
‘‘ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్, చాలా మంది సక్సెస్ మీట్‌లు పెడుతున్నారు. అయితే నిజమైన సక్సెస్‌మీట్‌లేవో తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సినిమా రిలీజ్ అయి నెల దాటకుండానే టీవీలో వేసేస్తున్నారు. దానివల్ల చాలా నష్టం వస్తుంది. కోటి రూపాయిల సినిమాకు పబ్లిసిటీ కోసం మరో కోటి ఖర్చు చేస్తున్నారు. అదే థియేటర్లో ఫ్రీగా ట్రైలర్లు ప్రదర్శించుకునే అవకాశం కలిపిస్తే చిన్న సినిమాలకు ఊరటగా ఉంటుంది. అలాగే వారంలో పదీ పదిహేను సినిమాలు రిలీజ్ చేయడంవల్ల థియేటర్లు లేక ఇబ్బందులుపడుతున్నారు. నిర్మాతలు కలిసికట్టుగా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చు’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు.
‘పెళ్లి చూపులు’ వంటి విజయం తర్వాత డి. సురేశ్‌బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ గత నెల 24న విడుదలైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీ విష్ణు, నివేధా పెతురాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ‘‘ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్స్‌తో పాటు మంచి టాక్‌తో దూసుకెళ్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా అనాలసిస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘బ్రోచెవారెవరు రా’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని శ్రీ విష్ణు, వివేక్ ఆత్రేయ అన్నారు. సినిమా విజయం పట్ల సంగీతదర్శకుడు ప్రశాంత్ విహారి ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment