KV reddy
-
నేడు సినీ మార్గదర్శకుడు కేవీ రెడ్డి వర్ధంతి
సినిమాకు ఒక విధానం ఉందనీ, ఆ విధానానికి ఒక శాస్త్రం ఉందనీ, దాన్ని అనుసరించే సినిమాలు తీయాలని చెప్పి, చేసి చూపిన దర్శక మేధావి కేవీ రెడ్డి. సరైన స్క్రిప్టు సినిమాకు ముఖ్యమనీ, స్క్రీన్‌ప్లే సిద్ధమైతే సినిమా మూడొంతులు పూర్తయినట్టేనని నిరూపించిన దక్షిణ భారతదేశ దర్శకుల్లో అగ్రగణ్యులు. దర్శకునిగా కేవీ రెడ్డి మూడు దశా బ్దాల కాలంలో తీసిన సినిమాల సంఖ్య కేవలం 14. తమిళ, హిందీ వెర్షన్లతో కలిపితే 18. వీటిలో 5 పౌరాణికాలు, నాలుగు జానపదాలు, 3 సాంఘికాలు, రెండు చారిత్రకాలు ఉన్నాయి. ఆయన పేరు చెప్పగానే ‘మాయాబజార్’, ‘పాతాళభైరవి’, ‘గుణసుందరి కథ’, ‘దొంగ రాముడు’ గుర్తొస్తాయి. కేవీ 1937లో తన మిత్రుడు మూలా నారాయణస్వామి భాగ స్వామిగా ఉన్న ‘రోహిణీ పిక్చర్స్’లో ప్రొడ క్షన్ ఎగ్జిక్యూటివ్ గా చేరడంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. అప్పట్లో రోహిణీ పిక్చర్స్ హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938) తీసింది. ఇక్కడే ఆయనకి బీఎన్ రెడ్డి, సముద్రాల, నాగిరెడ్డిలతో పరిచయమైంది. తర్వాత వీరంతా బయటికి వచ్చి వాహినీ పిక్చర్స్ స్థాపించారు. వాహినీ పతాకంపై బీఎన్ తీసిన ‘వందేమాతరం’ (1939), ‘సుమంగళి’ (1940), ‘దేవత’ (1941) చిత్రాలకు కేవీ సహాయ దర్శకులుగా చేశారు. దేవత తరువాత కేవీకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అది మూలా నారాయణస్వామి పెట్టుబడితో తీసిన ‘భక్తపోతన’ (1942). అది రజతోత్సవాలు జరుపుకుంది. ‘గుణసుందరి కథ’ (1949) విజయం ఇచ్చిన ప్రేరణతో విజయావారికి మరో అద్భుత జనరంజకం ‘పాతాళభైరవి’ (1951) తీశారు. ‘మాయాబజార్’ (1957) ఒక చరిత్రను సృష్టించింది. కేవీ దర్శకత్వ ప్రతిభకు, పకడ్బందీ స్క్రీన్ ప్లేకు ఈ చిత్రం ఒక తిరుగులేని సిలబస్. తెలుగు చిత్ర రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కేవీ రెడ్డి (కదిరి వెంకటరెడ్డి) 1912 జులై 1న అనంతపురం జిల్లా తాడిపత్రిలో పుట్టారు. 1972 సెప్టెంబర్ 15న కన్నుమూశారు. కేవీ మనమధ్య లేక పోయినా ఆయన కళకు, వ్యాపారానికి సమన్వయం చేస్తూ తీసిన చిత్రాలు చూస్తున్నంత కాలం చిరంజీవిగా నిలిచే ఉంటారు. తెలుగు సినిమా రంగంలో ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. – హెచ్. రమేష్ బాబు, చలనచిత్ర పరిశోధకులు (నేడు కేవీ రెడ్డి వర్ధంతి) -
తెలుగు సినిమా స్వర్ణయుగంలో మూలస్తంభం
మల్లీశ్వరి, జయభేరి, దొంగరాముడు, దేవదాసు, బంగారు పాప, పాతాళభైరవి, మాయాబజార్ మొదలైన సినిమాలను ప్రస్తావిస్తూ తెలుగు సినిమా స్వర్ణయుగం అని అంటూంటాం. ఈ ప్రయత్నాలు బీజప్రాయంగా మొదలైనపుడు తొలుత ఆ చరిత్రలో తారసపడే పేరు మూలా నారాయణస్వామి! కె.వి.రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రగా వచ్చిన ‘భక్త పోతన’ అఖండ విజయం సాధించింది. అయితే, సరైన స్టూడియో సదుపాయాలు లేవని గుర్తించి ‘వాహిని స్టూడియో’కు నడుం కట్టారు మూలా నారాయణస్వామి. వాహిని స్టూడియోలో నిర్మించిన తొలి చిత్రం ‘గుణసుందరి కథ’. ఇది కూడా కె.వి.రెడ్డి దర్శకుడిగా విడుదలై గొప్ప విజయాన్ని పొందింది. మొదట కె.వి.రెడ్డిని దర్శకుడిని చేయాలంటే భాగస్వామి అయిన బి.ఎన్.రెడ్డి అభ్యంతరం చెప్పారు. నారాయణ స్వామి పట్టువదలకుండా లాభం వస్తే కంపెనీకి, నష్టం వస్తే తనకి అని ముందుకు సాగాడు. దర్శకుడిగా కె.వి.రెడ్డి ప్రవేశం ఎంత ఆసక్తిగా మొదలైందో, నారాయణ స్వామి ముగింపు అంతకు మించి ఉత్కంఠ కల్గిస్తుంది. కేవలం 38 సంవత్సరాలకే జీవితం చాలించిన మూలా తెలుగు సినిమా వైభవానికి మూలస్తంభం. తాడిపత్రికి చెందిన నారాయణస్వామికి చిన్నతనం నుండి కళాభిరుచి. చిన్న వయసులోనే తండ్రి కనుమూస్తే, ఆ వ్యాపారాలను ఎన్నో రెట్లు వృద్ధి చేశాడు. నూనె మిల్లులు, బట్టల మిల్లులు, సిరమిక్ పరిశ్రమ, సహకార బ్యాంకు, పాల సహకార సంఘం, మార్కెట్ యార్డులు, పళ్ళ క్యానింగ్ ఇలా చాలా వ్యాపారాలు ఆయనవి. ఇంకో విషయం గమనించాలి. ఆయన సంస్థలకు రాయలసీమ బ్యాంకు, రాయలసీమ టెక్స్టైల్స్, కడప సిరమిక్స్, కడప ఎలక్ట్రానిక్ కంపెనీ వంటి పేర్లుండేవి. తాడిపత్రిలో వాహిని టాకీస్, అనంతపురంలో రఘువీరా టాకీస్ మూలాగారివే. వీరికి బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి సోదరుల తండ్రి గారితో వ్యాపార భాగస్వామ్యం ఉండేది. వీరు కలసి బర్మాకు ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు. బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, చిత్తూరు నాగయ్య, లింగమూర్తి వంటి కళాభిరుచి కలిగినవారు నారాయణ స్వామి మిత్రులు. వీరందరూ కలిసి హెచ్.ఎం.రెడ్డి భాగస్వామ్యంతో ‘గృహలక్ష్మి’ రూపొందించారు. సినిమా విజయవంతమైంది. కానీ ఈ యువకులు వృద్ధుడైన హెచ్.ఎం.రెడ్డితో సర్దుకోలేక వాహినీ సంస్థను నెలకొల్పారు. వందేమాతరం, సుమంగళి, దేవత సినిమాలను నిర్మించి వాహిని సంస్థ చరిత్ర సృష్టించింది. ఇది 1938–1942 మధ్యకాలం. బాల్యమిత్రుడైన కేవీ రెడ్డిలో వ్యాపారి నారాయణస్వామి ఏమి చూశారోగానీ తెలుగు తెరకు ఒక గొప్ప దర్శకుడిని పరిచయం చేశారు. కేవీ రెడ్డి అప్పటికి ఆ సంస్థలో కేషియర్ మాత్రమే. ఏ సినిమాకూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేయలేదు. అందుకే మూలా దార్శనికుడు. ‘భక్త పోతన’ నిర్మించినపుడు న్యూటోన్ స్టూడియోలో ఇబ్బందులు గమనించి రెండున్నర లక్షల వ్యయంతో వాహినీ స్టూడియో ఏర్పాటయ్యింది. ఇందులో రెండు లక్షలు నారాయణ స్వామివి కాగా మిగతా యాభై వేలు బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి తదితరులవి. ఆ సంస్థకు నారాయణస్వామియే చైర్మన్. మూలాకు ‘ఆంధ్రా బిర్లా’ అనే పేరుండేది. రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. కస్తూర్బా ఫండ్‌కు ఆ రోజుల్లో లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. దీనిని స్వీకరించడానికి ముందు గాంధీ మహాత్ముడు స్వామిగారి పూర్వాపరాలు శోధించారని అంటారు. ఎంతోమంది పిల్లల చదువుకు విశేషంగా సాయం చేశారు. ఆయన తోడ్పాటుతో ఎదిగినవారు ఎందరో ఉన్నారు. వారిలో తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య ఒకరు. 1938–1949 మధ్యకాలంలో గృహలక్ష్మి, వందేమాతరం, సుమంగళి, దేవత, భక్త పోతన, పెద్ద మనుషులు, వద్దంటే డబ్బు, స్వర్గసీమ, యోగివేమన, గుణసుందరి కథ సినిమాలను వాహిని సంస్థ ద్వారా రూపొందించారు. భక్త పోతన – గుణసుందరి కథ మధ్య ఏడేళ్ల వ్యవధి ఉంది. స్టూడియో నిర్మాణం పూర్తి అవడం, దానికి కాస్తా ముందు ఇన్కమ్ టాక్స్ సమస్యల్లో నారాయణస్వామి ఇరుక్కోవడం సంభవించింది. ముప్ఫై లక్షల దాకా పెనాల్టీ పడింది. ఆస్తులు జప్తు అయ్యాయి. వాహినీ స్టూడియో కూడా చేతులు మారి విజయవాహిని అయ్యింది. నారాయణస్వామికి నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. కష్టాలు ముప్పిరిగొన్నాయి. ఆరోగ్యం క్షీణించింది. క్షయ పట్టుకుంది. మదనపల్లి శానిటోరియంలో 1950 ఆగస్టు 20న 38 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అప్పటికి పెద్ద కుమారుడు వెంకటరంగయ్యకు 11 సంవత్సరాలు. కుటుంబం ఆర్థిక చిక్కుల్లో పడింది. 1961లో దామోదరం సంజీవయ్య తోడ్పాటుతో బయటపడ్డారంటారు. ఏది ఏమైనా, తెలుగు సినిమా స్వర్ణయుగానికి మూల విరాట్టు అయిన మూలా నారాయణస్వామి పరిణామగతి ఆశ్చర్యకరం! – డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి -
సినీసౌధానికి పునాదిరాయి ‘పాతాళభైరవి’
ధైర్యం చేసినప్పుడే విజయం వరిస్తుంది. సాహసం చేసినప్పుడే సంతృప్తి లభిస్తుంది. అది జీవితంలోనైనా... సినిమాలోనైనా! ఈ విషయాన్ని ఏడు దశాబ్దాల క్రితం ఓ భారీ బ్లాక్ అండ్ వైట్ సినిమా... పంచరంగుల్లో నిరూపించింది. నిర్మాణ వ్యయంలో, సాంకేతిక విలువల్లో, సంగీతంలో, సంభాషణల్లో, చివరకు రిలీజులోనూ చేసిన సాహసం ఎందరినో స్టార్లను చేసింది. నిర్మాతలతో పాటు పరిశ్రమకూ ఓ స్థాయి తెచ్చింది. పింగళి నాగేంద్రరావు రచనతో, కె.వి. రెడ్డి దర్శకత్వంలో విజయా సంస్థపై ఎన్టీఆర్, యస్వీఆర్ తదితరులతో నాగిరెడ్డి – చక్రపాణి చేసిన సాహసం... డెబ్భై ఏళ్ళు గడిచినా ఇవాళ్టికీ బలహీనులకూ, బాక్సాఫీస్ గ్రామర్ కూ ఓ పెద్ద బాలశిక్ష. సినీసౌధానికి పునాదిరాయిగా... వందేళ్ళ క్రితం 1921 ప్రాంతంలో తెలుగు వారు మూగచిత్రాలు తీయడం మొదలుపెట్టినప్పుడు సిన్మా ఓ కొత్త ప్రక్రియ. తర్వాతి రోజుల్లో అది ఓ మాధ్యమం. అటుపైన పెరిగిన పరిశ్రమ. ఇవాళ సినిమా – జీవితంలో క్రికెట్‌తో పాటు భాగమైన ఓ మతం. పేరుప్రతిష్ఠలు, వ్యాపార విస్తృతి, వాణిజ్య లాభం – ఇలా అన్నింటిలోనూ తెలుగు సినిమా ఎదగడంలో పునాదిగా నిలిచిన తొలితరం సినిమాల్లో మూలస్తంభం – ‘పాతాళభైరవి’. తమిళ మార్కెట్ కూడా కలిసొచ్చేలా, ఏకకాలంలో రెండు భాషల్లో సినిమా తీసే లాభదాయక ధోరణిని ‘పాతాళభైరవి’తో సక్సెస్‌ఫుల్‌గా ఆచరణలోకి తీసుకొచ్చారు – మన దర్శక, నిర్మాతలు. ధైర్యే సాహసే ‘విజయ’లక్ష్మీ... నిరాశ ముంచెత్తినప్పుడే ధైర్యం కావాలి. సాహసం చేయాలి. 1949లో నిర్మాణ కష్టాల్లో ఉన్న వాహినీ స్టూడియోస్‌ను లీజుకు తీసుకొని, విజయా ప్రొడక్ష¯Œ ్సను స్థాపించిన నాగిరెడ్డి – చక్రపాణి వరుసగా సినిమాలు తీద్దామనుకొన్నారు. తొలిగా ‘షావుకారు’ తీస్తున్నారు. అప్పుడే వాహినీ ‘గుణసుందరి కథ’ (1949 డిసెంబర్ 29) హిట్ అయింది. ఆ జానపదం తీసిన కె.వి. రెడ్డితోనే విజయా వాళ్ళు మరో జానపదం ‘పాతాళభైరవి’ మొదలుపెట్టారు. ఇంతలో ‘షావుకారు’ (1950 ఏప్రిల్ 7) రిలీజై, పేరొచ్చినంత డబ్బు తేలేదు. అయినాసరే భారీ ‘పాతాళభైరవి’ సాహసం నిర్మాతలు ఆపలేదు. ఒకటికి 2 భాషల్లో తీశారు. అక్కడి అద్భుతదీపం.. ఇక్కడి పాతాళభైరవి చందమామ తరహా కథ ‘పాతాళభైరవి’. అరేబియన్ నైట్స్‌లోని ‘అల్లావుద్దీన్ – అద్భుతదీపం’ కథను మన నేటివిటీకి తగ్గట్టు మార్చేశారు రచయిత పింగళి. కె.వి. రెడ్డి స్క్రీన్‌ప్లే రచనకు సహ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తన వంతు తోడ్పాటునిచ్చారు. ‘షావుకారు’ను పొదుపుగా పరిమిత సౌకర్యాలతో తీసిన విజయా సంస్థ ఇక పెద్ద ఆట ఆడాలని సాహసించడంతోనే ‘పాతాళభైరవి’కి కళాదర్శకుడు గోఖలే సారథ్యంలో కళాధర్ నిర్వహణలో భారీ సెట్లు వేయించింది. గెటప్స్ చేయించింది. నిర్మాణ విలువల్ని పెంచేసింది. మార్కస్ బార్ట్లీ కెమెరా మాయాజాలం, ‘డింగరీ’లాంటి మాటలు, చిరకాలం గుర్తుండే ‘సాహసం శాయరా డింభకా’లాంటి డైలాగులు, ‘కలవరమాయే మదిలో..’ లాంటి ఘంటసాల – లీల పాటలు, హేమండ్ ఆర్గాన్ లాంటి విశిష్ట వాద్యాలతో మాస్టర్ వేణు బృందం కూర్చిన ఆర్కెస్ట్రయిజేషన్ – ఇలాంటివన్నీ తోడయ్యాయి. అప్పట్లో వాహినీ స్టూడియోలో శబ్దగ్రహణ శాఖలో పనిచేస్తున్న నేటి మేటి దర్శకుడు కె. విశ్వనాథ్ ఈ సినిమాకు సౌండ్ అసిస్టెంట్‌గా చేయడం విశేషం. వెరసి, ఈ వీరరస ప్రధాన ప్రేమకథ రసవత్తరంగా తయారైంది. వరుస ఫ్లాపుల మధ్యలోనూ... నిజానికి జానపదాలు వరుసగా ఫ్లాపవుతున్న రోజులవి. ‘షావుకారు’, ‘జీవితం’, ‘సంసారం’ హిట్టయి, సాంఘికాలదే పైచేయనుకుంటున్న సమయం. ఆ వాతావరణంలో దర్శక, నిర్మాతలు చేసిన ఖరీదైన జానపద సాహసం ‘పాతాళభైరవి’. ఆ సాహసం ఫలించి, తరువాత మరో రెండు దశాబ్దాల దాకా జానపద కథలకు కమర్షియాలిటీని నిలిపింది. అలాగే, బొంబాయి పలు ప్రాంతీయ సినీ పరిశ్రమలకు కేంద్రమైనా, అక్కడ హిందీ చిత్రపరిశ్రమే ఎదిగింది. మర్రిచెట్టు లాంటి హిందీ పరిశ్రమ కింద మిగతావి ఆ స్థాయిని అందుకోలేకపోయాయి. కానీ, మద్రాసులో మన చిత్ర పరిశ్రమ పరిస్థితి వేరు. ప్రధానమైన తమిళ పరిశ్రమతో పోటాపోటీగా నిలబడింది. భారీగా ఎదిగింది. ఆ పరిణామంలో 1950ల నుంచి విజయ సంస్థ, వాహినీ స్టూడియో, ఎన్టీఆర్, ఏయన్నార్, యస్వీఆర్, సావిత్రి లాంటి స్టార్ల భాగస్వామ్యం, ‘పాతాళభైరవి’ లాంటి సినిమాల పాత్ర ఉంది. సౌత్‌లో తొలిసారి రికార్డు ప్రింట్లు కథగా పాతాళభైరవి చాలా సింపుల్. రాకుమారి (మాలతి) ప్రేమ కోసం నేపాళ మాంత్రికుడి (యస్వీఆర్) వెంట వెళతాడు తోట రాముడు (ఎన్టీఆర్). కోరిన కోర్కెలు తీర్చే పాతాళభైరవిని సాధిస్తాడు. దుష్టమాంత్రికుణ్ణి ఆఖరికి వధిస్తాడు. ఆసక్తికరమైన కథ, ఆగకుండా సాగే కథనంతో ‘పాతాళభైరవి’ అందరినీ ఆకట్టుకుంది. రిలీజ్ ముందు అనుమానాలు వ్యక్తమైనా, తొలి వారాల్లో విభిన్న స్వరాలు వినిపించినా అవేవీ హిట్‌ను ఆపలేదు. అప్పట్లో తెలుగు సినిమాల వ్యాపారం 10 – 15 ప్రింట్లతోనే జరిగేది. కానీ, 1951 మార్చి 15న విడుదలైన తెలుగు ‘పాతాళభైరవి’ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. అలా మొదట 13 కేంద్రాల్లో విడుదలై, పది కేంద్రాల్లో వంద రోజులు, మిగతా 3 కేంద్రాల్లో 90కి పైగా రోజులు ఆడింది. పెరిగిన ప్రజాదరణతో, ఫస్ట్ బ్యాచ్‌లోనే మొత్తం 60కి పైగా ప్రింట్లు తీశారు. ఇక, తెలుగు, తమిళం – రెండూ కలిపితే అప్పట్లోనే 100 ప్రింట్లు తీసిన తొలి సినిమా దక్షిణాదిలో ఇదే! ఆ తరువాత ఇన్నేళ్ళలో పదే పదే రీ–రిలీజైన ‘పాతాళభైరవి’కి మొత్తం మీద 500 ప్రింట్లు తీశారని ఓ లెక్క. ఫస్ట్ డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ... ఫస్ట్ 200 డేస్... భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇంకా ఏర్పడని ఆ రోజుల్లో, అప్పటి భౌగోళిక ప్రాంతాల ప్రకారం చూస్తే – ఆంధ్రా, నైజామ్, మైసూరు, మద్రాసు, మలబార్, బొంబాయి – ఇలా మొత్తం 6 విభిన్న భాషా ప్రాంతాలలోనూ శతదినోత్సవం చేసుకున్న తెలుగు సినిమా ఇదే. విజయవాడ, బళ్ళారి, బెంగుళూరు, గుడివాడ, నెల్లూరుల్లో ‘పాతాళభైరవి’ రజతోత్సవమూ చేసుకుంది. తెలుగు నాట ఒక సినిమా డైరెక్టుగా 25 వారాలు ఆడడం అదే తొలిసారి. అంతకు ముందు ఏయన్నార్ ‘బాలరాజు’ రజతోత్సవ చిత్రమే అయినా, ఏలూరులో షిఫ్టింగుతో అది 25 వారాలు ఆడిందనేది గమనార్హం. కాగా, ద్విశతదినోత్సవం జరుపుకొన్న తొలి తెలుగు చిత్రమూ ‘పాతాళభైరవే’. జాతకాలు మార్చిన సినిమా విజయా వారి ‘పాతాళభైరవి’ ఎంతోమందికి కలిసొచ్చింది. జీవితాలను మార్చేసింది. ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగి, స్టారయ్యారు. నేపాళ మాంత్రికుడి పాత్ర అనన్య సామాన్యంగా పోషించి, యస్వీఆర్ తీరిక లేని నటుడయ్యారు. ఒక పాటలో నృత్యంలో కనిపించిన సావిత్రి ఆ తరువాతి అవకాశాలతో మహానటిగా తారాపథానికి ఎగిశారు. విజయా సంస్థ సుస్థిరమైపోయింది. కె.వి. రెడ్డి స్టార్ డైరెక్టరైపోయారు. మంచి చిత్రాలకు చిరునామాగా నిలిచి, తెలుగు సినిమా పురోభివృద్ధికి దోహదం చేసిన అక్కినేని సొంత సంస్థ ‘అన్నపూర్ణా’ ప్రారంభచిత్రం (‘దొంగరాముడు)కు కె.వి. రెడ్డే దర్శకుడయ్యారు. అలాగే, విజయా సంస్థ శాఖోపశాఖలైంది. ‘వాహినీ’ స్టూడియోస్ కాస్తా ‘విజయ – వాహినీ’ స్టూడియోస్‌గా విస్తరించింది. సౌత్ ఈస్ట్ ఏషియాలోకెల్లా అతి పెద్ద ఫిల్మ్స్టూడియోగా అవతరించింది. దీని వెనక ‘పాతాళభైరవి’ మొదలు వరుస హిట్లతో నిర్మాతలకొచ్చిన ధనం, ధైర్యం ఉన్నాయి. పదేళ్ళలో... ఆరు రీళ్ళు మిగిల్చే ఇమేజ్ ‘పాతాళభైరవి’ తర్వాత విజయా సంస్థ ఎన్టీఆర్‌తో ఎన్నో హిట్స్ తీసింది. పదేళ్ళకు ‘జగదేకవీరుని కథ’ తీసినప్పుడు, ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక్క యుద్ధం కూడా చేయలేదేమిటని నిర్మాత చక్రపాణిని అడిగారు. అందుకాయన, ‘‘పాతాళభైరవి అప్పుడంటే ఎన్టీఆర్ సాహసాల గురించి తెలీదు కాబట్టి అవే 6 రీళ్ళు చూపాం. ఇప్పుడు ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగింది. ఎన్టీఆర్‌ను చూపిస్తే చాలు... జగదేకవీరుడని అర్థం చేసుకుంటారు. మళ్ళీ యుద్ధాలు తీయక్కర్లేదు. మాకు 6 రీళ్ళు మిగిలాయి’’ అని చమత్కరించారు. అదీ పదేళ్ళలో ఎన్టీఆర్‌కు పెరిగిన ఇమేజ్! ఋణం తీర్చుకున్న ఎన్టీఆర్... కాలం ఎప్పుడూ ఒకే రీతిలో సాగదు. విజయాకూ, ఎన్టీఆర్ కెరీర్‌కూ పలు హిట్స్ అందించిన కె.వి. రెడ్డి కెరీర్ ఒక దశలో వెనుక పట్టు పట్టింది. ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ ఫ్లాపయ్యాక ‘విజయా’ సంస్థ ఆయనను దూరం పెట్టింది. ఒకప్పుడు సూపర్ హిట్లతో వెలిగిన దర్శకశ్రేష్ఠుడు చేతిలో సినిమాలు లేక, చదువు కోసం కొడుకును అమెరికాకు పంపేందుకు డబ్బు లేక అవస్థలు పడుతున్న సమయంలో ఎన్టీఆర్ తన గురుభక్తి చాటుకున్నారు. ఆ సందర్భంలో వయసుపై పడి, ఆరోగ్యం సహకరించని కె.వి. రెడ్డి ఓసారి ఆటోలో ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు. ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించి, అప్పటికప్పుడు పాతికవేలు చెక్కు రాసిచ్చారు. అభిమానధనుడైన కె.వి. రెడ్డి, ‘‘నేను యాచించడానికి రాలేదు రామారావ్! ఏదైనా వర్క్ ఇస్తే చేస్తా’’ అన్నారు. వెంటనే ఎన్టీఆర్, ‘‘నేను మీ ఆత్మాభిమానానికి వెలకట్టడం లేదు గురువు గారూ! నా తదుపరి చిత్రానికి మీరే డైరెక్టర్. ఇది అడ్వాన్స్. పింగళి వారే రాసిన 3 స్క్రిప్టులు ‘శ్రీకృష్ణసత్య, చాణక్య శపథం, శ్రీరామ పట్టాభిషేకం’ నా దగ్గరున్నాయి. మీరు ఏది ఎంచుకుంటే, అది మీ దర్శకత్వంలో చేస్తా’’నన్నారు. ‘‘దర్శకత్వం వహించేందుకు ఆరోగ్యం సహకరించేలా లేద’’న్నారు కె.వి. ‘‘మీరు కుర్చీలో కూర్చొని పర్యవేక్షిస్తే చాలు. మీరు చెప్పినట్టు నేను తీస్తా’’ అని గురుభక్తి చాటారు ఎన్టీఆర్. శిష్యుడి గౌరవానికి కె.వి సంతోషించారు. ఆయన ఎంచుకున్న ‘శ్రీకృష్ణసత్య’ స్క్రిప్టునే, గురువు గారి వాంఛ తీర్చడం కోసం కలర్ సినిమాగా నిర్మించారు ఎన్టీఆర్. సి.ఎం. సీటులో... ‘‘ఫాదర్’’ నాగిరెడ్డి! కానీ తాము వద్దనుకున్న కె.వి.రెడ్డితో ఎన్టీఆర్ కృష్ణసత్య (’71) తీయడం విజయాధినేతలకు నచ్చలేదు. దాంతో, తమ ఆస్థాన హీరో ఎన్టీఆర్‌నే తమ తదుపరి ప్రాజెక్టుల్లో దూరం పెట్టారు. ఎన్టీఆర్ రాయబారం పంపినా, లాభం లేకపోయింది. విజయా వారు తీసిన ‘గంగ–మంగ’, ‘శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’ రెండు చిత్రాల్లోనూ ఎన్టీఆర్ లేరు. దాని వల్ల స్టార్ హీరోగా ఎన్టీఆర్ కెరీర్ కేమీ నష్టం రాలేదు కానీ, ఆ తరువాత విజయాధినేతలే చిత్రనిర్మాణం కొనసాగించలేకపోయారు. కాలగతిలో ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ హయాంలో టి.టి.డి. బోర్డు చైర్మనైన నాగిరెడ్డి అప్పటికి ఆ పదవిలో ఉన్నారు. ప్రభుత్వం మారినా సరే తానెప్పుడూ ‘‘ఫాదర్’’ అని ఆత్మీయంగా పిలిచే నాగిరెడ్డిని ఎన్టీఆర్ పక్కకు తప్పించలేదు. పైపెచ్చు, నాగిరెడ్డిని సాదరంగా ఆహ్వానించి, తన సి.ఎం. సీటులో కూర్చోబెట్టి, సముచితంగా సత్కరించారు.తన ఉజ్జ్వల సినీ జీవితానికి బాట వేసిన ‘‘ఫాదర్’’కు కృతజ్ఞత చెల్లించుకున్నారు. సినిమా నుంచే... డ్రామాగా! రంగస్థల నాటకాలు వెండితెరకెక్కడం సినీ చరిత్రలో తొలి రోజుల నుంచి చూస్తున్నదే. కానీ, తెర మీది సినిమా కాస్తా వేదిక మీద నాటకంగా మారడం మాత్రం సురభి నాటకాలలో ‘పాతాళభైరవి’కే దక్కిన మరో ఘనత. సురభి నాటక సమాజం వారు ప్రదర్శించే ధర్మవరపు రామకష్ణమాచార్యుల ‘భక్త ప్రహ్లాద’ తొలి తెలుగు టాకీగా తెరకెక్కితే, ఆపైన సరిగ్గా రెండు దశాబ్దాలైనా గడవక ముందు వచ్చిన పింగళి వారి ‘పాతాళభైరవి’ కథను 135 సంవత్సరాల చరిత్ర ఉన్న సురభి నాటక సమాజం తమ సొంతం చేసుకొని, ఇవాళ్టికీ రంగస్థల నాటకంగా ప్రదర్శిస్తోంది. దాన్నిబట్టి, పాతాళభైరవి కథ, తోటరాముడి సాహసం, నేపాళ మాంత్రికుడి మాయాజాలం తెలుగు వారి కళ, సంస్కతిలో ఎంతగా భాగమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. చరిత్రలో ఒక సినిమా ఆణిముత్యంగా నిలిచిందనడానికి ఇంత కన్నా ఇంకేం కావాలి. అందుకే, ఎన్నేళ్ళయినా... మళ్ళీ మళ్ళీ ‘జై పాతాళభైరవి’! స్టార్ హీరోగా ఎన్టీఆర్... కొత్త దారిలో ఏయన్నార్! ‘పాతాళ భైరవి’ నాటికే ఏయన్నార్ అగ్రనటుడు. అప్పటికి ఎనిమిదేళ్ళుగా జానపద హీరో అంటే ఏయన్నారే. అప్పటి దాకా ఆయన చేసిన సినిమాల్లో 90 శాతం జానపదాలే. కానీ, ఒక్కసారిగా ‘పాతాళభైరవి’తో తెలుగు తెరపై తిరుగులేని జానపదహీరోగా ఎన్టీఆర్ అవతరించారు. ఏయన్నార్ అటుపైన రూటు మార్చి, ‘దేవదాసు’ లాంటి సాంఘికాల్లో తన ముద్ర చూపారు. ఆ తరువాత ఆయన కెరీర్ లో చేసిన 200 పై చిలుకు చిత్రాల్లో మూణ్ణాలుగు మాత్రమే, అంటే ఒక్క శాతమే జానపదాలనేది గమనార్హం. ఇక, జానపదాలకు ఊపు తెచ్చిన ‘పాతా ళభైరవి’ నుంచి దేశంలో ఏ హీరో చేయనన్ని విధంగా 58 ఫోక్లోర్ చిత్రాల్లో ఎన్టీఆరే హీరో. ఆయన తర్వాతి స్థానంలో కత్తివీరుడు కాంతా రావు నిలిచారు. ఫస్ట్ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో... మన దేశంలో తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 1952లో బొంబాయి, మద్రాసు, ఢిల్లీ, కలకత్తాల్లో జరిగింది. అందులో దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ‘పాతాళభైరవి’. ‘మొఘల్ –ఎ–ఆజమ్’ (1960) రూపకర్త కె. ఆసిఫ్ ఈ ఫెస్టివల్లో ‘పాతాళభైరవి’, ఆ సెట్లు, ఆ సాంకేతిక విలువలు చూసి, అబ్బురపడ్డారట. ఒక ప్రాంతీయ సినిమానే ఈ స్థాయిలో తీస్తే, హిందీలో జాతీయస్థాయిలో తాను రూపొందిస్తున్న ‘మొఘల్–ఎ–ఆజమ్’ ఇంకెంత స్థాయిలో ఉండాలని తమ సెట్లు, రూపకల్పన శైలిపై మరింత దృష్టి, డబ్బు పెట్టారంటారు. ఇప్పుడు చూస్తున్నా ‘పాతాళభైరవి’ బోరు కొట్టదు. టీవీల దెబ్బకు రిపీట్ రన్లు ఆగే వరకు 60 ఏళ్ళ పాటు ‘పాతాళభైరవి’ హాళ్ళలో అలరిస్తూనే వచ్చింది. ఇప్పటికీ టీవీ, యూట్యూబుల్లో పలకరిస్తూనే ఉంది. ఇంత దీర్ఘకాల జనాదరణ ఉన్న సినిమా మరొకటి కనిపించదు. 1950ల ముందు మ్యూజికల్ హిట్లున్నా, ఆ పాటలు ఆ కాలానికే! కానీ ఇప్పటికీ వినిపించే ఫస్ట్ లాంగ్‌టైమ్ మ్యూజికల్హిట్‘పాతాళభైరవి’. సూపర్ హీరోయిజమ్ తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ (1931 మార్చి 14) రిలీజైన సరిగ్గా రెండు దశాబ్దాలకు తెలుగు ‘పాతాళభైరవి’ (1951 మార్చి 15) వచ్చింది. అంతకు ముందు వరకు సాధారణంగా సినీ కథానాయకుడు సామాన్యుడు. విధి ఆడే వింత నాటకంలో ఓ కీలుబొమ్మ. కానీ, సామాన్యుడు సైతం సాహసిస్తే, ఏదైనా సాధిస్తాడనే హీరోయిజమ్‌ను ‘పాతాళభైరవి’ జనంలోకి బాగా తీసుకువెళ్ళింది. జీవితంలో మనం చెయ్యలేని పనులను తెర మీది సూపర్ నేచురల్ హీరో చేస్తే సామాన్య జనం జై కొడతారనే సైకాలజీని ష్యూర్ హిట్ బాక్సాఫీస్ ఫార్ములాగా తీర్చిదిద్దింది. గత 70 ఏళ్ళుగా సాంఘికాల్లోనూ అదే హిట్ మంత్రమైంది. అలా ఇండియన్ సిల్వర్‌స్క్రీన్‌పై హీరో ఇమేజ్‌కు కొత్త భాష్యం చెప్పింది ‘పాతాళభైరవి’. నెల జీతంపై... 4 సినిమాలు అసలు ‘పాతాళభైరవి’ కథకు దర్శక, నిర్మాతలు ముందు అనుకున్న హీరో – ఏయన్నార్. విలన్ – ముక్కామల. ఒక దశలో అప్పుడే ‘మాయలమారి’ (1951 జూన్ 14)లో గండరగండ పాత్ర చేస్తున్న రాజారెడ్డితో హీరో వేషం వేయిస్తే ఎలా ఉంటుందా అనీ ఆలోచించారట. కానీ, ఎన్టీఆర్, ఏయన్నార్ల మధ్య ఓ ప్రాక్టీస్ టెన్నిస్ మ్యాచ్‌లో బంతిని ఎన్టీఆర్ బలంగా కొట్టిన తీరు చూసి, దర్శకుడు కె.వి. రెడ్డి ఈ పాత్రకు ఎన్టీఆరే పర్ఫెక్ట్ అనుకున్నారు. గదతో బొడ్డుదేవర విగ్రహాన్ని బలంగా మోదే దృశ్యాన్ని ఎన్టీఆర్ తో ట్రయల్ షూట్ చేసి మరీ ఓకే అన్నారు. వాహిని – విజయాధినేతలు అంతకు ముందే, తాము తీయనున్న 3 చిత్రాలకు (‘మల్లీశ్వరి’, ‘పెళ్ళిచేసి చూడు’, ‘చంద్రహారం’) హీరోగా కాంట్రాక్టు రాయాలంటూ ఎన్టీఆర్‌ను అడిగారు. భారీ ఖర్చయ్యే ‘పాతాళభైరవి’కి ఇమేజ్ ఉన్న మరో హీరోను పెట్టుకోవాలన్నది వారి ఆలోచన. కానీ, ‘పాతాళభైరవి’ సహా 4 సినిమాలకైతేనే కాంట్రాక్ట్‌గా చేస్తానన్నారు ఎన్టీఆర్. విజయా వారూ సరేనన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ కు వారిచ్చిన జీతం – తొలి ఏడాది నెలకు రూ. 500, రెండో ఏడాది నెలకు రూ. 750. మొత్తంగా మొదటి రెండు సినిమాలకూ ఏడున్నర వేల చొప్పున, తరువాతి రెండు సినిమాలకూ పది వేల చొప్పున రెమ్యూనరేషన్ అని ఫిక్స్ చేశారు. ‘‘ఆ 4 సినిమాల తరువాత విజయా వారి కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చాక, ఏకంగా ఇరవై ఏడున్నర వేల అత్యధిక పారితోషికంతో కథానాయక పాత్ర చేశా. ఆ నాటి నుంచి సినీ సీమ వదిలి బయటకొచ్చే దాకా హీరోగా నాదే హయ్యస్ట్ రెమ్యూనరేషన్’’ అని 1986 ఫిల్మోత్సవ్ వేళ ఎన్టీఆరే చెప్పారు. బహుమతిగా కారు అనేకచోట్ల ‘పాతాళభైరవి’ వందరోజులాడిన సందర్భంగా, ముఖ్యమైన కళాకారులకు కార్లను బహుమతిగా ఇచ్చారు విజయాధినేతలు. ఆ రోజుల్లోనే 6 వేలు ఖరీదు చేసే ఆ బ్యూక్ కారును పదిలంగా ఉంచుకున్నారు ఎన్టీఆర్. ‘‘ఫాదర్ (నాగిరెడ్డి) ఇచ్చిన కారు’’ అని గొప్పగా చెప్పేవారు. ఒకటికి రెండుసార్లు! లేట్ రిలీజులోనూ 20కి పైగా కేంద్రాల్లో ‘పాతాళభైరవి’ శతదినోత్సవం చేసుకొంది. ఆ తర్వాత అలా లేట్ రిలీజ్లో 20కి పైగా కేంద్రాల్లో (సరిగ్గా 46 కేంద్రాల్లో) వంద రోజులు ఆడింది ‘లవకుశ’. రెండూ ఎన్టీఆర్ చిత్రాలే కావడం విశేషం. ఫస్ట్ రిలీజైన తరువాత రెండేళ్ళకే 1953 జూలైలో విజయవాడలో దుర్గాకళామందిరంలోనే ‘పాతాళభైరవి’ మరోసారి రిలీజైంది. అప్పుడూ అదే హాలులో ఏకంగా 11 వారాల పైగా ఆడడం మరో విశేషం. పార్ట్లీ కలర్‌తో... హిందీలోకి! ‘పాతాళభైరవి’ని ఒకేసారి రెండు భాషల్లో చిత్రీకరించారు. తెలుగు వెర్షన్ రిలీజైన రెండు నెలలకు 1951 మే 17న తమిళ వెర్షన్ రిలీజైంది. తెలుగుతో పాటు తమిళంలోనూ హిట్టయిన ఈ చిత్రాన్ని ప్రసిద్ధ జెమినీ సంస్థ హిందీ ప్రేక్షకులకూ అందించింది. నాగిరెడ్డిని ‘‘నాగి.. నాగి..’’ అంటూ అభిమానంతో సంబోధించే జెమినీ అధినేత ఎస్.ఎస్. వాసన్ అప్పటికే ‘చంద్రలేఖ’ లాంటి భారీ చిత్రంతో ఉత్తరాది వారికి దక్షిణాది సినిమా రుచి చూపించారు. ఈసారి విజయా వారి ప్రొడక్షన్ ‘పాతాళభైరవి’లోని నృత్యగీతాలు ‘ఇతిహాసం విన్నారా’, ‘వగలోయ్ వగలు’ రెండింటినీ కలర్లో ప్రత్యేకంగా చిత్రీకరించి మరీ, హిందీలో ‘పాతాళ్ భైరవి’ టైటిలుతో 1952 మార్చి 14న జెమినీ సంస్థ రిలీజ్ చేసింది. అలా ఒకే కథ మూడు భాషల్లో జనం ముందుకు రావడం, వాటిల్లో ఒకే హీరో నటించడం, 3 భాషల్లో విజయం సాధించడం కూడా అదే తొలిసారి. 33 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే కథను ‘పాతాళ్ భైరవి’ (1985) పేరుతోనే హీరో కృష్ణ సమర్పణలో పద్మాలయా స్టూడియోస్ బాపయ్య దర్శకత్వంలో జితేంద్ర, జయప్రదలతో హిందీలో మరోసారి తీశారు. – రెంటాల జయదేవ -
ఏనుగు పోయె
ఒక ఏనుగు, చిన్న పిల్లల మధ్య జరిగే సన్నివేశాలతో కేవీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పోయే ఏనుగు పో’. పీకేఎ¯Œ క్రియేషన్స్ పతాకంపై ఎం. రాజేంద్ర¯Œ తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. తమిళంలో ‘పో యానైకుట్టియే పో’ పేరుతో రూపొందుతోంది. ఈ చిత్రం తెలుగు టైటిల్ లోగో, బేనర్ లోగోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోయే ఏనుగు పో’ టైటిల్ చాలా కొత్తగా ఉంది. మంచి కథ, మాటలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఎం.రాజేంద్ర¯Œ మాట్లాడుతూ– ‘‘మంచి కుటుంబ కథా చిత్రమిది. ఏనుగు, చిన్న పిల్లల మధ్య జరిగే మంచి సన్నివేశాలతో మా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్. జి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
తృప్తిని మించిన ధనం... భక్తిని మించిన మోక్షం లేవు!
కె.వి.రెడ్డి దర్శకత్వంలో సహజకవి జీవితంపై రూపొందించిన చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘నారాయణ...రామకృష్ణ,,,,గోవింద నారాయణ’ అంటూ భక్తిపరవశంతో భజన జరుగుతుంది. ఈ సందడిలోనే ఒకడు దేవుడి దీపంతో చుట్ట వెలిగించుకున్నాడు.‘‘ఎవడ్రా నువ్వు దేవుడి గుడిలో దీపానికి చుట్ట ముట్టిస్తావా!’’ అని నిప్పులు చెరుగుతూ వాడికి రెండు అంటించాడు మల్లన్న.ఈ దెబ్బకు చుట్ట ఎగిరివెళ్లి జనాల మధ్య పడింది.‘‘ఏ...నీ అబ్బ గంటా ఇది... పోరా’’ అని మండిపడ్డాడు చుట్టవాడు.ఈ గొడవ విని ‘‘మల్లన్నా...’’ అని కొడుకును పిలిచారు కవిగారు.‘‘నాన్నా...వీడి విషయంలో జోక్యం చేసుకోకు. వీడికి శాస్తి జరగాలి. ఈ పశువును ఇలా సాగనిస్తే....మనం ఒక్క క్షణం కూడా ఈ ఊళ్లో కాపురం చేయలేము’’ ఆవేశంగా అన్నాడు మల్లన్న.‘‘నీకెందుకు నాయనా ఇంతకోపం! మానవుల పాపపుణ్యాలను పాలించడానికి దేవుడున్నడుగా. నువ్వు ఊర్కో’’ అని కొడుకును శాంతింపజేయడానికి ప్రయత్నించారుకవిగారు.‘‘తమరు అలా సెలవీయకండీ...వీడి దుర్మార్గం రోజురోజుకూ మితిమీరి పోతోంది’’ అని చుట్టోడిపై ఫిర్యాదుల చిట్టా విప్పాడు ఒక భక్తుడు.‘‘దేవుడికి నీవు నేను ఎంతో. వీడూ అంతే...’’ అన్నారు శాంతస్వరంతో కవిగారు. ఆ రాత్రి కుక్కలు మొరిగేవేళ...‘‘అమ్మా...అన్నపూర్ణ...మాదాకవళం తల్లీ’’ అని అరుస్తున్నాడు ఒక యాచకుడు.‘‘సరిగ్గా సమయానికి వచ్చావు. పోయిరా’’ అంది కవిగారి భార్య.అతడు పోలేదు.‘‘గంజినీళ్లకు కూడా దిక్కులేదమ్మా. ప్రాణం పోయేలా ఉంది’’ దీనంగా అన్నాడు యాచకుడు.ఇది విని బయటికి వచ్చి యాచకుడిని ఇంట్లోకి తీసుకెళ్లి, పక్కనకూర్చొని మరీ భోజనం వడ్డించారు కవిగారు.ఆ యాచకుడి కళ్లలో అంతులేని కృతజ్ఞత.యాచకుడిని ఇంటిగుమ్మం వరకు సాగనంపి వచ్చి భార్యతో అన్నారు కవిగారు:‘‘పాపం ఎంతో ఆకలితో వచ్చాడు. నీ భోజనంతో పూర్తిగా సంతోషించి ఉంటాడు’’‘‘సంతోషించే కాదుదీవించి కూడా వెళ్లాడు. పస్తు ఉంటే బాధపడేది మనమేగానీ వాడికేం!’’ వ్యంగ్యంగా అంది ఆ ఇంటి ఇల్లాలు.‘‘పిచ్చిదానా! ఇళ్లు వాకిలీ ఉన్నంత వరకు ఏదో కలోగంజీ ఇచ్చాడు మనకు దేవుడు.ఆకలిగొన్నవానికి పెట్టిన ఒక కబళం, ఆపన్నుల కోసం విడిచిన ఒక కన్నీటిబొట్టు నూరు సత్రయాగాలు, వెయ్యి కుంభాభిషేకాలతో సమానం’’ అంటూ దానం విలువను చెప్పే ప్రయత్నం చేశారు కవిగారు.కాని ఆయన మాటలు ఆమెకు రుచించలేదు.‘‘మరీ బాగుంది మీ వేదాంతం. ఇక మన సంగతి ఆ దేవుడే విచారించాలి’’ నిర్వేదంగా అన్నది ఆమె.‘‘తప్పకుండా! తన భక్తుల బరువుబాధలు ఆ పరంధామునికి బాగా తెలుసు. అవన్నీ ఆయనే తీరుస్తాడు’’ అనడంతో పాటు...‘‘వెర్రిదానా ఆశకు అంతుండాలి. రత్నాలవంటి పిల్లలు, ఈ రైతుజీవితం...తృప్తిని మించిన ధనం, భక్తిని మించి మోక్షసాధనం లేదు తెలుసా’’ అని ఇల్లాలికి హితబోధ చేశారు కవిగారు. ఎవరో చుట్టాలు వస్తున్నట్లు కలకలం మొదలైంది.ఎవరో కాదు...కవిగారి బావగారు....పల్లకిలో నుంచి దిగారు. సేవకులు హడావిడి పడుతున్నారు.‘‘ఏం బావగారూ, ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. మా శారద కూడా అలాగే ఉంది. ఆభరణాలతో సహజంగా ఉండే సౌందర్యం చెడుతుందనా! ఏమ్మా?’’ అన్నారు ఖరీదైన బావగారు వ్యంగ్యస్వరంతో.‘‘అన్నయ్యా...ప్రశ్నలు తరువాత....భోజనం వేళ అయింది...’’ అనితొందర చేయబోయింది నర్సమాంబ.అన్నయ్యగారి మాటల్లో మళ్లీ వ్యంగ్యం...‘‘లక్షణం చూస్తే...ఇంట్లో అది కూడా ఉంటుందా!’’‘‘దైవకృప వల్ల ఇప్పటి వరకు అలాంటి ఇబ్బంది లేదు బావగారు. వచ్చిన వాళ్లకు ఏదో విధంగా పెడుతూనే ఉన్నాం’’ అన్నారు కవిగారు.నర్సమాంబ అన్నగారు తెచ్చిన నగలు వేసుకొని ధగధగలాడుతుంది ఆమె కూతురు శారద.‘‘ఇప్పుడెంత అందంగా ఉందో చూడండి. ఇలా సర్వాలంకారాలతో రాచకన్యలా ఉండకుండా పల్లెటూరి గబ్బిలాయిలా దిశ మెడలు, దిశ కాళ్లు...మీరూ’’ అని చురక అంటిస్తూ మేనల్లుడి వైపు తిరిగి...‘‘మల్లన్నా, నువ్వు ఇంకా అలాగే ఉన్నావేం. ఆ బట్టలు కట్టుకోరాదూ’’ అన్నారు కవిగారి బావగారు.‘‘ఆ చీనిచీనాంబరాలు వాడికెందుకు బావగారూ...రైతుకు పీతాంబరాలు చాలా దూరం. అంతేకాదు...సాటి రైతులకు కూడా దూరం అవుతాం. కోట్లాదిమంది భారతీయులు కొల్లాయితో సరిపెట్టుకుంటున్నారు. మాకు మాత్రం ఈ జరీపంచెలు ఎందుకు?’’ అన్నారు కవిగారు. ‘‘అవసరం వేరు. అలంకరణ వేరు బావగారు. ప్రజలు కూటికి గుడ్డకు లేక దరిద్రం వెళ్లబుచ్చుతున్నారంటే...తృప్తి కలిగి కాదు. విధి లేక చేతకాక. అంతే! కావాలని ఎవడూ దరిద్రుడు కాదు. కానీ అది తీరే దారి లేక దరిద్రం అనుభవిస్తున్నారు’’ అన్నారు ఆయన.‘‘సరిగపంచెలు కట్టినంత మాత్రానా ధనవంతులవుతారా బావగారు! భక్త ధనం కలవారే ధనవంతులు. వారే వాంఛారహితులు. సుఖసంపన్నులు’’ అన్నారు కవిగారు.‘మీరేదో కవిత్వగానం చేస్తున్నారుగానీ మామూలు రైతువలే మాట్లాడటం లేదు బావ. యదార్థజీవితంతో సంబంధం లేని ఈ భావోన్మోదం ఒక్క కవులకు మాత్రమే ఉంటుంది. ఈ మహత్తరభావాలను చేర్చి ఒక మహత్తర కావ్యం రాయరాదు. అదైనా కొంచెం ఉపయోగపడుతుంది’’ అన్నారు ఆయన.ఆయన ప్రతిమాటలో బావను మార్చే ప్రయత్నమేదో కనిపిస్తూ ఉంది..‘‘మామయ్య...మామయ్యా...నాన్న నిజంగా పెద్ద పుస్తకం రాస్తున్నారు. నాకు అందులో చాలా పద్యాలు వచ్చు..’’ అంది కవిగారి అమ్మాయి.‘‘నిజంగానే రాస్తున్నావా బావ?’’ అడిగారు ఆయన.‘‘లేదు బావ...అది భగవతాజ్ఞ. భగవంతుని రచన’’ అన్నారు కవిగారు∙∙ ‘‘నీవు భోగినిదండకం రచనలో చూపిన కవితావిలాసం ఇంకను సింగభూపాలుడు మరవలేదు బావ’’ అంటూ పేదకవిగారిని మహారాజుకుచేరువ చేయ ప్రయత్నం చేశారు బావగారు.‘‘అపచారం’’ అన్నారు కవిగారు.అంతేకాదు...దరిద్రానికి తనదైన నిర్వచనం ఇచ్చారు...‘‘అత్యాశపరుడే దరిద్రుడు. తృప్తి కలిగినవాడికి కలిమిలేమి లేవు’’ ఈ మాటలు విని బావగారికి కోపం వచ్చినట్లుంది. ఆయన ఇలా అన్నారు:‘‘సంసారంలో ఉన్నంత వరకు సంసారి వలెనే మాట్లాడవలెనుగానీ సర్వసంగపరిత్యాగిలా మాట్లాడవద్దు. ఆశ్రయం లేని చోట కవిత, వనిత, లత శోభించవని పెద్దలు అన్నారు’’ -
ప్రేక్షకుడి హాస్యం
నూతన నటీనటులతో కె.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేక్షకుడు’. రేఖ సాయిలీల ప్రొడక్షన్స్ పతాకంపై పిల్లా రాజా నిర్మిస్తున్న ఈ సినిమా లోగోను న్యాయవాది ఎస్.వరలక్ష్మి విడుదల చేశారు. ఈ సందర్భంగా కె.వి.రెడ్డి, పిల్లా రాజా మాట్లాడుతూ– ‘‘పశ్చిమ గోదావరి జిల్లాలో చలమయ్యగారి మిఠాయికొట్టు చాలా ఫేమస్. అందులోని స్వీట్స్‌లాగే ఈ చిత్రం మధురంగా ఉంటుంది. వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. కథానుగుణంగానే టైటిల్ పెట్టాం. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. అంతర్వేది, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. మున్నాకాశీ చక్కని బాణీలు అందిస్తున్నారు. ప్రేక్షకుల్ని మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నటీనటులు ప్రభాకర్, శ్రీవాణి, మున్నాకాశీ పాల్గొన్నారు. -
మహానటి : కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్‌ల ప్రోమోలు విడుదల
-
‘మహానటి’లో కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్..!
టాలీవుడ్ తెలుగు ప్రేక్షకుల దాహాన్ని ఈ వేసవిలో తీరుస్తోంది. వరుసగా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్ ప్రేక్షకుల మనసులను గెల్చుకుంటున్నాయి. రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్యలు స్టార్ హీరోల సినిమాలే అయినప్పటికీ నటనా పరంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కమర్షియల్ హంగులను కూడా జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలు బాక్స్‌ఫీస్ రికార్డులను పరుగులు పెట్టిస్తున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు మరొక సినిమాపై ఉంది. ఆ చిత్రమే ‘మహానటి’. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తరాలకు చాలా దగ్గరైన నటి సావిత్రి. ఒక హీరోయిన్ ఇంత మందికి దగ్గరవ్వడం, అభిమానాన్ని సంపాదించడం, ఇంతటి ఉన్నత స్థానాన్ని అందుకోవటం ఒక్క సావిత్రికే చెల్లింది. ఇంకా సినిమాపై అంచనాలను పెంచేట్టుగా రోజుకో పోస్టర్‌ను, ఒక్కో పాత్రధారునికి సంబంధించిన లుక్స్‌ను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. సావిత్రి జీవితం ఎంతో మంది దిగ్గజాలతో ముడిపడి ఉంటుంది. ఎల్వీ ప్రసాద్, ఎస్వీ రంగారావు, కేవీ రెడ్డి, ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇలా మహామహుల గురించి కూడా ప్రస్థావించాల్సి ఉంటుంది. ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు, ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య నటించిన విషయం తెలిసిందే. తాజాగా కేవీరెడ్డి, ఎల్వీ ప్రసాద్ పాత్రలకు సంబంధించిన ప్రోమో వీడియోలను మహానటి చిత్ర బృంధం విడుదల చేసింది. నాని వాయిస్ఓవర్ ఇస్తూ రిలీజ్చేసిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఇంట్లోనే ఉండి షూటింగ్ తీసేసి, ప్రపంచంలో ఏ మూలో తీశామని ప్రేక్షకులను నమ్మించవచ్చు. గ్రాఫిక్స్ , విజువల్ఎఫెక్ట్స్ అంటూ సినిమా రూపురేఖలనే మార్చేశాయి. మరి ఇవేవి లేని ఆ కాలంలోనే మాయాబజార్ అంటూ సినిమా తీసి నిజంగానే మాయ చేసేశాడు కేవీ రెడ్డి. తెలుగు సినిమా గురించి చెప్పుకునే ప్రతి సందర్భంలో మాయాబజార్ గురించి చెప్పుకోవాల్సిందే. మాయాబజార్‌ను తీసిన విధానం, కథనం, పాండవులే లేని మహాభారతాన్ని ఒక్క మాయాబజార్లో చూడగలం. అది కేవీ రెడ్డికే సాధ్యమైంది. అంతటి మేధావి కేవీ రెడ్డి పాత్రను ఈ తరంలో ఎవరు ఉన్నారు అన్న ప్రశ్నకు.. సమాధానం మహానటి డైరెక్టర్ నాగ్అశ్విన్ ఇచ్చేశాడు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం సినిమాలతో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ .. కేవీ రెడ్డి పాత్రలో అలరించనున్నారు. ఇప్పుడు రిలీజైన ప్రోమోలో క్రిష్ అచ్చం కేవీ రెడ్డిలానే ఉన్నాడు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన మహానుభావుడు ఎల్వీ ప్రసాద్. మొదటి తరం హీరో, కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు ఇలా అన్నింట్లో తన సత్తా చాటుకున్నారు ఎల్వీ ప్రసాద్. ఎన్టీఆర్, సావిత్రిని వెండితెరకు పరిచయం చేశారు. మిస్సమ్మగా సావిత్రిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అలాంటి మహానుభావుడి పాత్రను ఈ తరం యువ కథానాయకుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ పోషించారు. నాని వాయిస్ఓవర్ ఇస్తూ విడుదల చేసిన రెండు ప్రోమోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. -
దిగ్దర్శకులుగా క్రిష్, తరుణ్
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించనుంది. అంతేకాదు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితులైన మహానటుల పాత్రల్లో ఈ తరం నటీనటులు దర్శనమివ్వనున్నారు. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ కు సంబంధించి ఆసక్తికరమైన అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. తెలుగు సినిమా ఖ్యాతీని పెంచిన దిగ్గజ దర్శకులు కెవీ రెడ్డి పాత్రలో ఈ తరం దర్శకుడు క్రిష్, మాయాబజార్ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ పాత్రలో పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు. వీరితో ఇతర కీలక పాత్రల్లో సమంత, రాజేంద్ర ప్రసాద్, షాలినీ పాండే లు నటిస్తున్నారు. -
గ్రహణం సమయంలో అల్పాహారం
చైతన్యపురి(హైదరాబాద్): సూర్యగ్రహణం పట్ల ఉన్న మూఢనమ్మకాన్ని తొలగించేందుకు తెలంగాణ మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై సామూహిక అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు కే.వి.రెడ్డి మాట్లాడుతూ గ్రహణం సమయంలో పచ్చి మంచినీళ్లు, ఆహారం ముట్టకూడదని, దేవాలయాలు మూసి ఉంచాలని, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదనేది వట్టి మూఢనమ్మకాలేనని అన్నారు. గ్రహణం సమయంలో ఎటువంటి చెడు ప్రవాభం కలగదని ప్రజలకు అవగాహన కల్పించేందుకు సుమారు 150 మందికి అల్పాహారం అందజేసినట్లు ఆయన తెలిపారు.