ప్రణాళికతోనే విజయం
♦ జీవన విధానంలో మార్పుతో అవకాశాలు
♦ 'సాక్షి' భవిత గ్రూప్స్ అవగాహన సదస్సులో వక్తలు
♦ కిటకిటలాడిన ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం
♦ వేల సంఖ్యలో తరలివచ్చిన నిరుద్యోగులు
ఖమ్మం: సరైన ప్రణాళికతోనే విజయం సాధ్యమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ భవిత ఆధ్వర్యంలో ఖమ్మం లోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం గ్రూప్స్‌పై అవగాహన సదస్సు జరి గింది. ఈ సదస్సులో పలువురు మాట్లాడుతూ జీవన విధానంలో మార్పుతోనే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. వేలాదిగా వచ్చిన అభ్యర్థులు గ్రూప్స్‌పై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. జీవన విధానంలో మార్పులతోనే గమ్యాన్ని చేరుకుంటామని వక్తలు సూచించారు. వివరాలు వారి మాటల్లోనే..
శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి
శక్తి సామర్థ్యాలు కూడగట్టుకొని ముందుకెళ్తే గమ్యాన్ని చేరుకోవచ్చు. ప్రభుత్వం 1.7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది.. వాటిని దక్కించుకునేందుకు నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. ఉన్నత పదవులు అలంకరించిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతం వారేనని గుర్తెరగాలి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఓ మంచి కార్యక్రమం చేపట్టిన 'సాక్షి'కి అభినందనలు.
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ, వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు
పోటీని తట్టుకుని ముందుకెళ్లాలి
వయో పరిమితిని 44 ఏళ్లకు సడలించడం వల్ల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దానిని తట్టుకుని ముందుకెళితే విజయం సిద్ధిస్తుంది. రాష్ట్రంలో ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా.. గ్రూప్స్‌లోనూ ఆ పేరుకు సార్థకత తీసుకురావాలి. సామాజిక స్పృహతో 'సాక్షి'చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. - పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే
సామర్థ్యమే గీటురారుయి
గ్రూప్స్‌లో విజయూనికి సామర్థ్యమే గీటురాయి. ఉద్యోగుల విభజన, తదితర సమస్యల వల్ల ఉద్యోగాల సంఖ్యపై స్పష్టత కొరవడింది. అందుకే గ్రూప్స్ నోటిఫికేషన్‌లో జాప్యం ఏర్పడింది. అభ్యర్థులకు అన్ని విషయూల్లో అవగాహన కల్పించేందకు ఇంటర్నెట్ సర్వీసులను వినియోగిస్తున్నాం. ఫేక్ వెబ్‌సైట్‌లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
- బానోత్ చంద్రావతి, టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలు
పుస్తక పఠనంతోనే పూర్తి సమాచారం
పుస్తక పఠనంతోనే పూర్తి సమాచారం అందుతుంది. అభ్యర్థులు తెలంగాణ చరిత్రపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. . గతంలో కొన్ని ముఖ్య తేదీల విషయంలో అభ్యర్థులకు తికమక ఉండేది. ఈ దఫా గ్రూప్స్‌లో తేదీలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నాం.
- అడపా సత్యనారాయణ, టీఎస్‌పీఎస్‌సీ సిలబస్ కమిటీ సభ్యులు
ప్రతి రోజూ విలువైనదే
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ప్రతి రోజూ విలువైనదే. నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి. కోచింగ్ సెంటర్ల మెటీరియలే కాకుండా సిలబస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అంశాలవారీగా చదివినప్పుడే సబ్జెక్టుపై పట్టు సాధిస్తారు. రాజ్యాంగాన్ని ఆకళింపు చేసుకోవాలి.
- చంద్రశేఖర్‌గౌడ్, గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఆటిట్యూడ్‌లో మార్పు రావాలి
ఆటిట్యూడ్‌లో మార్పులు వచ్చినప్పుడు విద్యలో రాణించవచ్చు. మనిషి శుభ్రంగా ఉండేలా చూసుకుంటే ఆటోమెటిక్‌గా మెదడూ సక్రమంగా పనిచేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. పాజిటివ్ థింకింగ్‌తో ఉన్నప్పుడు విజయాన్ని చేరుకోవచ్చు. భావోద్వేగాలకు దూరంగా ఉండాలి.
- ప్రొఫెసర్ కె.రామానుజరావు, సోషియూలజీ అధ్యాపకులు
ఏకాగ్రత అవసరం
ఏకాగ్రతతో చదవడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సులువవుతుంది. ప్రస్తుతం కొందరు 'గాలి చదువులు, దున్నపోతు చదువులు, నీళ్ల చదువులు' వంటి మూడు రకాల చదువులకు అలవాటుపడుతున్నారు. ఇవి అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత కోసమే పనికొస్తాయి. ఏకాగ్రతతో చదవడం వల్ల జీవితంలో విజయా లను అందుకోవచ్చు. - ప్రొఫెసర్ కనకాచారి, అర్థశాస్త్ర నిపుణులు