పెళ్ళిచూపులు, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అలాగే బ్రహ్మానందం సీన్స్‌తో కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమా నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పణలో నవంబరు 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు.
Unleashing the madness of #KeedaaCola. Mothaa mogipovaali 💥🥁#KeedaaColaTrailer is here!https://t.co/WNeT1GvOcs#KeedaaColaOnNov3 🪳@TharunBhasckerD @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns @saregamasouth pic.twitter.com/a2RQIpDes7
— Rana Daggubati (@RanaDaggubati) October 18, 2023
Comments
Please login to add a commentAdd a comment