దిగ్దర్శకులుగా క్రిష్, తరుణ్ | Krish, Tarun Bhasker as Kv reddy, Singeetham in Mahanati | Sakshi
Sakshi News home page

దిగ్దర్శకులుగా క్రిష్, తరుణ్

Published Sat, Oct 21 2017 4:11 PM | Last Updated on Sat, Oct 21 2017 4:11 PM

Krish Tarun Bhasker

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించనుంది. అంతేకాదు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితులైన మహానటుల పాత్రల్లో ఈ తరం నటీనటులు దర్శనమివ్వనున్నారు. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కాస్టింగ్ కు సంబంధించి ఆసక్తికరమైన అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. తెలుగు సినిమా ఖ్యాతీని పెంచిన దిగ్గజ దర్శకులు కెవీ రెడ్డి పాత్రలో ఈ తరం దర్శకుడు క్రిష్, మాయాబజార్ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ పాత్రలో పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు. వీరితో ఇతర కీలక పాత్రల్లో సమంత, రాజేంద్ర ప్రసాద్, షాలినీ పాండే లు నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement