groups
-
పశ్చిమ బెంగాల్: ఇరువర్గాల మధ్య చెలరేగిన హింస.. నిషేదాజ్ఞలు అమలు
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. డిజిటల్ డిస్ప్లే బోర్డులో అభ్యంతరకర మెసేజ్ వచ్చిన నేపధ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకూ 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.బెల్దంగాలో జరిగిన ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసు అధికారి తెలిపారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కార్తీకమాస పూజల వేదిక సమీపంలోని గేటు వద్ద ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డుపై ఉన్న సందేశం ఒక వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపధ్యంలోనే ఇరు వర్గాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక పోలీసు వాహనంపై కూడా దాడి జరిగింది. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది.ఈ ఘర్షణల కారణంగా సీల్దా నుంచి ముర్షిదాబాద్ వెళ్తున్న భాగీరథి ఎక్స్‌ప్రెస్ కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. ఈ ఘటనకు మమతా బెనర్జీ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ అల్లర్లకు పాల్పడినవారిని గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ.. -
Odisha: ఘర్షణల్లో యువకుని మృతి.. ఖుర్దాలో నిషేధాజ్ఞలు
ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒక యువకుని మృతికి దారితీసింది. ఈ ఘటన నేపధ్యంలో మరిన్ని అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ (బీఎన్‌ఎస్‌స్)లోని సెక్షన్ 163 కింద జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు. ఖుర్దా పట్టణ శివార్లలోని ముకుంద్ ప్రసాద్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని, ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఈ ఘర్షణల్లో గాయపడిన వ్యక్తిని ఖుర్దా జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిశీలించి, అతను మృతిచెందినట్లు ప్రకటించారు. ఇరువర్గాల మధ్య జరిగిన హింసాకాండలో పలు వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఎస్.కె. ప్రియదర్శి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.ఈ హత్య అనంతరం స్థానికులు రోడ్డుపై బైఠాయించి వీరంగం సృష్టించారని పోలీసు సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ మీడియాకు తెలిపారు. అయితే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనం అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ చంచల్ రాణా మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఘర్షణల దరిమిలా ఖుర్దా మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో తక్షణమే నిషేధాజ్ఞలు విధించినట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వాణిజ్య సంస్థలు మూతపడనున్నాయి. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
పరీక్షల వాయిదాకు గూడుపుఠాణి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షల వాయిదాకు దొంగలు గూడు పుఠాణి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందని, వారి ధనదాహంతో నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం భూత్పూర్ రోడ్డులోని ఏఎస్ఎం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పుట్టగతులుండవనే కుట్రలు ‘పార్టీ ఎప్పుడు బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. హరీశ్, కేటీఆర్‌కు సవాల్ విసురుతున్నా.. పరీక్షల వాయిదా కోసం మీరు ఆమరణ దీక్షకు కూర్చోండి. మా ప్రభుత్వంలో నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే బిల్లా, రంగాలు పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలి.పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వారి పక్షాన మీరు దీక్షకు దిగాలి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన. కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవనే వారు కుట్రలు చేస్తున్నారు..’అని సీఎం ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశాయి ‘కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు.. మేం మీలా దొంగ దెబ్బ తీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కేసీఆర్.. ముందుంది మొసళ్ల పండగ. మా ఎమ్మెల్యేలను నువ్వు గుంజుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలే దా? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయి. కాంగ్రెస్ పారీ్టతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పా. కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫామ్‌హౌస్‌లోనే పడు కో. నాలుగు రోజులుగా హరీశ్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తనదాకా వస్తే గానీ వాళ్లకు నొప్పి తెలియలేదు..’అని రేవంత్ విమర్శించారు.ఆగస్టు 15లోపు రుణమాఫీ ‘నేను కార్యకర్తల్లో ఒక కార్యకర్తను. అందుకే ముఖ్య నాయకులను కలవాలని ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని కలిస్తే నాకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. కార్యకర్తల కష్టంతోనే టీపీసీసీ అధ్యక్షుడి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు ఎదిగా. ఈ ప్రభుత్వం మీది.. మీ సూచనలు, సలహాలను ప్రభుత్వం పాటిస్తుంది. నాయకుల ఎన్నికలు ముగిశాయి.. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.ఇప్పటివరకు మీరు నాయకుల కోసం కష్టపడ్డారు.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
తెలంగాణలో 2, 910 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 50 వేల మార్కు దాటింది. ఈ ఏడాది ఇప్పటివరకు 49,550 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించగా, తాజాగా వివిధ శాఖల్లోని మరో 2,910 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాదిలో భర్తీకి అనుమతి లభించిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 52,460కి చేరింది. తాజాగా అనుమతి లభించిన వాటిలో గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్–2 కింద 663, గ్రూప్– 3 కింద 1,373 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లోని మరో 874 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారానే భర్తీ చేయనున్నారు. గ్రూప్–2 పోస్టుల భర్తీ నిమిత్తం జీవో నం.145, గ్రూప్–3 పోస్టుల భర్తీ నిమిత్తం జీవో నం.146ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల భర్తీ గ్రూప్–2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ఏఎస్‌వోలు), గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఏసీటీవోలు, సబ్ రిజిస్ట్రార్లు, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులున్నాయి. గ్రూప్–3 కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఎక్కువ ఉన్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, జూన్, జూలైతో పాటు ఆగస్టు నెలలో కూడా పలు దఫాలుగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా అనుమతి ఇచ్చిన పోస్టుల వివరాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మంగళవారం రాత్రి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోందని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదీ చదవండి: తెలంగాణ.. కానిస్టేబుల్ ఎగ్జామ్ కీ విడుదల.. ప్రతీ అభ్యర్థికి ఐదు మార్కులు! -
విశాఖ తీరంలో మరోసారి ఉద్రిక్తత
-
మత్య్సకారుల మధ్య ఘర్షణ: బోట్లపై సినీ ఫక్కీలో ఛేజింగ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రింగువలల కోసం మత్య్సకారుల మధ్య గొడవ చెలరేగింది. దీనిపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అంతటితో ఆగకుండా, రెండు వర్గాలు సినీ ఫక్కీలో సముద్రంపై ఛేజింగ్‌లు చేసుకున్నాయి. దీంతో విశాఖలోని.. పెద్ద జాలరీపేట గంగమ్మ గుడివద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం సంభవించింది. దీంతో సముద్రతీరం రణరంగంగా మారింది. చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్ భేటీ -
సూర్యాపేట : రెండు వేర్వేరు పెళ్లిళ్లకు వచ్చిన వర్గాల మధ్య ఘర్షణ
-
బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారికే కరోనా ముప్పు ఎక్కువ
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అంచనాలను బట్టి ఓ, బీ బడ్ గ్రూపుల వారికన్నా ఏ, ఏబీ బడ్ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని, ఏ, ఏబీ బ్లడ్ గ్రూపులు వారికే కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని విన్నాం. కానీ తాజాగా సీఎస్ఐఆర్ నిర్వహించిన అధ్యయనంలో మరో కీలక విషయం వెలుగు చూసింది. 'ఓ' గ్రూపు వారితో పోలిస్తే బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారికే వైరస్ ఎక్కువ సోకుతోందని తేలింది. ఈ గ్రూపుల వారిపైనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సీఎస్ఐఆర్ అధ్యయనం సీఎస్ఐఆర్ పరిశోధనా పత్రం ప్రకారం బీ, ఏబీ బ్లడ్ గ్రూపు ఉన్న ప్రజలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారే కరోనాకు ఎక్కువగా గురవుతున్నారని తెలిపింది. అలాగే ఓ గ్రూపు వారు తక్కువ సెరో-పాజిటివిటీ లేదా ప్రమాదంలో ఉన్నారని ఆగ్రాలోని పాథాలజిస్ట్ డాక్టర్ అశోక్ శర్మ వెల్లడించారు. అలాగే దేశవ్యాప్త సెరో సర్వే ప్రకారం శాఖాహారుల కంటే మాంసాహారం తినేవారికే కరోనా సంక్రమించే అవకాశం ఎక్కువ ఉందని తేల్చారు. శాఖాహారుల్లో బలమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. వారు తినే శాఖాహార ఆహారంలో అధిక ఫైబర్ కంటెంట్ ఉందని అధ్యయనం పేర్కొంది. హై-ఫైబర్ ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీ అని విశ్వసిస్తాం కనుక ఇది ఇన్ఫెక్షన్ అనంతర సమస్యలను నివారించడంతోపాటు, వైరస్‌నూ నిరోధిస్తోందని ఈ స్టడీ తెలిపింది. దేశవ్యాప్తంగా 10వేల మందితో నిర్వహించిన ఈ అధ్యయనంలో 140 మంది వైద్యులు కూడా ఉన్నారు. అయితే చాలామంది నిపుణులు ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. విభేదిస్తున్న కొంతమంది నిపుణులు ఓ బ్లడ్ గ్రూపు ఉన్నవారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందనీ, అంతమాత్రాన వారు కోవిడ్-19 ప్రోటో కాల్‌కు విరుద్ధంగా పవర్తించాలని కాదని పేర్కొన్నారు. ఎందుకంటే వారికి కూడా కరోనావైరస్ సోకుతుందనే విషయాన్ని గుర్తించాలని సీనియర్ వైద్యుడు డాక్టర్ ఎస్.కె. కల్రా తెలిపారు. ఇది కేవలం "నమూనా సర్వే" అని, ఇది పీర్-రివ్యూడ్ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ కాదని అన్నారు. ఎందుకు వ్యత్యాసం ఉందో పూర్తిగా విశ్లేఫించకుండా, అర్థంచేసుకోకుండా, కొన్నిబ్లడ్ గ్రూపులకు మాత్రమే రోగనిరోధక శక్తి ఉందని తేల్చడం చాలా తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఓ బ్లడ్ గ్రూప్ (పాజిటివ్ లేదా నెగటివ్)’ కలిగిన ప్రజలపై కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపించడం లేదని, బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ, డెన్మార్క్‌లోని ఓడెన్స్ యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకులు ఏడాది అక్టోబరులో వేర్వేరుగా జరిపిన రెండు అధ్యయనాల్లో తేల్చారు. వైరస్ కారణంగాశరీర అవయవాలు చెడిపోవడం, మత్యువాత పడడం వీరిలో చాలా తక్కువని వెల్లడించారు. కాగా గత 24 గంటల్లో 3.29 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3,876 మరణించారు. 3.56 లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 82.39 శాతంగా ఉంది. అయితే మరణాల రేటు ప్రస్తుతం 1.09 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు ఇప్పటికీ 20 శాతానికి పైనే ఉండటం గమనార్హం. చదవండి: కరోనా: ప్రముఖ రచయత, నటుడు కన్నుమూత -
ఫేస్బుక్లో ఆ రికమెన్‌డేషన్‌లుండవు...!
ప్రస్తుత కాలంలో బ్యాంకుల్లో అకౌంట్లు, ఫేస్బుక్లో అకౌంట్లు లేని వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఫేస్బుక్లో మనకు తరుచూగా వేరే వ్యక్తులు లేదా గ్రూపులకు సంబంధించిన రికమన్డేషనులు వస్తుంటాయి. మనకు ఫలానా వ్యక్తులు లేదా గ్రూపులు నచ్చితే మనం వాటిలో జాయిన్ అవుతాం. ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. అంతేకాకుండా సామాజిక సంస్థలు కూడా ఫేస్బుక్లో గ్రూపులను క్రియేట్ చేస్తున్నాయి. భవిష్యత్తులో రాజకీయ, సామాజిక సంస్థల ఖాతాలను మనకు రికమెన్డేషన్గా ఈ గ్రూప్‌లు కనిపించవు. ప్రస్తుతం ఫేస్బుక్ ఈ విషయంపై పనిచేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా గ్రూప్‌లో ఫేస్బుక్ నియమాలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులను బ్లాక్ చేయనుంది. కొన్ని ఫేస్బుక్ గ్రూపులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి కూడా ఉపయోగిస్తున్నారని పరిశోధకులు, పౌర హక్కుల సంస్థలు చాలాకాలంగా ఫేస్‌బుక్‌ను హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టడానికి సంస్థ పలు చర్యలను తీసుకోవాలని భావించింది. ఏదైనా అంశంపై కొత్తగా సృష్టించే ఫేస్బుక్ గ్రూపులకు కచ్చితంగా ఫలానా గ్రూపును ఫేస్బుక్ మానిటర్ చేయనుంది. ఫలానా గ్రూప్ అర్హత సాధించాలంటే 21 రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉందని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ టామ్ ఎలిసన్ తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో, ఫేస్బుక్ వినియోగదారులకు హెల్త్ గ్రూప్‌లను రికమెన్డేషన్ చేయడాన్ని ఆపివేసింది. ఈ గ్రూపుల్లో ఉండే వారికి సరైన సమాచారాన్ని ఎక్కువగా అందించలేకపోయాయి , ఆ సమాచారంతో కొంతమంది వ్యక్తులు ఇబ్బందులకు గురైయ్యారని ఫేస్బుక్ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి కొన్ని నెలల ముందు, కొన్ని ఫేస్బుక్ గ్రూప్‌లు తప్పుడు సమాచారాన్ని, హింసాత్మక సంఘటనలు ప్రేరేపించేలా చేసాయని ఫేస్బుక్ తెలిపింది. ఈ గ్రూప్‌లు ఇతర ఫేస్బుక్ యూజర్లకు రికమెన్డేషన్ చూపించకుండా ఉన్న పలు ఫేస్బుక్ గ్రూప్‌లు గణనీయంగా పెరిగాయని ఫేస్బుక్ తెలిపింది. -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్ బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు కొత్త అప్ డేట్ అందించింది. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ తోఎప్పటికీ మ్యూట్ చేసే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్ లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని ట్వీట్ చేసింది. వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ ఫీచర్‌ను చివరకు లాంచ్ చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ క్రొత్త ఫీచర్ ప్రజలు ఆ ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపులనుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇదిసహాయపడుతుంది. చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపులనుంచి నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు. అవసరమైతే దీన్ని అన్‌మ్యూటింగ్ అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. You can now mute a chat forever 🤫 pic.twitter.com/DlH7jAt6P8 — WhatsApp Inc. (@WhatsApp) October 23, 2020 -
కత్తులతో దాడి.. క్రికెట్ రేపిన చిచ్చు
కేవీపల్లె(చిత్తూరు జిల్లా): క్రికెట్ ఆట యువకుల మధ్య చిచ్చుకు కారణమైంది. ఇరువర్గాల ఘర్షణకు దారి తీసింది. కత్తులు, కర్రలతో దాడి చేసుకోవడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు..కేవీపల్లె మండలం దిన్నెవడ్డిపల్లెకు చెందిన యువకులు గురువారం క్రికెట్ ఆడారు. గ్రామానికి చెందిన నాగసిద్ధులు (45) కుమారుడు నాగార్జున, నాగసుబ్బయ్య (34) బావమరిది నరేష్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇదే విషయంపై శుక్రవారం సాయంత్రం నాగసిద్ధులు, ఆయన కుమారులు వెంకటష్, నాగార్జున, బావమరిది యల్లయ్య, తమ్ముడు చంద్ర (43), తమ్ముని కుమారులు శ్రీనివాసులు, గిరిబాబు వర్గం, నాగసుబ్బయ్య, అతని తమ్ముడు నాగేంద్ర (32), బావమరది నరేష్ వర్గం పరస్పరం కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. (చదవండి: ఆవు తెచ్చిన తంటా!) ఈ ఘర్షణలో నాగసిద్ధులు కడుపు, చేతిపై కత్తిపోట్లు పడి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే నాగసుబ్బయ్య తలకు తీవ్రగాయమైంది. అలాగే నాగేంద్ర, చంద్ర సైతం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ నలుగురినీ 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. -
వాట్సాప్ కొత్త ఫీచర్ : భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ త్వరలో మరో బ్రహ్మాండమైన సదుపాయాన్ని వినియోగదారులకు అందించబోతోంది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే వాట్సాప్ బీటా వెర్షన్ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను అందించబోతోంది. ముఖ్యంగా ఒకే మెసేజ్‌ను పది గ్రూపుల ద్వారా తిప్పి తిప్పి వందసార్లు రిసీవ్ చేసుకుంటూ.. విసిగెత్తిపోతున్న వాట్సాప్ యూజర్లకు(ఇష్టం లేకపోతే ఆయా గ్రూపులనుండి బయటకు వచ్చే అవకాశం ఉన్నా) ఇది నిజంగా మంచి ఊరట నిచ్చే ఫీచరే. ఎందుకంటే ఏదైనా గ్రూపులో చేరాలా వద్దా? అనేది ఇకపై వాట్సాప్ వినియోగదారుల చేతుల్లోనే ఉండబోతోంది. ఎవరు బడితే వారు, గ్రూపుల్లో యాడ్ చేయకుండా నియంత్రించేలా వాట్సాప్ మూడు ఆప్షన్లను తీసుకురాబోతోంది. వాబేటా ఇన్ఫో.కాం అందించిన సమాచారం ప్రకారం ఇన్విటేషన్ ఫీచర్‌ను జోడించనుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సాప్ బిజెనెస్‌లో అమలు చేస్తుండగా..అదనపు భద్రత కోసం వాట్సాప్‌లో కూడా తీసుకు రాబోతోంది. తమను గ్రూప్స్‌లో ఎవరు జోడించవచ్చో స్వయంగా యూజర్లే ఎంచుకోవడానికి అనుమతించే ఫీచర్ అన్నమాట. దీని ప్రకారం ప్రైవసీ సెటింగ్స్‌లో మూడు ఆప్లన్లు ఉంటాయి. 1. నోబడీ : ఎవరికీ మిమ్మల్ని గ్రూపులో జోడించే అవకాశం ఉండదు 2. మై కాంటాక్ట్స్ : కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే యూజర్‌ను గ్రూపులో యాడ్ చేసేందుకు అనుమతినివ్వడం 3. ఎవ్రీవన్ : అంటే యూజర్ పరిచయం లేకపోయినా, కాంటాక్ట్స్‌లో లేకపోయినా గ్రూపులో యాడ్ చేసేలా అనుమతినివ్వడం. ఈ ఫీచర్ త్వరలో వాట్సాప్ బీటాకి పరిచయం మవుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం టెస్ట్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది, ఆసక్తి వున్నవారు దాన్ని ప్రయత్నించవచ్చట. అయితే బగ్స్ ఎటాక్, క్రాష్‌లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే, ఈలింక్పై క్లిక్ చేసి టెస్టింగ్ ప్రోగ్రాం నుంచి వైదొలగవచ్చని వాబేటా అందించిన రిపోర్టులో నివేదించింది. -
ఈ గట్టునుంటారా... ఆ గట్టుకెళ్తారా...!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వర్గాలుగా విడిపోయిన నాయకులతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు సహజమే అయినప్పటికీ... ఎన్నికల సంవత్సరంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సొంత పార్టీ యంత్రాంగాన్నే అయోమయానికి గురిచేస్తున్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ భట్టి విక్రమార్కలకు మద్దతుదారులుగా విడిపోయిన నాయకులు ఎవరికి వారే తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గానికి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి కీలక నాయకులుగా ఉన్నారు. భట్టి విక్రమార్క వర్గానికి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నాయకత్వం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్, బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు, సిర్పూర్ నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్ కూడా ప్రేంసాగర్ వర్గంగానే కొనసాగుతున్నారు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తొలగించాలని రేవంత్‌రెడ్డి నేతృత్వలో ఢిల్లీ వెళ్లిన 19 మంది నేతల బృందంలో వీరు కూడా ఉన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి తన స్థాయి తగ్గకుండా తనదైన రీతిలో వ్యవహరిస్తున్నారు. బస్సు యాత్ర సమయంలోనే విభేదాలు సుస్పష్టం ప్రజా చైతన్య యాత్ర పేరుతో గత మేనెలలో ఉత్తమ్ బృందం ఐదు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఈ విభేదాలు తీవ్రమయ్యాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బస్సు యాత్ర తమ నియోజకవర్గాల్లోకి వచ్చినప్పుడే ప్రేంసాగర్‌రావు గ్రూపు నాయకులు హడావుడి చేశారే తప్ప పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. చెన్నూర్‌లో బహిరంగసభ వెలవెలబోయే పరిస్థితుల్లో బోడ జనార్దన్ చివరి నిమిషంలో చేసిన ప్రయత్నంతో పరువు నిలిచింది. ఉత్తమ్, భట్టి వర్గాలుగా బాహాటంగానే బలప్రదర్శనలు చేశారు. ఇక గత నెలలో రంజాన్ సందర్భంగా మహిళల కోసం ప్రేంసాగర్‌రావు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి, భట్టి విక్రమార్కతో పాటు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డీకే అరుణ తదితర నాయకులను ఆహ్వానించారు. గత కొంతకాలంగా భట్టి విక్రమార్క గ్రూపులో శ్రీధర్‌బాబుతో కలిసి కార్యక్రమాలు చేస్తున్న ప్రేంసాగర్‌రావుకు రేవంత్ వర్గం నుంచి వచ్చిన ముగ్గురు నేతల మద్దతు లభించడంతో మరింత బలం చేకూరింది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు రాష్ట్రస్థాయిలో ఉన్న రెండు ప్రధాన వర్గాలకు ముఖ్య నాయకులుగా మారడంతో రాజకీయం వీరి చుట్టూనే తిరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో హోరాహోరీ మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గ్రూపులో ఉండి, డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా, మాజీ ఎమ్మెల్యేగా అరవింద్‌రెడ్డికే సీటొస్తుందని ఆయన వర్గీయులు చెపుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు నియోజకవర్గంలో మండలాలు, గ్రామాల వారీగా పర్యటిస్తూ, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఈసారి మంచిర్యాల నుంచి తాను పోటీ చేయడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. చెన్నూర్‌లో మాజీ మంత్రి బోడ జనార్దన్ ప్రస్తుతం ప్రేంసాగర్‌రావు వర్గంలో చేరిపోయారు. అరవింద్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టికెట్టు వేటలో ఉన్నారు. బెల్లంపల్లిలో కూడా ఇదే వర్గానికి చెందిన పీసీసీ సభ్యుడు చిలుముల శంకర్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరోసారి పోటీకి సిద్ధపడుతుండగా, ప్రేంసాగర్‌రావు గ్రూపు నుంచి మున్సిపల్ కౌన్సిలర్ రొడ్డ శారద ప్రధాన పోటీదారుగా మారారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు దుర్గాభవాని సైతం టిక్కెట్టు రేసులో ఉన్నారు. నిర్మల్ మినహా మిగతా చోట్ల రెండు వర్గాలు డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్‌రెడ్డితో పోటీపడే నాయకులు సమీపంలో మరొకరు లేడు. నిర్మల్‌తో పాటు ముథోల్, ఖానాపూర్‌లలో కూడా ఆయన వర్గీయులే పార్టీ టిక్కెట్ల రేసులో ముందున్నారు. ముథోల్, ఖానాపూర్‌లలో టిక్కెట్ల కోసం పోటీ ఉన్నా, మహేశ్వర్‌రెడ్డి ఎవరి పేరు చెపితే వారికే ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి నెలకొంది. కానీ మిగతా నియోజకవర్గాల్లో ఉత్తమ్ వ్యతిరేకవర్గం భవిష్యత్తులో కీలకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈనెల 11వ తేదీన ఏఐ సీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా అనేక నియోజకవర్గాల్లో ప్రేంసాగర్‌రావు వర్గీయులు బలప్రదర్శనకు దిగడం గమనార్హం. ఆసిఫాబాద్‌లో సగం సగం... ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదివాసీ ఉద్యమం తరువాత తన గ్రాఫ్‌ను మరింత పెంచుకున్నారు. ఇక్కడ ఆయన మినహా మరో పేరున్న నాయకుడు కాంగ్రెస్‌లో లేరు. తన వర్గంలో ఉన్న ఆత్రం సక్కుకు ఆదివాసీ ఉద్యమం సందర్భంగా పోలీసులు పెట్టిన కేసుల విషయంలో ప్రేంసాగర్‌రావు తగిన తోడ్పాటు అందించడం గమనార్హం. సిర్పూర్లో మహేశ్వర్‌రెడ్డి వర్గంలో బీసీ ఉద్యమ నాయకుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి ఉన్నారు. సిడాం గణపతి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి వర్గీయుడైన రావి శ్రీనివాస్ ప్రస్తుతం ప్రేంసాగర్‌రావు క్యాంపులో ఉన్నారు. ఆయన టిక్కెట్టు ఆశిస్తున్నప్పటికీ బీసీ, స్థానికత అంశాలు తెరపైకి వస్తే శ్రీనివాస్ యాదవ్‌కే అధిక ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. -
పోటీపరీక్షలకు స్టయిఫండ్, వసతితో ఉచిత శిక్షణ
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : నేడు దేశంలో పెరుగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు ఎటువంటి జవాబుదారీతనం వహించట్లేదు. అడపాదడపా నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ సరైన శిక్షణ లేక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు ఆగస్ట్ 4వ తేదీన, ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను ఆగస్ట్ 6న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల నందు అర్హత పరీక్షను జూలై 30 తేదీన పరీక్ష రాయదలచిన వారు www.krishnamma.org వెబ్సైట్ నందు పేర్లు నమోదు చేసుకొనగలరు. మరింత సమాచారం కోసం 99850 36121 నెంబర్‌ను సంప్రదించగలరు. -
మెప్మా.. ముడుపులేంటి చెప్మా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. లంచం ఇవ్వనిదే రుణాలు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు మెప్మా ద్వారా రుణాలు ఇస్తున్నారు. ప్రతి రుణానికి రూ.5 వేల చొప్పున సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. మెప్మాలో పనిచేసే ఆర్సీ సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు కాబట్టి.. రుణాలు పొందే లబ్ధిదారుల నుంచి వసూలు చేసి ఇవ్వాలని గత ప్రాజెక్ట్ డైరెక్టర్ నిబంధన పెట్టారు. ప్రతి పది గ్రూపులకు ఒక ఆర్సీ ఉంటా రు. వీరు గ్రూపుల నుంచి ఏమేరకు రుణాలు వసూలు కావాల్సి ఉంది, పాత రుణం ఎప్పటికి పూర్తవుతుంది, కొత్తగా రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలు చెబుతుంటారు. వీరికి ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం ఇవ్వడం లేదు. వారికి వేతనాలు చెల్లించే పేరిట లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడటం వివాదాస్పదం అవుతోంది. ప్రతి లబ్ధిదారు నుంచి రూ.5 వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్ము జిల్లాస్థాయి వరకూ పంపిణీ అవుతోందని సమాచారం. ఇతరుల నుంచీ.. స్వయం సహాయక సంఘాల మహిళల భర్తలు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు.. వారి పిల్లల చదువు కోసం కూడా మెప్మా ద్వారా రుణాలు ఇస్తారు. ఈ విభాగంలో ఏడాది జిల్లాలోని అన్ని పట్టణాలకు 983 యూనిట్లు మంజూరు కాగా.. 612 యూనిట్లకు రుణాలిచ్చారు. దీంతోపాటు తోపుడు బళ్ల వ్యాపారులకు రుణాలు ఇవ్వడం, నైపుణ్య అభివృద్ధి పథకం కింద నిరుద్యోగుల స్వయం ఉపాధికి సంబంధించి శిక్షణ ఇప్పించి, రుణాలు మంజూరు చేయడం వంటి పథకాలు ఉన్నాయి. ఐదు మున్సిపాలిటీలలో స్త్రీ నిధి బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ఆయా విభాగాల వారీగా ఇచ్చే రుణాలకు సంబంధించి ఒక్కో రేటు కట్టి వసూలు చేస్తున్నారు. రూ.లక్ష రుణం పొందితే రూ.5 వేలు సమర్పించుకోవాలి్సందే. అంతకు తక్కువ ఇస్తే ఊరుకోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పైసా ఇవ్వక్కర్లేదు మెప్మా పీడీగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశరావును ఈ విషయమై వివరణ కోరగా.. రుణాల కోసం ఎవరికీ పైసా చెల్లించాలి్సన అవసరం లేదన్నారు. ఎవరైనా సొమ్ము డిమాండ్ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలని కోరారు. అవినీతి ఆరోపణలు వస్తే క్లస్టర్, మండల, జిల్లా స్థాయి అధికారినైనా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. అవినీతిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదన్నారు. -
గడువు పెంపుపై గ్రూప్-2 అభ్యర్థుల మహా ధర్నా
-
వానర దండు హల్చల్!
కొలిమిగుండ్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం మధ్యాహ్నం వానర దండు హల్చల్ చేసింది. సుమారు 60కి పైగా వానరాలు రెండు గ్రూపులుగా విడిపోయి కిచ్‌కిచ్ అంటూ పెద్ద ఎత్తున అరుపులు చేస్తూ హంగామా సృష్టించాయి. ఒక దానిపై ఒకటి పడి దాడి చేసుకున్నాయి. దాదాపు 20 నిమిషాల పాటు పోరు సాగించాయి. స్థానికులు కర్రలతో చెదర గొట్టేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. చివరకు బాణసంచా పేల్చడంతో వానర సైన్యం వెళ్లి పోయింది. - కొలిమిగుండ్ల -
ఏప్రిల్ నుంచి రైతుమిత్ర గ్రూపులకు రుణాలు
- జిల్లా సహకార అధికారి ప్రవీణ అమలాపురం టౌన్ : వచ్చే ఏప్రిల్ నుంచి సహకార సంఘాల్లో జాయింట్ లైబిలిటీ గ్రూపుల (జేఎల్‌జీ) ద్వారా రైతుమిత్ర గ్రూపులకు రుణాలు ఇవ్వనున్నామని, ఈలోగా జిల్లాలోని 304 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జేఎల్‌జీ గ్రూపుల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా సహకార అధికారిణి (డీసీవో) టి.పవ్రీణ వెల్లడించారు. జేఎల్‌జీల ఏర్పాటు, రైతు గ్రూపులకు రుణాల బట్వాడా తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు స్థానిక డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో అమలాపురం డివిజన్లోని సంఘాల అధ్యక్షులు, సీఈవోలకు మంగళవారం జరిగిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఇంతకాలం సహకార సంఘాల్లో రైతులకు వ్యక్తిగతంగానే పంట రుణాలు ఇచ్చేవారు, ఇప్పుడు జేఎల్‌జీ విధానంలో రైతులకు కూడా గ్రూపులుగా రుణాలు ఇచ్చే వెసులబాటు అందుబాటులోకి వస్తోంది. డివిజనల్ సహకార అధికారి ఎ.రాధాకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో డీసీవో ప్రవీణ పలు సహకార అంశాలపై చర్చించారు. కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చే విధానాలపై ఆమె సమీక్షించారు. డిజిటల్ మెంబరు రిజస్ట్రేషన్ (డీఎంఆర్)కు సంబంధించి సంఘ సభ్యుల పూర్తి సమాచారం సేకరించాలని ఆమె సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సంఘాలు 50:50 పద్ధతిలో గోదాములు నిర్మించుకునే వెసులబాటును సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ పేర్కొన్నారు. సంఘాల్లో తెల్లకార్డు కలిగిన సభ్యులకు ఆరోగ్య రక్ష ద్వారా బీమా కల్పించాలని సూచించారు. జిల్లా సహకార ఆడిటర్ వీవీ ఫణికుమార్ సంఘాల్లో ఆడిట్, జేఎల్జీపై సంఘాల అధ్యక్షులకు అవగాహన కల్పించారు. జిల్లా సహకార విద్యాధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు, కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య అధ్యక్షుడు గోకరకొండ విజయ రామారావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబి మాట్లాడుతూ సహకార సంఘాల్లో జేఎల్‌జీ విధానం అమలుపై ప్రసంగించారు. -
ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
ఎవరికి వారు.. టీడీపీ తీరే వేరు
నరసాపురంలో రెండు గ్రూపులుగా ఎన్టీఆర్ వర్ధంతి భీమవరంలోనూ అదే పరిస్థితి సొంత గడ్డపై కార్యక్రమాలకు సీతారామలక్ష్మి డుమ్మా నరసాపురం : జిల్లా టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా మరోసారి బహిర్గతమయ్యాయి. జిల్లాలో పలుచోట్ల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పార్టీ దివంగత నేతకు నివాళిగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలను సంబరాల తరహాలో జరపడం విమర్శల పాలైంది. నరసాపురం నియోజకవర్గంలో ఎవరికి వారే అన్నట్టుగా వీటిని నిర్వహించారు. పట్టణంలోని స్టీమర్ రోడ్డులో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, అన్నదానం నిర్వహించగా.. మునిసిపల్ చైర్పర్సన్ పి.రత్నమాల, ఏఎంసీ చైర్మన్ రాయుడు శ్రీరాములు, మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్ వారి అనుచరులతో కలసి శివాలయం సెంటర్లో కార్యక్రమాలు చేశారు. భీమవరంలో వర్గపోరు నడుమ.. భీమవరం: భీమవరం నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు నడుమ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలో 12 చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తన స్వస్థలమైన భీమవరంలో మొక్కుబడిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), రాష్ట్ర మంత్రి పీతల సుజాత వర్గీయులు వేర్వేరుగా కార్యక్రమాలు జరిపారు. భీమవరం పట్టణ టీడీపీ శ్రేణులు మూడు గ్రూపులుగా విడిపోయారు. గత ఎన్నికల్లో భీమవరం సీటును తోట సీతారామలక్ష్మి తన కుమారుడు జగదీష్‌కు ఇప్పించుకునేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. అప్పటినుంచి ఎమ్మెల్యే అంజిబాబు, ఎంపీ సీతారామలక్ష్మి మధ్య వర్గపోరు నడుస్తోంది. అదేవిధంగా పార్టీ రాష్ట్ర నాయకుడు మెంటే పార్థసారథి కూడా అప్పట్లో సీటు ఆశించి భంగపడ్డారు. ఆయన ప్రత్యేక గ్రూపు నడుపుతున్నట్టు టీడీపీ శ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. తమ్ముడూ.. బూతులతో కుమ్ముడు తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) : తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య నెలకొన్న కుమ్ములాటలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోసారి బయటపడ్డాయి. జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. బూతులు ఉపయోగించి మరీ ఒకరినొకరు పరోక్షంగా తిట్టుకున్నారు. తొలుత శేషమహల్ రోడ్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కొందరు టీడీపీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు హాజరయ్యారు. సభ పూర్తయ్యే సమ యానికి పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఈలి నాని, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అక్కడికి రాగా.. అప్పటికే కార్యక్రమాలు అయిపోయాయి. దీంతో వారు కంగుతిన్నారు. అదే సమయంలో మంత్రి మాణిక్యాలరావు తన దారిన తాను వెళ్లిపోయారు. దీంతో సీతారామలక్ష్మి తదితరులు అక్కడి నుంచి పాదయాత్రగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేసిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ వెళ్లారు. చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తదితరులు ప్రాంగణం బయటే ఉండిపోయారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఒక వర్గం వారు వర్ధంతి సభ నిర్వహించడంపై వాడీవేడిగా చర్చించారు. ఆ కార్యక్రమానికి మీరెందుకు వెళ్లారంటూ కొంత మంది నాయకులను జెడ్పీ చైర్మన్ నిలదీశారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఎక్కడ జరిగినా వెళ్తామని చెప్పగా.. ఇంకొందరు అలా ఎలా వెళతారంటూ నిలదీశారు. జెడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేయగా.. అక్కడున్న నాయకుల్లో కొందరు బూతు పంచాంగా విప్పారు. -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
ఎమ్మెల్యే ఎదుటే బూతుల పంచాంగం కొల్లూరు : జనచైతన్య యాత్రల్లో తెలుగు తమ్ముళ్ల ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా మండలంలోని తిప్పలకట్ట గ్రామం దీనికి వేదికైంది. సాక్షాత్తూ స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలోనే బూతుల పంచాంగంతో ఒకరిపై ఒకరు వీరంగం వేశారు. సోమవారం గ్రామంలో జనచైతన్య యాత్ర ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలో నిర్వహించారు. అనంతరం భోజనాల కార్యక్రమంలో కొల్లూరు ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్, తిప్పలకట్ట సర్పంచి దివి మహాలక్ష్మి భర్త సీతారామయ్య మధ్య వివాదం చెలరేగింది. తిప్పలకట్టలో పదిరోజుల క్రితం జరిగిన గేద దొంగతనం కేసులో స్థానిక ఎంపీటీసీ అద్దంకి నాగమల్లేశ్వరరావును అడ్డుపెట్టుకొని ఆడిస్తున్నారంటూ సీతారామయ్య వ్యాఖ్యానించడంతో వాగ్వివాదం మొదలైంది. ఎంపీపీ, శీతారామయ్యల మధ్య మాటల యుద్దం తారస్థాఽయికి చేరి బూతుల పంచాంగానికి తెరలేచింది. అంతేగాక తోపులాటకు దిగారు. ఎమ్మెల్యే, కృష్ణా పశ్చిమ డెల్టా పీసీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ వివాదాన్ని సర్దు బాటు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇంతలో వైస్ ఎంపీపీ గొరికపూడి ప్రసాద్ ఎంపీపీని దూషించిన వ్యక్తికి మైనేని మురళీకృష్ణ వత్తాసు పలుకుతున్నారంటూ వాదనకు దిగడంతో వివాదం తారస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఎంపీపీ మధు తనకు ఎటువంటి సంబంధం లేని విషయాన్ని అడ్డుపెట్టుకొని దూషించడం ఏంటని ముందు ఆ వ్యవహారం తేల్చాలని ఎమ్మెల్యేని పట్టుబట్టడంతో ఎమ్మెల్యే తలపట్టుకోవాల్చి వచ్చింది. రోజురోజుకు పార్టీలో పెరుగుతున్న వివాదాలు, విభేదాలతో పార్టీ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళనను ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. -
గ్రూప్–1,2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీపీఎస్సీ గ్రూప్–1, 2 పోస్టులకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ డీడీ కె.కృష్ణ ధనుంజయరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విశాఖపట్నంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని డీఆర్డీఏ కాంప్లెక్సులోని సాంఘిక సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ప్రగతి భవన్, సెక్టర్ 9, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం–530 017 చిరునామాకు అందజేయాని సూచించారు. 45 ఏళ్లలోపు నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులు అర్హులని స్పష్టం చేశారు. మూడు నెలల శిక్షణా కాలంలో సై్టఫండ్, స్టడీ మెటీరియల్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఎమ్మిగనూరులో కుక్కల స్వైర విహారం
– ఒకే రోజు 15 మందిపై దాడి ఎమ్మిగనూరు రూరల్: ఎమ్మిగనూరు పట్టణంలో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలో ఎస్ఎంటీ కాలనీ, వీవర్స్ కాలనీ, 11వ వార్డు, 18వ వార్డు, గీతానగర్, సోమప్ప నగర్, మునెప్ప నగర్, శాంతినగర్, ఉప్పర వీధి, గాంధీ నగర్ ప్రాంతాల్లో కుక్కలు కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజు 15 మంది గాయపడ్డారు. ఆయా కాలనీలకు చెందిన సంగీత, రాము, గోపాల్, నందు, విజయ్, దుర్గ, ఫీజ్, అమరేష్, నీలావతి, లక్ష్మీ, పురుషోత్తం, మస్తాన్, రాజేష్, ప్రశాంత్, రాముడు, కోటేకల్ నరసింహులు, కడిమెట్ల విశ్వ కూడా కుక్క కాటుకు గురైనారు. పట్టణంలో కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దసరా సెలవులు కావటంతో చిన్నారులు ఇంటి బయట ఆటలాడుకుంటుండగా కుక్కలు దాడి చేస్తున్నాయి. గాయపడిన బాధితులు చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటున్నారు. వీవర్స్ కాలనీలో ఓ వ్యక్తి దాదాపు పది కుక్కలను ఇంట్లో పెంచుకుంటున్నాడు. ఆ కుక్కల దాడిలో నలుగురు గాయపడినట్లు కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతామని హెచ్చరిస్తున్నారు. -
పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి
మోతె: మండల మహిళా పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని క్లస్టర్ ఏపీఎం మైసయ్య అన్నారు. గురువారం మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు నెల సరి సంపాదించే డబ్బును పొదుపు చేసుకోవాలన్నారు. నెల నెల సంఘాలతో జరిగే సమావేశాలల్లో ఆర్థిక లావాదేవీలు బైలా ఆమోదం పొందాలన్నారు. అనంతరం మండల ఏపీఎం వెంకయ్య మాట్లాడుతూ ప్రతి మహిళా సంఘం నుంచి నిల్వ చే సిన డబ్బుతో మహిళలు స్వయం ఉపాధికి ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. సీసీలు ప్రతి గ్రామంలో నెలవారి మీటింగ్‌లు నిర్వహించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి లోన్లు అధికంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు కాంపాటి రాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీజీఎం మల్లేష్, సీసీలు నందు, సత్యం, శ్రీనివాస్, అకౌంటెంట్ వెంకటలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్, ఆయా గ్రామాల మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
కట్టడి చేయండి
– భూమా వర్గీయులపై ఫిర్యాదు – కుల వివక్ష సృష్టించారని ఆరోపణ – పింఛన్ల దందా చేస్తున్నారంటూ విమర్శ – అధికార పార్టీలో లుకలుకలు నంద్యాల: ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వర్గీయుల దూకుడుకు కళ్లెం వేయాలని, లేకపోతే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, పలు కౌన్సిలర్లు సమన్వయ కమిటీకి ఫిర్యాదు చేశారు. కర్నూలులోని మౌర్య ఇన్‌లో శుక్రవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, హౌసింగ్ కార్పొరేషన్ ౖచెర్మన్ వర్ల రామయ్య హాజరయ్యారు. పార్టీ వర్గాల సమావేశం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూమా వర్గం కౌన్సిలర్లు టీడీపీలో చేరినా విపక్ష కౌన్సిలర్లలా వ్యవహరిస్తున్నారని.. గత నెల కౌన్సిల్ మీట్లో కుల వివక్షతను సష్టించాలని యత్నించారని సమన్వయ కమిటీకి శిల్పా వర్గీయులు తెలిపారు. తాము సద్దుకొని పోవాలని యత్నిస్తున్నా.. కలుపుకొని వెళ్లడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తాము ఇప్పించిన పింఛన్లు రద్దు చేసి, కొత్త వాటిని ఇస్తామని భూమా వర్గీయులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారని.. రేషన్ షాపులను రద్దు చేయిస్తామని బెదిరిస్తున్నారని, ఇప్పటికే ఒక రేషన్ డీలర్‌ను తొలగించారని వివరించారు. భూమా వర్గం స్పీడ్‌కు బ్రేకులు వేయకపోతే, ఐక్యత కష్టమని, లేకపోతే మరో నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పార్టీ నేత లోకేష్ దృష్టికి తీసుకొని వెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు సమాచారం. అగ్రనేతలు డుమ్మా.. పార్టీ సమన్వయ సమావేశానికి మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే భూమా, మాజీ మంత్రి ఫరూక్‌లతో పాటు వారి వర్గీయులు ఎవరూ హాజరు కాలేదు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల కోసం జనరల్ సైన్స్‌కు ఎలా ప్రిపేర్ కావాలో తెలపండి? - హెచ్. లహరి, కొత్తపేట జనరల్ సైన్స్ విభాగంలోని బయాలజీలో వృక్ష, జంతు వైవిధ్యం-వాటి లక్షణాలు; ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. అలాగే మానవ శరీర ధర్మశాస్త్రం; వ్యాధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. గ్రూప్-1లో శరీర అవయవాలు- పని తీరు- వ్యాధులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌తో మిళితమైన ప్రశ్నలూ కనిపిస్తున్నాయి. (ఉదా: ఇటీవల కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, అమల్లోకి వచ్చిన టీకాలు, మందులు, చికిత్స విధానాలు, నోబెల్ పురస్కారాలు-సంబంధిత పరిశోధనలు వంటివి). ఫిజిక్స్ ప్రశ్నలు అప్లైడ్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం ముఖ్యాంశాలుగా చదవాలి. రసాయన శాస్త్రానికి సంబంధించి సివిల్స్, గ్రూప్స్‌లో క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. నిత్య జీవితంలో మానవులు వినియోగించే పలు రసాయనాలు (ఉదా: కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్స్), ప్లాస్టిక్స్, పాలిమర్స్, కాంపొజిట్స్‌పై సమాచారం తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక ప్రత్యేకత, మూలకాలపై దృష్టి సారించాలి. -
గ్రూప్స్‌పై గురి
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లక్షల మంది ప్రతిభావంతుల లక్ష్యం గ్రూప్స్‌లో సక్సెస్.. తద్వారా రాష్ట్ర స్థాయిలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవడం.. ఖాళీలు వందల్లో ఉంటే... పోటీ లక్షల్లోనే! ఉదాహరణకు ఇటీవల తెలంగాణలో గ్రూప్-2 పోస్టులు 439.. 5,64,431 దరఖాస్తులు.. తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాలకు పోటీ ఏ మేరకు ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ‘ఇంత పోటీని తట్టుకొని విజయం సాధించడం కష్టమే’ అంటూ నిట్టూరుస్తున్న ఔత్సాహికులకు టీఎస్పీఎస్సీ తీపి కబురు అందించింది. పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఖాళీల సంఖ్య పెరిగే అవకాశంతో పాటు పూర్తిస్థాయి ప్రిపరేషన్‌కు మరింత సమయం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త సిలబస్‌పై కసర త్తు, గ్రూప్స్ నోటిఫికేషన్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పరీక్షల్లో రాణించేందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, విజయానికి చేరుకోవడమెలా? అనే దానిపై ‘అష్ట’ సూచనల సమాహారం.. 1. పటిష్ట ప్రణాళిక పోటీ పరీక్షలో విజయానికి పటిష్ట ప్రణాళిక అవసరం. గ్రూప్స్ ఔత్సాహికులు రోజువారీ ప్రణాళికలను రూపొందించుకోవాలి. జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ వంటి అంశాలను రోజూ చదివేలా ప్రణాళిక వేసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఏ రోజు లక్ష్యాలను ఆ రోజే పూర్తిచేయాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది విజయానికి చేరువ చేస్తుంది. రోజుకు పది గంటలు ప్రిపరేషన్‌కు అందుబాటులో ఉంటే ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటలు కేటాయించాలి. ఇప్పటికే సిలబస్ పూర్తిచేసి ఉంటే, మరోసారి క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు సిద్ధపడాలి. 2. అనుసంధానత స్మార్ట్ ప్రిపరేషన్‌ను అలవరచుకోవడం ప్రధానం. తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను అధ్యయనం చేసే దిశగా ఆలోచించాలి. గ్రూప్1, 2 సిలబస్‌లోని ఉమ్మడి అంశాలను గుర్తించి, వాటిని ఒకేసారి అధ్యయనం చేయాలి. ఇలా అనుసంధానించుకుంటూ చదవడం వల్ల సమయం ఆదా అవుతుంది. దాంతో పాటు సబ్జెక్టుపై పట్టు ఏర్పడుతుంది. ఉదాహరణకు తెలంగాణ సిలబస్‌ను పరిగణలోకి తీసుకుంటే.. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సిలబస్‌లో ‘తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం’ అంశాలున్నాయి. అదే విధంగా పేపర్-2 సిలబస్‌లో ప్రాచీన తెలంగాణలో సాంఘిక-సాంస్కృతిక పరిస్థితులు అనే అంశాలున్నాయి. ఈ రెండింటినీ కలిపి చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 3. సొంత నోట్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో షార్ట్‌నోట్స్‌ను తయారు చేసుకోవాలి. ఈ నోట్స్‌లోని అంశాలు ముఖ్యమైనవి కాబట్టి ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. ప్రస్తుత ప్రిపరేషన్ సమయంలో చాలాముఖ్యమైన అంశాలను షార్ట్‌కట్ నోట్స్‌గా రాసుకోవాలి. ఇది పరీక్ష ముందు క్విక్ రివిజన్ సమయంలో ఉపయోగపడుతుంది. ముఖ్యమైన భావనలపై పట్టు సాధించేందుకు షార్ట్‌నోట్స్ దోహదపడుతుంది. 4. రివిజన్ పరీక్ష ఏదైనా అందులో విజయం సాధించాలంటే రివిజన్ చాలా ముఖ్యం. అందుకే వీలైనంత తొందరగా ప్రిపరేషన్‌ను పూర్తిచేసి, పరీక్షకు ముందు రివిజన్‌కు తగిన సమయం కేటాయించాలి. ఇంకా తేదీలు ప్రకటించకపోయినా, వాటి గురించి ఆలోచించకుండా సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. 5. మోడల్ పేపర్ల ప్రాక్టీస్ చాప్టర్ల వారీగా ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం పూర్తయ్యాక పేపర్ల వారీగా మోడల్ టెస్ట్‌లు రాయాలి. స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్ పరంగా బలాలు, బలహీనతలు తెలుస్తాయి. బలహీనంగా ఉన్న అంశాలకు అధిక సమయం కేటాయించి, వాటిపైనా పట్టు సాధించాలి. పరీక్షకు ముందు వీలైనన్ని గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం మరవొద్దు. టీఎస్పీఎస్సీ ఇటీవల కాలంలో వివిధ ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహించింది. వాటికి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్లను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1, గ్రూప్-2 ప్రీవియస్ పేపర్స్‌ను పరిశీలించడం మేలు చేస్తుంది. 6. గ్రూప్ స్టడీ పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించడానికి గ్రూప్ స్టడీ ఉపయోగపడుతుంది. క్లిష్టమైన అంశాలపై పట్టు సాధించేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. వీలైన సమయాల్లో అభ్యర్థులు తమ స్నేహితులతో కలిసి చదవాలి. వివిధ అంశాలపై చర్చించాలి. ఒకరికి తెలియని అంశాలను మరొకరితో పంచుకోవాలి. ఇలా చర్చించిన అంశాలు చాలా కాలం పాటు గుర్తుంటాయి. మెటీరియల్ పరంగా లోటుపాట్లు ఉంటే అవి గ్రూప్ స్టడీ వల్ల తొలగిపోతాయి. 7. సమకాలీన అంశాలు గ్రూప్స్‌లో విజయం సాధించేందుకు ఉపయోగపడే మరో ముఖ్యాంశం.. సబ్జెక్టులను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ వంటి సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు ఇది చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవాలి. వాటిని సిలబస్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. 8. స్వీయ విశ్లేషణ సబ్జెక్టులను ప్రిపేరవుతున్నా, ప్రాక్టీస్ టెస్ట్‌లు రాస్తున్నా.. ప్రిపరేషన్ ఏ దశలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఏవైనా తప్పులను గుర్తిస్తే, వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి. ఏవైనా సందేహాలుంటే బిడియపడకుండా ఫ్యాకల్టీని అడిగి, నివృత్తి చేసుకోవాలి. సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి తెలంగాణ గ్రూప్స్ ఆశావహులు తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక అంశాలపై దృష్టిసారిస్తే జనరల్ స్టడీస్ పేపర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జీఎస్ పేపర్లో తెలంగాణ ప్రత్యేక అంశాల నుంచి దాదాపు 40 ప్రశ్నలు వచ్చినట్లు అర్థమవుతోంది. ఏపీ ఔత్సాహికులు దీర్ఘ కాలిక ప్రిపరేషన్ వ్యూహాలను అనుసరించాలి. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్. -
చిన్నారుల జీవితాల్లో వెలుగులు
గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీల సామాజిక సేవ తక్కువ బరువున్న చిన్నారులకు సమతుల ఆహారం అందించడం, బిడ్డల సంరక్షణ గురించి గిరిజనులకు వివరించడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా స్వయం సహాయక బృందాల (డబ్ల్యూఎస్‌ఎచ్‌జీ)ను ఏర్పాటు చేసింది. ఇవి బాధిత చిన్నారులను దత్తత తీసుకొని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం ఇప్పిస్తున్నాయి. - కొండగావ్/ధమ్తారీ (ఛత్తీస్‌గఢ్) ఎక్కడో మూలనపడేసినట్టుంటే ఛత్తీస్‌గఢ్ గిరిజన జిల్లా కొండగావ్‌లోని గోండుపల్లెలో పుట్టిన రెండేళ్ల బాలిక ప్రియాంక బరువు కేవలం ఐదు కిలోలు. తగిన పోషకాహారం లేకపోవడం ఈ చిన్నారికి శాపంగా పరిణిమించింది. దీంతో చికిత్స కోసం ఆమెను రెండు నెలల క్రితం స్థానిక పోషకాహార పునరావాస కేంద్రానికి (ఎన్సార్సీ) తీసుకెళ్లారు. శాంపూర్ అనే కుగ్రామానికి చెందిన రోజువారీ కూలీలకు చెందిన కుటుంబానికి చెందిన ప్రియాంక అక్కడ 15 రోజులు ఉంచి చికిత్స చేయడంతో ఆమె కాస్త కోలుకుంది. ప్రియాంకలా తక్కువ బరువున్న చిన్నారులకు సమతుల ఆహారం అందించడం, బిడ్డల సంరక్షణ గురించి గిరిజనులకు వివరించడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా స్వయం సహాయక బృందాల (డబ్ల్యూఎస్‌ఎచ్‌జీ)ను ఏర్పాటు చేసింది. ‘ఎముకల గూడులా కనిపించిన ప్రియాంకకు నిత్యం ఎనిమిదిసార్లు సమతుల ఆహారం ఇచ్చాం. ప్రస్తుతం కొంత వరకు కోలుకుంది కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేదు. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బాలిక కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అని అంగన్వాడీ కార్యకర్త దూషణ్ పాండే చెప్పారు. నవజాతన్ పథకం కింద ఆమెకు రోజుకు ఐదారుసార్లు అన్నం, పప్పు, కూరగాయలతో కూడిన ఆహారపదార్థాలు పెడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ జనాభా 2.6 కోట్లు కాగా, వీరిలో 30 శాతం మంది గిరిజనులే. వీరి సంతానంలో 30.55 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. నవజాతన్ వంటి పథకాల అమలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా విజయాలు సాధించింది. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులను ఆదుకోవడానికి ప్రారంభించిన నవజాతన్ కార్యక్రమం అమలుకు డబ్ల్యూఎస్ఎచ్జీలను ఏర్పాటు చేసింది. పోషకాహార లేమితో బాధపడే చిన్నారుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నదని ధామ్తారీ జిల్లా కలెక్టర్ భీంసింగ్ అన్నారు. చిన్నారులు తమ వయసుకు తగ్గ బరువున్నదీ లేనిదీ తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా వజన్ త్యోహార్ (బరువు పండుగ)లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కాస్త నయం... ధామ్తారీలో 2012లో పోషకాహార లేమితో బాధపడే చిన్నారుల సంఖ్య 43.89 శాతం ఉండగా, 2014 నాటికి 33.71 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జూన్ 8 వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ప్రస్తుతం సమతుల ఆహార లేమితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 24.59 శాతంగా ఉంది. డబ్ల్యూఎస్ఎచ్జీలు ఇలాంటి చిన్నారులను దత్తత తీసుకొని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం ఇప్పిస్తున్నాయని సింగ్ చెప్పారు. గత మూడేళ్లలో తక్కువ బరువున్న బాలల సంఖ్య కూడా బాగా తగ్గినట్టు వజన్ త్యోహార్ల ద్వారా గుర్తించామన్నారు. 'మధ్యస్థాయి' లేదా 'అత్యల్పం' గా బరువున్న బాలలందరికీ నవజాతన్ పథకం ద్వారా బలవర్ధకమైన ఆహారం అందజేస్తున్నారు. ఈ పథకం రూపకల్పన, సామర్థ్యాల నిర్మాణం కోసం ఐరాస అధీనంలో పనిచేసే యూనిసెఫ్ తగిన సహకారం అందిస్తోంది. పేదరికం, లింగ, సామాజిక దురాచారాలు, నాయకత్వ, అవగాహన లేమి, కుటుంబ నియంత్రణ పాటించకపోవడం, చిన్న వయసులో గర్భం దాల్చడం వంటి సమస్యల వల్ల ఛత్తీస్‌గఢ్ గిరిజన గ్రామాల చిన్నారులకు పోషకాహారం అందడం లేదని డబ్ల్యూఎస్‌ఎచ్‌జీ సభ్యురాలు ఒకరు చెప్పారు. గిరిజనుల్లో స్త్రీపురుషులిద్దరూ మద్యం సేవించడం వల్ల వారి చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, పెంపకంపై శ్రద్ధ చూపలేకపోతున్నారని బేలారాణి బిశ్వాస్ అనే అంగన్వాడీ సూపర్వైజర్ అన్నారు. అందుకే గిరిజన దంపతులకు కూడా తరచూ కౌన్సెలింగ్ నిర్వహించి చిన్నారుల సంరక్షణ ప్రాధాన్యాన్ని వివరిస్తున్నామని చెప్పారు. మనదేశంలోని దాదాపు పది కోట్ల మంది గిరిజనులు ఇప్పటికీ పేదిరకంలోనే మగ్గుతున్నారని, వీరి చిన్నారులకు పోషకాహారం దొరకడం లేదని 2009లో అప్పటి ప్రణాళికా సంఘం ప్రకటించింది. -
‘సమాజం’పై నిశిత దృష్టి
* వర్తమాన అంశాలకు ప్రాధాన్యమివ్వాలి * ఉద్యమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు.. * సామాజిక శాస్త్రంలో ఇవన్నీ కీలకమే * టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ చింతా గణేశ్ * గ్రూప్స్‌పై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: ‘‘భారతీయ సమాజం, చారిత్రక నేపథ్యం, సామాజిక అసమానతలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఫలాలు, వాటిని పొందుతున్న వర్గాలు, అందుకు నోచుకోని సమాజం... సోషియాలజీలో ఇవన్నీ ప్రధానాంశాలే. సామాజిక మార్పులు, సమస్యలు, ప్రభుత్వ చర్యలన్నింటిపైనా అవగాహన ఉండాల్సిందే. భారతీయ సమాజ నిర్మాణం, కుటుంబ వ్యవస్థ, మతం, కుల వ్యవస్థల నిర్మాణాలతో పాటు వెట్టిచాకిరీ, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక సమస్యలు, చిన్న రాష్ట్రాల డిమాండ్లు తదితరాలూ పోటీ పరీక్షల్లో కీలకమే. గ్రూప్-1, 2, 3తో పాటు ఇతర పోటీ పరీక్షల జనరల్ స్టడీస్‌లోనూ వీటిపై ప్రశ్నలుంటాయి. గ్రూపు-1 అభ్యర్థులు లోతైన అధ్యయనం చేయాలి. విశ్లేషించాలి. వివరించాలి. సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలి. ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారు మాత్రం సమాచారం తెలుసుకుంటే చాలు. మొత్తంమీద ఏ పోటీ పరీక్షకైనా సోషియాలజీపై అవగాహన తప్పనిసరి’’ అని టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషియాలజీ ప్రొఫెసర్ చింతా గణేశ్ పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చదవాల్సిన కోణం తదితరాలపై ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... సోషియాలజీపై గ్రూప్స్ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రధానంగా భారతీయ సమాజానికి సంబంధించిన ఈ సబ్జెక్టులో ముఖ్యంగా ఐదు అంశాలున్నాయి. 1. భారతీయ సమాజం 2. సోషల్ ఎక్స్‌క్లూజన్, వల్నరబుల్ గ్రూప్స్ 3. దేశంలో సామాజిక సమస్యలు 4. తెలంగాణలో సామాజిక సమస్యలు 5. భారత్, తెలంగాణల్లో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు 1. భారతీయ సమాజం భారతీయ సమాజ లక్షణాలు, నిర్మితి సమస్యలుంటాయి. ప్రధానంగా సమాజ లక్షణాలు, సంస్కృతులు, జాతులు, మతాలు, జాతుల వర్గీకరణ ఉంటాయి. లక్షణాలు: మన దేశం ఒకే విధమైన లక్షణాలున్న సమాజం కాదు. ఏ మతం లక్షణాలు దానివే. హిందూ, బౌద్ధ, ముస్లిం మతాల లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి గనుక వాటి ప్రధాన లక్షణాలేమిటో తెలుసుకోవాలి. నిర్మితిలో ముఖ్య భాగాలు: కుల వ్యవస్థ, దాని లక్షణాలేమిటి? కుల వ్యవస్థలో మార్పులు, వాటికి దోహదం చేసే కారణాలేమిటన్నది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. కుల వ్యవస్థలోని సాంప్రదాయక లక్షణాల్లో మార్పులు ఎందుకొస్తున్నాయో చదువుకోవాలి. సమాజంలో కుటుంబ, వివాహ వ్యవస్థలు: కుటుంబం అంటే ఏమిటి, భారతీయ సమాజంలో వీటినెలా నిర్వచించారు, వాటి లక్షణాలు, వర్గీకరణలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కుటుంబ వ్యవస్థలో రెండు రకాల వర్గీకరణ ఉంది. ఎ. ఉమ్మడి కుటుంబం, బి. ప్రాథమిక కుటుంబ వ్యవస్థ. వాటి లక్షణాలను అర్థం చేసుకోవాలి. కుటుంబ, వివాహ వ్యవస్థల్లో ఏయే మార్పులొస్తున్నాయో చూసుకోవాలి. భారతీయ వ్యవస్థలో గ్రామీణ, నగర, గిరిజన.. ఈ 3 రకాల సమాజాలు, వాటి ప్రధాన లక్షణాలు తెలుసుకోవాలి. 2. సోషల్ ఎక్స్‌క్లూజన్, వల్నరబుల్ గ్రూప్స్ భారత సమాజంలో కొన్ని వర్గాలను సమాజానికి దూరంగా ఉంచారు. చారిత్రకంగా కొన్నింటిని జనజీవన స్రవంతిలోకి రాకుండా అడ్డుకున్నారు. వాటికి అభివృద్ధి ఫలాలందలేదు. ఉదాహరణకు నిమ్న కులాలు. సోషల్ ఎక్స్‌క్ల్లూజన్ (సామాజిక వైషమ్యత) అంటే ఇదే. మనుషులుగా సమాజంలో బతుకుతున్నా ఇతర ఉన్నత వర్గాలకున్న ప్రయోజనాలు వారికందలేదు. ఈ సామాజిక అసమానతలకు, సోషల్ ఎక్స్‌క్లూజన్‌కు మధ్య తేడాలు తెలుసుకోవాలి. బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు సామాజిక అసమానతలకు గురయ్యారు. వారి ప్రధాన సమస్యలు, వాటినెలా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందన్న అంశాలపై అవగాహన ఉండాలి. వృద్ధులు, వికలాంగులు సహా ఆయా వర్గాల సమస్యలు ప్రధానంగా ఏమిటన్నది అర్థం చేసుకోవాలి. 3. సామాజిక సమస్యలు పేదరికం, నిరుద్యోగం, బాలకార్మిక వ్యవస్థ, ప్రాంతీయ తత్వం, కుల తత్వం, మత తత్వం, సంఘర్షణలు, అవినీతి తదితర సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. వీటిని ఎలా చదవాలంటే: ప్రతి సమస్యకూ కారణాలను తెలుసుకోవాలి. పేదరికాన్నే తీసుకుంటే.. పేదరికమంటే ఏమిటి? కారణాలేమిటి? పర్యవసానాలేమిటి? ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతోంది? దానికి సంబంధించిన ఏమైనా సూచనలు ఉన్నాయా? ఈ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏ సమస్యకైనా నోట్స్ తయారు చేసుకోవాలి. ఉదాహరణకు హింస అంటే ఏంటి? ఎవరిపై జరుగుతోంది. ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతోంది. చట్టాలు చేసిందా? పరిష్కారానికి సూచనలేమిటి? ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. సమస్యల్లో కొన్ని ప్రత్యేక వర్గాలకు సంబంధించినవి, కొన్ని సామాన్యమైనవి ఉంటాయి. జనాభా, నగరీకరణ, పునరావాసం వంటివి సామాన్యమైన సమస్యలు. ఉదాహరణకు నగరీకరణ దాని లాభనష్టాలు, ఉత్పన్నమయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలేమిటి లాంటివి చదువుకోవాలి. 4. తెలంగాణలో సామాజిక సమస్యలు ఇందులో ప్రధానంగా వెట్టిచాకిరీ, దేవదాసి, జోగినీ వ్యవస్థల వంటివి వస్తాయి. వెట్టిచాకిరీ స్వాతంత్య్రానికి ముందు బాగా ఉన్న సమస్య. తెలంగాణ సాయుధ పోరాటానికి (1946-51) ఇదీ కారణమే. కాబట్టి సమస్యల చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలి. జోగినీ: ఈ వ్యవస్థ దేవాలయాలకు అనుబంధంగా ఏర్పడ్డా, క్రమక్రమంగా ఈ ముసుగులో మహిళలను ఎక్స్‌ప్లాయిట్ చేయడం మొదలైంది. ప్రస్తుతం జోగినీ, దేవదాసి వ్యవస్థలు తగ్గినా, వాటి చారిత్రక నేపథ్యం, ఎందుకొచ్చాయి, ఎలా కొనసాగాయన్నవి తెలుసుకోవాలి. బాల కార్మిక వ్యవస్థ: ఈ దేశవ్యాప్త సమస్య ప్రత్యేకించి తెలంగాణలో ఎక్కువగా ఎందుకుందో తెలుసుకోవాలి. చారిత్రకంగా తెలంగాణలో భూమి ప్రధాన జీవనాధారం. కాని భూమి ప్రాబల్య కులాల చేతుల్లోనే (భూస్వాముల) చేతుల్లోనే ఉంది. నిమ్న కులాలకు భూమి లేదు. బీసీ, దళిత కులాలు వారు భూమి లేని వ్యవసాయ కార్మికులుగా మారిపోయారు. ఆ కుటుంబాలనుంచి వచ్చిన పిల్లలు బాల కార్మికులుగా మారిపోయారు. ఆ వ్యవస్థ పరిష్కారానికి ఏమైనా మార్గాలున్నాయా? ప్రభుత్వాలేం చేస్తున్నాయి, ఏమైనా చట్టాలు ఉన్నాయా? వాటి అమలు పరిస్థితి ఏంటన్నది తెలిసి ఉండాలి. ఫ్లోరోసిస్ సమస్య: నల్లగొండ జిల్లాలో ఇది ప్రధాన సమస్య. ఆర్థి క సమస్యగా మారింది. కాబట్టి ఫ్లోరోసిస్ అంటే ఏంటి? దా నివల్ల సమస్యలు, పరిష్కార మార్గాలేమిటన్నది తెలుసుకోవాలి. వలసలు: తెలంగాణలో వలసలకు కారణాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకోవాలి. మహబూబ్‌నగర్ నుంచి భవన నిర్మాణ రంగ కార్మికులు, కరీంనగర్ నుంచి చేనేత కార్మికులు వలస వెళతారు. తెలంగాణ జిల్లాల్లో వలసలకు వృత్తి పరమైన ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని విశ్లేషించగలగాలి. ఆత్మహత్యలు: తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల సమస్య లు ప్రధానం. వాటివల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు కారణాలు, ప్రభుత్వం ఏం చేస్తోంది, వాటి పర్యవసానాలు ఏమిటన్నది తెలుసుకోవాలి. సామాజిక ఉద్యమాలు: ఇది మరో ప్రధానాంశం. తెలంగాణ సామాజిక ఉద్యమాల్లో రైతు ఉద్యమాలు, గిరిజన, వెనుకబడిన వర్గాల, దళిత, పర్యావరణ, మహిళా, ప్రాంతీయ ఉద్యమాలున్నాయి. ముఖ్యంగా చిన్న రాష్ట్రాల డిమాండ్ వచ్చిన ప్రాంతీయ ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలున్నాయి. అవి ఏ కారణాల వల్ల ఏర్పడుతున్నాయన్నది తెలుసుకోవాలి. దళిత ఉద్యమాన్ని సంస్కరణ, ప్రత్యామ్నాయ ఉద్యమమని 2 రకాలుగా చెప్పారు. ఇలా అనేక ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాలపై అవగాహన ఉండాలి. వాటిలోని అంశాలు తెలుసుకోవాలి. ప్రాంతీయ ఉద్యమాల్లో చిన్న రాష్ట్రాలు ప్రధానాంశం.తమిళనాడులో ఆత్మగౌరవోద్యమం, సత్యశోధకోద్యమం వంటివి తెలుసుకోవాలి. ఆ ఉద్యమాలు లేవనెత్తిన అంశాలు, వాటికి కారణాలు, సాధించిన విజయాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు జార్ఖండ్ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం. వీటివల్ల కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 5. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ ప్రథకాలు ఇందులో ఎ. ప్రభుత్వ విధానాలు, బి. ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలు. సి. సంక్షేమ పథకాలు. వీటిపై చాలా ఫోకస్ పెట్టాలి. ఎ. ప్రభుత్వ విధానాలు: రెండు రకాలు. అవి 1.బలహీనవర్గాలకు సంబంధించినవి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బాలలు, మహిళలకు సంబంధించిన జాతీయ విధానాలున్నాయి. వాటి లక్ష్యాలను తెలుసుకోవాలి. మొత్తం పాలసీ చదవాల్సిన అవసరం లేదు. ఆ విధానంలో లక్ష్యాలు, వ్యూహం, ఏయే అంశాలపై దానిని ప్రతిపాదించారో తెలుసుకోవాలి. 2. భారతీయ సమాజానికి ఉపయోగపడేవి. ఉదాహరణకు విద్యా విధానం, జనాభా విధానం, పర్యావరణ విధానం. బి. చట్టాలు: బలహీన వర్గాలకు సంబంధించి ఏమైనా చట్టాలు ఉన్నాయా? వాటి ప్రయోజనాలేమిటి? ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, 1950ల్లో వచ్చిన అంటరానితనం నిరోధక చట్టం, మానవ హక్కుల పరిరక్షణ చట్టం వంటివాటిపై అవగాహన తెచ్చుకోవాలి. మహిళలు, బాల కార్మిక చట్టాలపై సమగ్ర అవగాహన అవసరం. సి. సంక్షేమ పథకాలు: ఇందులో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమైంది. ఉదాహరణకు కేంద్రం తెచ్చిన భారత్ నిర్మాణ్, జేఎన్ ఎన్యూఆర్ఎం, ఎన్ఆర్ఈజీఎస్, ఎస్జీఎస్వై, ఐసీడీఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పథకం, భారత్ నిర్మాణ్, ప్రధాన మంత్రి జన్‌పథ్ యోజన, మేకిన్ ఇండియా, భేటీ బచావో వంటి వాటిపై అవగాహ న ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విధానాలు, పథకాలు తెచ్చాయి. తెలంగాణలో టీఎస్ ఐపాస్, భూపంపిణీ, డబుల్ బెడ్రూం వంటి పథకాలొచ్చాయి. వాటిపై అవగాహన పెంచుకోవాలి. ఇలా చదవాలి... గ్రూపు-1లో ఎక్కువ అంశాలు, గ్రూపు-2 కొన్ని అంశాలు పొందుపరిచారు. గ్రూపు-1లో లోతైన అధ్యయనం అవసరం. వివరణాత్మక, విశ్లేషణాత్మకంగా ఉండాలి. ఉదాహరణకు ఒక అంశాన్ని తీసుకుంటే ఆ సమస్య ఎందుకు వచ్చింది. కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. సమస్య పరిష్కారానికి సూచనలేమిటన్నది విశ్లేషించాలి. గ్రూపు-2లో సమాచారం మాత్రమే అవసరం. విశ్లేషణ అక్కర్లేదు. అవసరమైన సమాచారంపైనే ఫోకస్ చేయాలి. గ్రూపు-2లో పేదరికం తీసుకుంటే పేదరికమని దేనినంటారు. ప్రధాన కారణాలేమిటి. పర్యవసానాలేమిటి? నిర్మూలనకు పథకాలేమిటి? గ్రూపు ఏ-1 విషయానికొస్తే... పేదరికం ఎందుకుంది. సమగ్ర కారణాలు ఏంటి? నిర్మూలన కోసం ఏయే పథకాలు తెచ్చారు. అవి పని చేస్తున్నాయా లేదా? వాటి వల్ల వచ్చిన మార్పులు ఏంటి? ఒకవేళ ఎఫెక్టివ్‌గా లేకపోతే కారణాలేమిటి. దేశంలో నిర్మూలన లకు ఇంకా ఏం చర్యలు చేట్టాలన్నది విశ్లేషించాలి. గ్రూపు-3లోనూ గ్రూపు-2 తరహాలో చదువాలి. విషయం ఒకటే అయినా గ్రూపు-1, గ్రూపు-2లో చదివే విధానం ముఖ్యం. ఏ పుస్తకాలు చదవాలంటే తెలుగు అకాడమీ ముద్రించిన సమాజ శాస్త్రం, భారతీయ సమాజం, ఇండియా ఇయర్ బుక్, ఎకనామిక్ సర్వే రిపోర్టు చదవాలి. రెగ్యులర్‌గా న్యూస్‌పేపర్లు చదవాలి. వివిధ అంశాలపై గతంలో వచ్చిన ఆర్టికల్స్ చదవాలి. ఇంగ్లిష్‌లో ఇండియన్ సోషల్ సిస్టం, సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాలు చదవాలి. గ్రూప్స్ మాత్రమే కాకుండా ఇతర పోటీ పరీక్షల జనరల్‌స్టడీస్‌లోనూ వీటి గురించి అడుగుతారు. -
ప్రణాళికతోనే విజయం
♦ జీవన విధానంలో మార్పుతో అవకాశాలు ♦ 'సాక్షి' భవిత గ్రూప్స్ అవగాహన సదస్సులో వక్తలు ♦ కిటకిటలాడిన ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం ♦ వేల సంఖ్యలో తరలివచ్చిన నిరుద్యోగులు ఖమ్మం: సరైన ప్రణాళికతోనే విజయం సాధ్యమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ భవిత ఆధ్వర్యంలో ఖమ్మం లోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం గ్రూప్స్‌పై అవగాహన సదస్సు జరి గింది. ఈ సదస్సులో పలువురు మాట్లాడుతూ జీవన విధానంలో మార్పుతోనే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. వేలాదిగా వచ్చిన అభ్యర్థులు గ్రూప్స్‌పై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. జీవన విధానంలో మార్పులతోనే గమ్యాన్ని చేరుకుంటామని వక్తలు సూచించారు. వివరాలు వారి మాటల్లోనే.. శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి శక్తి సామర్థ్యాలు కూడగట్టుకొని ముందుకెళ్తే గమ్యాన్ని చేరుకోవచ్చు. ప్రభుత్వం 1.7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది.. వాటిని దక్కించుకునేందుకు నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. ఉన్నత పదవులు అలంకరించిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతం వారేనని గుర్తెరగాలి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఓ మంచి కార్యక్రమం చేపట్టిన 'సాక్షి'కి అభినందనలు. - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పోటీని తట్టుకుని ముందుకెళ్లాలి వయో పరిమితిని 44 ఏళ్లకు సడలించడం వల్ల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దానిని తట్టుకుని ముందుకెళితే విజయం సిద్ధిస్తుంది. రాష్ట్రంలో ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా.. గ్రూప్స్‌లోనూ ఆ పేరుకు సార్థకత తీసుకురావాలి. సామాజిక స్పృహతో 'సాక్షి'చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. - పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే సామర్థ్యమే గీటురారుయి గ్రూప్స్‌లో విజయూనికి సామర్థ్యమే గీటురాయి. ఉద్యోగుల విభజన, తదితర సమస్యల వల్ల ఉద్యోగాల సంఖ్యపై స్పష్టత కొరవడింది. అందుకే గ్రూప్స్ నోటిఫికేషన్లో జాప్యం ఏర్పడింది. అభ్యర్థులకు అన్ని విషయూల్లో అవగాహన కల్పించేందకు ఇంటర్నెట్ సర్వీసులను వినియోగిస్తున్నాం. ఫేక్ వెబ్సైట్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. - బానోత్ చంద్రావతి, టీఎస్పీఎస్సీ సభ్యురాలు పుస్తక పఠనంతోనే పూర్తి సమాచారం పుస్తక పఠనంతోనే పూర్తి సమాచారం అందుతుంది. అభ్యర్థులు తెలంగాణ చరిత్రపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. . గతంలో కొన్ని ముఖ్య తేదీల విషయంలో అభ్యర్థులకు తికమక ఉండేది. ఈ దఫా గ్రూప్స్‌లో తేదీలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. - అడపా సత్యనారాయణ, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ప్రతి రోజూ విలువైనదే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ప్రతి రోజూ విలువైనదే. నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి. కోచింగ్ సెంటర్ల మెటీరియలే కాకుండా సిలబస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అంశాలవారీగా చదివినప్పుడే సబ్జెక్టుపై పట్టు సాధిస్తారు. రాజ్యాంగాన్ని ఆకళింపు చేసుకోవాలి. - చంద్రశేఖర్‌గౌడ్, గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆటిట్యూడ్‌లో మార్పు రావాలి ఆటిట్యూడ్‌లో మార్పులు వచ్చినప్పుడు విద్యలో రాణించవచ్చు. మనిషి శుభ్రంగా ఉండేలా చూసుకుంటే ఆటోమెటిక్‌గా మెదడూ సక్రమంగా పనిచేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. పాజిటివ్ థింకింగ్‌తో ఉన్నప్పుడు విజయాన్ని చేరుకోవచ్చు. భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. - ప్రొఫెసర్ కె.రామానుజరావు, సోషియూలజీ అధ్యాపకులు ఏకాగ్రత అవసరం ఏకాగ్రతతో చదవడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సులువవుతుంది. ప్రస్తుతం కొందరు 'గాలి చదువులు, దున్నపోతు చదువులు, నీళ్ల చదువులు' వంటి మూడు రకాల చదువులకు అలవాటుపడుతున్నారు. ఇవి అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత కోసమే పనికొస్తాయి. ఏకాగ్రతతో చదవడం వల్ల జీవితంలో విజయా లను అందుకోవచ్చు. - ప్రొఫెసర్ కనకాచారి, అర్థశాస్త్ర నిపుణులు -
రేపే గ్రూప్స్ సిలబస్ ప్రకటన
వీలైతే ఆ వెంటనే.. లేదంటే ఎల్లుండి వెబ్సైట్లో అందుబాటులోకి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు మరింత సమయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4తోపాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్‌ను కమిషన్ సోమవారం ప్రకటించనుంది. ఆ సిలబస్‌ను వీలైతే ఆ వెంటనే కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి తేనుంది. లేదంటే మంగళవారం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సోమవారం సాయంత్రం పూర్తిస్థాయి సిలబస్‌ను స్వయంగా ప్రకటించనున్నారు. ప్రధాన పోటీ పరీక్షల సిలబస్‌ను ముందుగానే ప్రకటించాలని, ఆయా పరీక్షలకు కొత్త సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో కమిషన్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా గ్రూప్-1 మెయిన్స్‌లో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు జోడించారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంపైనా గ్రూప్-1, గ్రూప్-2లో ప్రత్యేకంగా పేపర్లను పెట్టారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సిద్ధం కావాల్సిన కొత్త సిలబస్‌కు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను ప్రకటించేందుకు కమిషన్ చర్యలు చేపట్టింది. పూర్తి సిలబస్ ఇవ్వనున్న ప్రధాన కేటగిరీలు, అంశాలివే.. గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఇంగ్లిష్: తప్పనిసరిగా క్వాలిఫై కావలసిన పరీక్ష పేపర్-1 (జనరల్ ఎస్సే): సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు; ఆర్థిక అభివృద్ధి న్యాయపరమైన అంశాలు; భారత రాజకీయ స్థితిగతులు, భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం; సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి; విద్య, మానవ వనరుల అభివృద్ధి అంశాలు. పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ): భారత దేశ చరిత్ర, సంస్కృతి, ఆధునిక యుగం (1757-1947); తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం; భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ. పేపర్-3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన): భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు; భారత రాజ్యాంగం; పరిపాలన . పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్): భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; తెలంగాణ ఆర్థిక వ్యవస్థ; అభివృద్ధి, పర్యావరణ సమస్యలు. పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ; డేటా ఇంటర్‌ప్రిటేషన్): శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం; విజ్ఞాన శాస్త్ర వినియోగంలో ఆధునిక పోకడలు; డేటా ఇంటర్‌ప్రిటేషన్- సమస్య పరిష్కారం. పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం): తెలంగాణ తొలి దశ (1948-70); ఉద్యమ దశ (1971-90); తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ. గ్రూప్-2: పేపర్-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ): భారతదేశ, తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర; భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; సమాజ నిర్మాణం, ప్రజా విధానాలు. పేపర్-3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్): భారత ఆర్థిక వ్యవస్థ: వివిధ అంశాలు- సవాళ్లు; తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి; అభివృద్ధి, మార్పు. పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం): తెలంగాణ తొలి దశ -ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70); ఉద్యమ దశ (1971-90); తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991-2014). గ్రూప్-3 పేపర్-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ): తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు. పేపర్-3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్): భారత ఆర్థిక వ్యవస్థ-అంశాలు, సవాళ్లు; తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; అభివృద్ధి, మార్పు. గ్రూప్-4 గ్రూప్-4లో జనరల్ స్టడీస్, సెక్రటేరియల్ ఎబిలిటీస్‌లో అడిగే అంశాలు. -
గురి పెడితే.. గ్రూప్స్ మీవే!
