
మ్యాప్‌మైఇండియాలో వాటా కొన్న ఫ్లిప్‌కార్ట్
బెంగళూరు: నావిగేషన్, ట్రాకింగ్ సొల్యూషన్స్ అందించే మ్యాప్‌మైఇండియా సంస్థలో వ్యూహా త్మక మైనారిటీ వాటాను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. సరఫరా చెయిన్ నిర్వహణను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఫ్లిప్‌కార్ట్ వాటా కొనుగోలుతో మ్యాప్‌మైఇండియాకు ప్రారంభంలో పెట్టుబడులు అందించిన నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్, లైట్‌బాక్స్ వెంచర్స్ సంస్థలు మ్యాప్‌మైఇండియా నుంచి నిష్ర్కమిస్తాయి. మ్యాప్‌మైఇండియా స్వతంత్రగానే కార్యకలాపాలను కొనసాగిస్తుంది.