గ్రూప్–1,2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీపీఎస్‌సీ గ్రూప్–1, 2 పోస్టులకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ డీడీ కె.కృష్ణ ధనుంజయరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విశాఖపట్నంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని డీఆర్‌డీఏ కాంప్లెక్సులోని సాంఘిక సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ప్రగతి భవన్, సెక్టర్ 9, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం–530 017 చిరునామాకు అందజేయాని సూచించారు. 45 ఏళ్లలోపు నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులు అర్హులని స్పష్టం చేశారు. మూడు నెలల శిక్షణా కాలంలో సై్టఫండ్, స్టడీ మెటీరియల్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు.