గ్రూప్స్‌ ఫలితాల షెడ్యూల్‌ను ప్రకటించిన టీజీపీఎస్సీ | Tgpsc Announces The Schedule Of Group Results | Sakshi
Sakshi News home page

గ్రూప్స్‌ ఫలితాల షెడ్యూల్‌ను ప్రకటించిన టీజీపీఎస్సీ

Published Fri, Mar 7 2025 7:59 PM | Last Updated on Fri, Mar 7 2025 8:21 PM

Tgpsc Announces The Schedule Of Group Results

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్స్‌ అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రూప్స్‌ ఫలితాల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. ఈ నెల 10న గ్రూప్‌-1 ప్రొవిజనల్‌ మార్కుల జాబితాను విడుదల చేయనుంది. ఈ నెల 10 నుంచి 18 మధ్య గ్రూప్‌-1, 2, 3 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. 

11న గ్రూప్‌-2 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా, 14న గ్రూప్‌-3 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను ప్రకటించనుంది. 17న  హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, 19న ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ తుది ఫలితాలను విడుదల చేయనుంది. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెల్లడించడానికి టీజీపీఎస్సీ తుది పరిశీలన చేస్తోంది.
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement