
టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్‌యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా వచ్చింది ఫ్రెండ్స్. రెస్ట్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. కరోనాను సీరియస్‌గా తీసుకోండి ఫ్రెండ్స్ అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు.
'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో వెంకటేశ్‌తో ఓ సినిమా చేయనున్నారన్న వార్తలు వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం సెట్స్ మీదకి వెళ్లలేదు.
Comments
Please login to add a commentAdd a comment