-
మనిషి శరీరంలో రక్తం ఎంత ఉంటుంది?
గ్రూప్స్‌ను మించేలా లెర్నింగ్ లెసైన్స్ పరీక్ష వాహనదారులకు సంబంధం లేని కఠిన ప్రశ్నలు ఎంవీ చట్టాలపైనా వాహనదారులకు ప్రశ్నలు 30 శాతానికి పైగా ఫెయిల్.. తీరుమారని రవాణా శాఖ సాక్షి, హైదరాబాద్: ఓజోన్ పొర దెబ్బతింటే ఏమవుతుంది?... మనిషి శరీరంలో ఉండే రక్తం ఎంత?... సఫోకేషన్(ఊపిరాడ కపోవడానికి) ప్రధాన కారణాలేంటి?... సూర్యాస్తమయం తర్వాత లైటు వేయకుండా వాహనం నడపటం ఏ సెక్షన్ కింద నేరం?.. రహదారులపై పరిమితికి మించిన బరువుతో వెళ్లే వాహనాలపై ప్రభుత్వం ఏ సెక్షన్ కింద ఆంక్షలు విధించింది?.. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 120/183(1)ను అతిక్రమిస్తే మొదటి నేరం కింద ఎంత జరిమానా విధిస్తారు?.. ఇవన్నీ సివిల్స్.. గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలు కాదు. రవాణా శాఖ లెర్నింగ్ లెసైన్సు కోసం అభ్యర్థులకు పెడుతున్న పరీక్షలోని ప్రశ్నలు. వాహన చోదకుని నైపుణ్యం, ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన వంటి అంశాల్లో అడగాల్సిన ప్రశ్నలు ఇంత కఠినంగా మారడంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ప్రశ్నలస్థాయి కఠినంగా ఉందని అభ్యర్థులు అభ్యంతరం చెపుతున్నా అధికారుల చెవికెక్కడంలేదు. డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో పాటించవలసిన నియమ, నిబంధనలు, జాగ్రత్తల కంటే అభ్యర్థుల మేధస్సును పరీక్షించడమే ధ్యేయంగా రవాణా శాఖ పరీక్షలు నిర్వహిస్తుండటంతో వాహనదారులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారుల సాయంతో లెర్నింగ్ లెసైన్సులు తీసుకునే వాహనచోదకులకు రోడ్డు నిబంధనలపై అవగాహన లేకుండా పోతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 10 ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో ప్రతి రోజూ 1,000-1,200 మంది లెర్నింగ్ పరీక్షలకు హాజరవుతుండగా.. వీరిలో 300 నుంచి 400 మంది కఠిన ప్రశ్నలను ఎదుర్కోలేక ఫెయిలవుతున్నారు. ఇదీ పరీక్ష తీరు.. లెర్నింగ్ లెసైన్స్‌ల కోసం 827 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకు ఉంది. ఇది ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. హా అభ్యర్థులు ఈ 827 ప్రశ్నలు-సమాధానాలు చదివి పరీక్షకు హాజరుకావాలి. కానీ వీటిలో 50 శాతం కఠిన ప్రశ్నలే ఉంటాయి. ఈ క్వశ్చన్ బ్యాంకు నుంచే 20 ప్రశ్నలతో లెర్నింగ్ టెస్ట్ ఉంటుంది. 10 నిమిషాల్లో కనీసం 12 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తిస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. కఠినమైన ప్రశ్నల వల్ల పన్నెండింటికి కూడా సమాధానాలు రాయలేక సుమారు 30 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. గ్రూప్-1 కొట్టేయొచ్చు ఆర్టీఏ లెర్నింగ్ లెసైన్స్ పరీక్ష కంటే గ్రూప్- 1 ప్రిలిమ్స్ ఈజీగా రాయొచ్చనిపించింది. ఇందులోని ప్రశ్నలు రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచేలా కాక.. మోటారు వాహన చట్టాలపై అవగాహన కోసం రూపొందించినట్లుగా ఉన్నాయి. - దేవిరెడ్డి, తార్నాక డెరైక్ట్‌గా వెళితే ఫెయిలే.. ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటున్నాయి. డెరైక్ట్‌గా వెళితే ఫెయిల్ కావలసిందే. బ్రోకర్ల ద్వారా వెళితే మాత్రం టెస్ట్ లేకుండానే లెసైన్స్ వచ్చేస్తుంది. - బన్నాల ప్రవీణ్ కుమార్, ఉప్పల్ ప్రశ్నల సరళిని మార్చాలి ప్రతి రోజూ వందలాది మంది లెర్నర్స్ లెసైన్స్ పరీక్ష అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. నేరుగా వెళ్లి పరీక్ష రాసి పాస్ కావడం అసాధ్యం. ఆర్టీఏ అధికారులు ప్రశ్నల సరళిలో మార్పులు చేయాలి. - గడ్డం రవికుమార్ -
శిక్షణ ‘క్యూ’
లక్ష ఉద్యోగాలు వస్తాయని సంతోషం కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్న అభ్యర్థులు కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలపై కోటి ఆశలు ఫంక్షన్ హాళ్లకు మారిన తరగతి గదులు సాక్షి, సిటీబ్యూరో/ముషీరాబాద్: హైదరాబాద్ ఆశావహుల కేంద్రంగా మారింది. ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న వేలాది మంది నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్నారు. ఒకటి, రెండు నెలల్లో సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడవచ్చునన్న వార్తల నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నిరుద్యోగ అభ్యర్ధులు భారీ సంఖ్యలో నగరానికి తరలిస్తున్నారు. దీంతో గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. కోచింగ్ సెంటర్లకు నెలవైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో పంక్షన్ హాళ్లు తరగతి గదులుగా మారాయి. ఒక్కొక్క సెంటర్లో వేలాది మంది శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకోవడంతో నిర్వాహకులు తరగతి గదులను పంక్షన్ హాళ్లలోకి మార్చారు. ఈ ప్రాంతాల్లోని అన్ని ఫంక్షన్ హాళ్లు మరో 6 నెలల వరకు కోచింగ్ సెంటర్ల కోసమే బుక్ అయ్యాయి. కొన్ని చోట్ల కమ్యూనిటీ హాళ్లు, సాంస్కృతిక కేంద్రాలు సైతం కోచింగ్ కేంద్రాలకు వేదికలవుతున్నాయి. కళలకు, సాంస్కృతిక ప్రదర్శనలకు కేంద్రమైన త్యాగరాయ గానసభ సైతం కోచింగ్ సెంటర్‌గా మారింది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభ్యర్థులకు శిక్షణనిచ్చేందుకు ఓ విద్యా సంస్థ 6 నెలల పాటు బుక్ చేసుకుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ చుట్టూ ఉన్న ఫంక్షన్ హాళ్లు కోచింగ్‌లకు వచ్చే అభ్యర్ధులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కొక్క తరగతిలో 1000 నుంచి 1500 మంది విద్యార్థులకు ఒకేసారి బోధిస్తున్నారు. బంగారు భవిత కోసం నిరీక్షణ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కోటి ఆశలతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ నాటికి వరుసగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ నియామకాలు, పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్, తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉన్న కోచింగ్ సెంటర్లలో సుమారు 50 వేల మంది శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో 1200 మందితో కొత్త బ్యాచ్‌ను ప్రారంభిం చేందుకు దర ఖాస్తులు విక్రయించగా, 4 వేల మందికి పై గా పోటీ పడ్డారు. దరఖాస్తుల కోసం అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ఇందిరా పార్కు వరకు బారులు తీరారు. అభ్యర్థుల తాకిడితో కొన్ని కోచింగ్ సెంటర్లు శిక్షణ కాలాన్ని 3 నుంచి 4 నెలలకు కుదిస్తున్నాయి. సాధారణంగా కరెంట్ అఫైర్స్, మెం టల్ ఎబిలిటీ, పాలిటీ, తదితర అంశాలలో ఆరు నెలల శిక్షణతో పాటు, స్టడీ మెటీరియల్‌ను అందించే శిక్షణ సంస్థ లు డిమాండ్ దృష్ట్యా స్టడీ మెటీరియల్‌ను అందజేయలేకపోతున్నాయి. వారం రోజుల్లో ప్రస్తుత బ్యాచ్‌లను ముగించి, కొత్త బ్యాచ్‌ల కోసం కోచింగ్ సెంటర్లు సన్నద్ధమవుతున్నాయి. ఉద్యోగం వదులుకొని వచ్చాను గచ్చిబౌలీలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాను. ఎలాగైనా సరే గ్రూప్-2 సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. - బాలకృష్ణ, ఎంబీఏ, మెదక్ ఆడపిల్లలకు మంచి అవకాశం కొత్త రాష్ట్రంలో ఎలాగైనా ఉద్యోగా లు వస్తాయనే నమ్మకం ఉంది. ము ఖ్యంగా అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఎంటెక్ చదువుతున్నాను. ప్రైవేట్ ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగాల్లోనే మంచి భవిష్యత్తు ఉంటుందని పట్టుదలగా చదువుతున్నాను. - వనిత, ఎంటెక్, నల్లగొండ లక్ష ఉద్యోగాల పైనే ఆశలు లక్ష ఉద్యోగాలొస్తాయనే వార్తలు ఎంతో ఆశ కలిగిస్తున్నాయి. కష్టపడి చదివితే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. కోచింగ్ తీసుకోవడం వల్ల మరింత అవగాహన పెరుగుతుంది. - సోమేష్, పీజీ, నల్లగొండ నమోదు కేంద్రాల్లోనూ రద్దీ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లకు ఉద్యోగార్థులు తరలి వస్తున్నారు. వివిధ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దీంతో మెహిదీపట్నంలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధి కల్పన కార్యాలయాల వద్ద రద్దీ బాగా పెరిగింది. ఈ ఏడాదిలోనే ఉద్యోగార్ధులు భారీ సంఖ్యలో తరలివచ్చినట్లు అధికారులు చె ప్పారు. తె లంగాణ ఆవిర్భావం తరువాత ఉద్యోగాలపై అందరిలోనూ ఆశలు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 29వ వరకు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 12,204 మంది, రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 18,021 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. -
మరికొద్ది రోజుల్లో భారీగా తగ్గనున్న ప్రకటనలు
-
మిశ్రమంగా గ్లోబల్ మార్కెట్లు
-
గ్రూపు A టాపర్స్