కథ చెప్పమంటే లేదన్నాడు | he says no story - hero akhil | Sakshi
Sakshi News home page

కథ చెప్పమంటే లేదన్నాడు

Published Sun, Aug 14 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

కథ చెప్పమంటే లేదన్నాడు

కథ చెప్పమంటే లేదన్నాడు

‘‘యూట్యూబ్‌లో ‘అను కోకుండా’ అనే షార్ట్‌ఫిల్మ్ చూసి, తరుణ్‌కి కాల్ చేశా. వచ్చి కలిశాడు. ఓ ప్రేమకథ ఉంటే చెప్పమన్నాను. కథ లేదని చెప్పాడు. ఇప్పుడు ‘పెళ్లి చూపులు’తో దర్శకుడిగా మారి సక్సెస్ అందుకున్నాడు. తరుణ్‌తో సినిమా చేయాలని ఉంది’’ అన్నారు అఖిల్. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం ‘పెళ్లిచూపులు’. ఆదివారం జరిగిన ఈ చిత్రం విజయోత్సవంలో అఖిల్ పాల్గొన్నారు.

‘‘గత పదేళ్లలో నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తై ఈ సినిమా మరో ఎత్తు’’ అని రాజ్ కందుకూరి అన్నారు. దర్శకులు నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, హీరో రాజ్ తరుణ్, చిత్రనాయకా నాయికలు విజయ్ దేవరకొండ, రీతూవర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: డి.సురేశ్ బాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement