తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా..! | pelli choopulu Overseas record | Sakshi
Sakshi News home page

తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా..!

Published Fri, Sep 16 2016 10:39 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా..!

తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా..!

ప్రస్తుతం పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు నాలుగు వారాలకు మించి నడిచే పరిస్థితిలేదు. చాలా రోజులుగా సినిమా సక్సెస్ ను ఎన్ని రోజులు ఆడింది అన్న లెక్కలతో కాకుండా, ఎంత కలెక్ట్ చేసింది అన్న లెక్కలతో చెపుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లి చూపులు అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది.

ఎలాంటి స్టార్ ఎట్రాక్షన్ లేకపోయినా.. కేవలం కథా కథనాలను నమ్ముకొని తెరకెక్కించిన పెళ్లి చూపులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్ సీస్ లోనూ చరిత్ర సృష్టించింది. గతంలో మరే తెలుగు సినిమాకు సాధ్యం కాని విధంగా అమెరికాలో 50 రోజులుగా ఈ సినిమా ప్రదర్శితమౌతూనే ఉంది. అది కూడా పది సెంటర్లలో కావటం మరో విశేషం. టాప్ స్టార్లకు కూడా సాధ్యం కానీ ఈ అరుదైన రికార్డ్ సృష్టించిన పెళ్లి చూపులు టీంకు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు అందుతున్నాయి.

కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈసినిమాను ధర్మపత్ క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ కందుకూరి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement