bought
-
కాస్ట్ లీ కారు కొన్న సీరియల్ బ్యూటీ లహరి (ఫొటోలు)
-
రూ. రెండు కోట్ల ఖర్చుతో 20 కోట్ల లబ్ది.. ‘ఏక్ దిన్ కా సుల్తాన్’.. అంతా గాల్లోనే
మహా అయితే ఇన్ని దేశాలు తిరిగొచ్చాను అని చెబుతుంటారు. లేదంటే సుమారు లక్షల మైళ్ల వరకు వెళ్లి ఉండొచ్చని అంటారు. కానీ, నిరతరం ప్రయాణించడం మాత్రం అసాధ్యమే. అది కూడా కొద్ది మొత్తం డబ్బుతోనే.. దాదాపు ఆరు సార్లు చంద్రుని పర్యటనకి వెళ్లడానికి పట్టేంత దురాన్ని చుట్టి రావడం అంటే నమ్మశక్యం కానీ విషయమే! కానీ అది నిజం అతను అంత దురాన్ని విమానంలో చుట్టొచ్చాడు. కేవలం ఆకాశం, ఎయిర్‌పోర్ట్‌లలోనే గడుపుతూ.. నిర్విరామంగా ప్రయాణించాడు. ఆ వ్యక్తే యూఎస్‌కి చెందిన 69 ఏళ్ల టామ్ స్టుకర్. అతను 1999లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కి సుమారు రూ. 2 కోట్లు చెల్లించి జీవితకాల ఎయిర్ పాస్ని పొందాడు. దీన్ని తాను పెట్టిన అత్యుత్తమమైన పెట్టుబడిగా స్టుకర్ చెప్పుకుంటాడు. 33 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ పాస్‌తో కనీసం 23 మిలియన్ల కి.మీ. దూరం ప్రయాణిస్తే చాలు అనుకున్నాడు. గానీ ఏకంగా 37 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణిస్తానని ఊహించలేదు. ఈ జర్నీలో అతను కొన్ని సమయాల్లో సుమారు 12 రోజుల వరకు బెడ్‌పై పడుకోకుండా అలానే ప్రయాణించినట్లు తెలిపాడు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడూ తప్ప మిగతా అన్ని వేళలా ఆకాశంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ హోటల్ సూట్లు, క్రిస్ట్ క్రూయిజ్‌లు వంటి వాటిల్లో కొన్ని వారాల పాటు ‘ఏక్ దిన్ సుల్తాన్’ మాదిరి భోగాలు అనుభవించాడు. మొత్తం 1.46 మిలియన్ల మైళ్ల దురం పర్యటించేందుకు సుమారు 373 విమానాల్లో ప్రయాణించినట్లు చెప్పాడు. నిజానికి అతడు గనుక ఈ పాస్ బుక్ తీసుకోనట్లయితే ఇంత దూరం పర్యటించినందుకు ఆ ఫ్లైట్లకి సుమారు రూ. 20 కోట్లు ఖర్చయ్యేవి. అదీగాక ఇన్ని మైళ్ల దూరం జర్నీ చేసేందుకు అన్ని విమానాలను ప్రతిసారి బుక్‌చేసుకోవడం కూడా కష్టమే కానీ ఈ పాస్ ఉండటం కారణంగానే అతను ఈజీగా అన్ని విమానాల్లో ప్రయాణించగలిగాడు. అతను 2019లో ఇంత దూరం పర్యటించాడు. అతను పర్యటించిన దూరం ఆరుసార్లు చంద్రుని పర్యటనకు వెళ్లిన దానితో సమానమని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంతేగాదు చరిత్రలో అతని మాదిరి అంతలా పర్యటించిన వ్యక్తి మరొకరు లేరని కూడా సదరు విమానయాన సంస్థ పేర్కొనడం విశేషం. (చదవండి: వాట్ యాన్ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!) -
రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!
గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఫ్యాషన్, లగ్జరీకి పెట్టింది పేరైన ఈ అమ్మడు తాజాగా దిమ్మదిరిగే విలువతో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసిందిట. దీని విలువ రూ. 190 కోట్లు ఉంటుందని పలుమీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? ) అది కూడా సినీ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే , బ్రహ్మాండమైన ఎమినిటీస్‌తో విలాసవంతమైన బంగ్లాకు ఊర్వశి రౌతేలా షిష్ట్ అయినట్టు తెలుస్తోంది. యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్‌ది యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నతరువాత, 2013లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇకఅప్పటినుంచి గ్లామరస్ లుక్స్‌తో, సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. (రూ.749 కే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్ ఎంతంటే?) తాజా నివేదికల ప్రకారం అత్యంత ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ బంగ్లాలో నాలుగు అంతస్తులున్నాయి. పర్సనల్ జిమ్ విశాలమైన బాల్కనీ గార్డెన్, తదితర లగ్జరీ సౌకర్యాలున్నాయి. వందల కోట్ల విలువైన ఈ బంగ్లాకు దానికి తగ్గట్టుగానే అద్భుతమైన ఇంటీరియర్స్, ఖరీదైన పెయింటింగ్స్, క్లాసీ లుక్‌లో అదిరిపోతోందట. కేవలం 15 సంవత్సరాల వయస్సులో, ఊర్వశి విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, హనీ సింగ్ మ్యూజిక్ వీడియో లవ్ డోస్‌తో సూపర్ పాపులారిటీ సంపాదించింది. యాక్టింగ్ కంటే కూడా లావిష్ లైఫ్ స్టయిల్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ వస్తోంది. రూ. 40 కోట్ల గోల్డెన్ గౌను ,భారీ జాకెట్ తోపాటు, ఫిల్మ్‌ఫేర్ రెడ్ కార్పెట్ ఈవెంట్లో తన ఫేవరెట్ డిజైనర్ మైఖేల్ సిన్కో డిజైన్ చేసిన పర్ఫెక్ట్ స్టైల్ బాడీకాన్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ డ్రెస్ ధర దాదాపు రూ. 60 లక్షలు. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా?) ఇటీవల కొద్ది రోజుల క్రితం ఊర్వశి తన 29వ పుట్టినరోజును ప్యారిస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 93 లక్షలు వెచ్చించిందంటేనే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ వేడుకలో 100 వజ్రాలు పొదిగిన గులాబీల 24 క్యారెట్ల గోల్డ కప్ కేక్‌లు డైమండ్ కేక్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఇటీవలి ఫ్రాన్స్ కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తళుక్కున మెరిసిన ఈ భామ మంచి సందడి చేసిన సంగతి విదితమే. అంతేనా 10 ఏళ్ల దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి బాలీవుడ్ నటిగ కూడా ఊర్వశి రౌతేలానే. -
ఫ్లాగ్‌స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు
న్యూయార్క్: గత వారం మూతపడిన సిగ్నేచర్ బ్యాంకు మెజారిటీ ఆస్తుల కొనుగోలుకి న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ అంగీకరించింది. డీల్ విలువ 2.7 బిలియన్ డాలర్లు (రూ. 22,300 కోట్లు)గా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్ (ఎఫ్‌డీఐసీ) వెల్లడించింది. ఇదీ చదవండి: రెండు నెలల్లో 6 ఐపివోలకు చెక్: లిస్ట్‌లో ఓయో, షాక్‌లో పేటీఎమ్ ఒప్పందంలో భాగంగా అనుబంధ సంస్థలలో ఒకటైన ఫ్లాగ్‌స్టార్ బ్యాంక్ ద్వారా సిగ్నేచర్ బ్యాంకుకు చెందిన 38.4 బిలియన్ డాలర్ల ఆస్తులను న్యూయార్క్ కమ్యూనిటీ కొనుగోలు చేయనుంది. ఇవి సిగ్నేచర్ ఆస్తులలో ముప్పావు వంతుకాగా.. సోమవారం(20) నుంచి సిగ్నేచర్‌కు చెందిన 40 బ్రాంచీలు ఫ్లాగ్‌స్టార్ నిర్వహణలోకి వస్తాయి. సిగ్నేచర్‌కు చెందిన 60 బిలియన్ డాలర్ల రుణాలు రిసీవర్‌షిప్ (కస్టోడియన్) కింద ఉన్నట్లు ఎఫ్‌డీఐసీ పేర్కొంది. -
దేశం మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా " కాంతారా "
-
చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో
Rajkummar Rao Says He Bought A Jacket From Chor Bazaar: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. అలా బాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో రాజ్ కుమార్ రావు ఒకరు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన రాజ్ కుమార్ కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'. జులై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి విజయంతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఆర్థిక విషయాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు రాజ్ కుమార్ రావు. 'పదో తరగతి పూర్తయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందిపడేది. కానీ, అదిరిపోయే డ్రెస్‌తో పార్టీకి వెళ్లాలని ఉండేది. అంతేకాకుండా ఆ పార్టీలో నా ఫ్రెండ్స్‌తో కలిసి నేను డ్యాన్స్ కూడా చేయాలి. అందుకే అప్పుడు నేను దిల్లీలోని చోర్ బజార్‌కు వెళ్లి రూ. 100 పెట్టి జాకెట్ కొనుక్కున్నా. అలాగే రూ. 15తో మెడలో చైన్ కొని పార్టీకి వెసుకుని వెళ్లా' అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు ఈ హీరో. చదవండి: అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో వైరల్.. మరణాన్ని ముందే ఊహించిన నటుడు !.. చివరి పోస్ట్ వైరల్ అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ -
కోట్లు విలువ చేసే కారు కొన్న విశ్వక్ సేన్.. డైరెక్టర్ రియాక్షన్
Hero Vishwak Sen Bought Luxurious Car: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్ జంటగా కలిసి నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. మే 6న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. తనకిష్టమైన బెంజ్ జీక్లాస్ 2022 మోడల్ కారుని కొని తన కల సాకారం చేసుకున్నాడు విశ్వక్. నా డ్రీమ్ కారుని కొనుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో ఆనందంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు విశ్వక్ సేన్. అయితే ఈ కారు విలువ రూ. 1.5 కోట్లు ఉంటుందని సమాచారం. కారుతో దిగిన విశ్వక్ సేన్ ఫొటోలు చూసి అభిమానులు సంబరపడుతున్నారు. విశ్వక్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇక ఈ పోస్ట్‌పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యారు. 'ఆ కారు నాదే. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చా' అని సరదాగా కామెంట్ చేశారు. కాగా కుటుంబా కథా చిత్రమైన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, జే క్రిష్ సంగీతం అందించారు. చదవండి: ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్ View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) -
అరుదైన బౌల్.. ధర 3.6 కోట్లు!
ఓ పింగాణీ బౌల్ ధర ఎంతుంటుంది. మహా అయితే ఓ వంద, లేదంటే ఓ వెయ్యి రూపాయల వరకూ ఉండొచ్చు. మరింత కళాత్మకమైతే మరికాస్త ఎక్కువగా ధర పలకవచ్చు. కానీ అమెరికాలో వేలానికి వచ్చిన ఓ పింగాణీ బౌల్ ధర చూస్తే.. కళ్లు చెదరక మానవు. ఆ బౌల్ ధర సింపుల్‌గా రూ. 3.6 కోట్ల వరకూ ఉంటుందని వేలంపాట నిర్వాహకులు అంచనా వేశారు. ఎందుకు ఇంత ధర అంటే.. ఆ పాత్రకు కనీసం ఆరు వందల ఏళ్ల వయసు ఉంటుందట. ఈ పురాతన కప్పును ఈనెల 17న న్యూయార్క్‌లో సోథేబీ కంపెనీ వేలంపాటలో విక్రయించనుంది. అది చైనీస్ కప్పు కనెక్టికట్‌కు చెందిన ఓ పాత వస్తువుల వ్యాపారి గతేడాది ఆ బౌల్‌ను రూ. 2,500కు కొనుగోలు చేశాడు. కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాక దానిలో ఏదో ప్రత్యేకత ఉందని కనిపెట్టాడు. వెంటనే సోథేబీ కంపెనీని సంప్రదించాడు. ఆ బౌల్ చరిత్ర చెప్పాలని, విలువ కట్టాలని కోరాడు. బౌల్‌ను పరిశీలించిన కంపెనీ వాళ్లు కంగుతిన్నారు. ఇది అరుదైన బౌల్ అని, వేలం వేస్తే 5 లక్షల డాలర్ల వరకూ పలుకుతుందని చెప్పారు. దీంతో ఆ వ్యాపారి ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ పాత్రను లోటస్ బౌల్‌గా పిలుస్తారు. ఆ బౌల్ 1403 నుంచి 1424 వరకూ చైనాను ఏలిన యోంగిల్ చక్రవర్తి కాలం నాటిది. ఇలాంటి కప్పులు మరో ఆరు మాత్రమే ఇప్పుడు ఉన్నాయని సోథేబీ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తైపీలోని నేషనల్ మ్యూజియంలో రెండు, లండన్ మ్యూజియంలో రెండు, టెహ్రాన్ మ్యూజియంలో ఒకటి అలాంటి కప్పులు ఉన్నాయట. అందమైన ఆర్టు అందమైన ఆర్టుతో ఉన్న ఈ బౌల్‌ను చూస్తే.. వావ్ అద్భుతం అనకుండా ఉండరేమో. 6 అంగుళాల తెల్లటి పాత్ర లోపల, బయటా నీలం రంగులో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల బొమ్మలతో ఆకట్టుకుంటుంది. ఆ బౌల్‌ను పట్టుకుంటే ఎంతో సున్నితంగా, సిల్కును తలపిస్తోంది. 15వ శతాబ్దపు రంగులు, డిజైన్లు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని సోథేబీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మెక్ అటీర్ అన్నారు. పాత్ర పెయింటింగ్, షేప్ ఎంతో యునిక్‌గా ఉందని ఆయన ముచ్చట పడుతూ చెప్పారు. ఇంత పురాతన వస్తువు పాత వస్తువుల వ్యాపారి వద్దకు ఎలా వచ్చిందనేది తెలియడం లేదన్నారు. తరతరాలుగా వారసుల చేతులు మారుతూ ఇక్కడికి వచ్చి ఉంటుందని, దాని విలువ తెలియక పోవడంతో వారు అమ్మేసుకుని ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వస్తువులు ఇంకా ఉండటం సంతోషమని, దాని వేలం నిర్వహించడం గొప్పగా భావిస్తున్నామని తెలిపారు. -
టాప్ కార్ డీలర్లకు కేంద్రం షాక్!
-
టాప్ కార్ డీలర్లకు కేంద్రం షాక్!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నేపథ్యంలో నల్లధన కుబేరులకు, అక్రమార్కులకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్దమొత్తంలో పాత నోట్లను డిపాజిట్ చేసిన కార్ల సంస్థలకు, వినియోగదారులకు ప్రభుత్వం షాకిచ్చింది. నవంబర్ 8 తర్వాత దేశంలో ఎన్నికార్లు అమ్ముడయ్యాయనే వివరాలను సంబంధిత డీలర్ల నుంచి ఆరా తీస్తోంది. నవంబర్ 8న తర్వాత కారుకొన్న వారికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల విస్తృత సోదాలు జరిపిన ఐటీశాఖ తాజాగా కార్ల అమ్మకాలపై దృష్టిసారించింది. రూ 500, రూ.1000 నోట్ల ఉపసంహరణ తరువాత జరిపిన కార్ల విక్రయాలపై వివరాలను ఇవ్వాలని కోరుతూ దేశంలోని టాప్ కార్ల సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కేవలం లగ్జరీ కార్ల కొనుగోలుదారులను మాత్రమే కాకుండా ఎవరు ఇంటికి కొత్త కారు తీసుకెళ్లినా కూడా వారి వివరాలను కోరింది. వీరికి జనవరి 1 -15 తేదీల మధ్య నోటీసులు జారీచేయనుంది. తాజా ఆదేశాల మేరకు ఇప్పటికే కొంతమంది డీలర్స్ సంబంధిత డాటాను ఐటీ శాఖకు ససమర్పించినట్టు సమాచారం. తమకు ఐటీ అధికారుల నుంచి నోటీసులు అందినట్టుగా కొంతమంది కార్ డీలర్స్ అంగీకరించారు. వంబర్ 8తర్వాత కార్లు కొనేవాళ్లు తేదీలు మార్చి కొంటారేమోననే అనుమానం ఐటీశాఖ అధికారుల్లో ఉందని, అందుకే పాత తేదీలను కూడా తనిఖీ చేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 8కి ముందు కార్ల కొనుగోళ్లకు సంబంధించిన ఎంట్రీలను కూడా సమర్పించాల్సి వస్తోందని తెలిపారు. అటు ఆదాయ పన్ను అధికారులు కూడా దేశవ్యాప్తంగా కార్ డీలర్లకు నోటీసులు పంపినట్టు ధృవీకరించారు. నవంబరు నెలలో అధికంగా నమోదైన కార్ల అమ్మకాలు, బ్యాంకు డిపాజిట్ల ఆధారంగా ఈ నోటీసులిచ్చినట్టు తెలిపారు. ఎంట్రీ పుస్తకాల్లో పాత తేదీలను కూడా తనిఖీ చేయాలని వారు భావిస్తున్నట్టు చెప్పారు. -
ఉప్పు కొరత అంటూ వదంతులు
-
పోలీస్ జీపును ఢీ కొన్న లారీ
కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు..చేయి తొలగింపు స్వలంగా గాయపడిన ఏఎస్ఐ, హోంగార్డు సత్తుపల్లి : పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్జీపును మంగళవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని లారీ ఢీకొన్న సంఘటనలో ఒక కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వలంగా గాయపడ్డారు. సీఐ పి.రాజేంద్రప్రసాద్ కథనం ప్రకారం..మండల పరిధిలోని తాళ్లమడ గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ జీపును గుర్తు తెలియని లారీ సైడ్ నుంచి వేగంగా ఢీకొని వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ ఉమర్ కుడిచేయి నుజ్జునుజ్జు అయ్యి మాంసం ముద్దలు జీపులో పడ్డాయి. దీంతో జీపు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. జీపులో ఉన్న ఏఎస్సై రాజుకు తలకు గాయమైంది. హోంగార్డు కె.అశోక్ చేయి విరిగింది. విషయం తెలుసుకున్న సీఐ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం ఉమర్‌ను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చేయి తొలగించారు. ఏఎస్సై రాజు, హోంగార్డు అశోక్‌కు చికిత్స నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాలకు సమాచారం అందించారు. గాయపడిన ఉమర్ చేయి తొలగించాల్సి రావడంతో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉమర్‌కు వివాద రహితుడిగా మంచిపేరు ఉంది. ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా క్రైం కేసుల్లో చురుగ్గా వ్యవహరించి పలు మార్లు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. -
మ్యాప్‌మైఇండియాలో వాటా కొన్న ఫ్లిప్‌కార్ట్
బెంగళూరు: నావిగేషన్, ట్రాకింగ్ సొల్యూషన్స్ అందించే మ్యాప్‌మైఇండియా సంస్థలో వ్యూహా త్మక మైనారిటీ వాటాను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. సరఫరా చెయిన్ నిర్వహణను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఫ్లిప్‌కార్ట్ వాటా కొనుగోలుతో మ్యాప్‌మైఇండియాకు ప్రారంభంలో పెట్టుబడులు అందించిన నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్, లైట్‌బాక్స్ వెంచర్స్ సంస్థలు మ్యాప్‌మైఇండియా నుంచి నిష్ర్కమిస్తాయి. మ్యాప్‌మైఇండియా స్వతంత్రగానే కార్యకలాపాలను కొనసాగిస్తుంది.