు నిర్మిస్తున్న మెంటల్‌ మదిలో సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ ఇద్దరు మిత్రుల్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement