చైతన్యపురి(హైదరాబాద్): సూర్యగ్రహణం పట్ల ఉన్న మూఢనమ్మకాన్ని తొలగించేందుకు తెలంగాణ మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై సామూహిక అల్పాహారం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు కే.వి.రెడ్డి మాట్లాడుతూ గ్రహణం సమయంలో పచ్చి మంచినీళ్లు, ఆహారం ముట్టకూడదని, దేవాలయాలు మూసి ఉంచాలని, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదనేది వట్టి మూఢనమ్మకాలేనని అన్నారు. గ్రహణం సమయంలో ఎటువంటి చెడు ప్రవాభం కలగదని ప్రజలకు అవగాహన కల్పించేందుకు సుమారు 150 మందికి అల్పాహారం అందజేసినట్లు ఆయన తెలిపారు.
గ్రహణం సమయంలో అల్పాహారం
Published Wed, Mar 9 2016 7:28 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM
Advertisement
Advertisement