కట్టడి చేయండి
Published Fri, Aug 5 2016 11:50 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
– భూమా వర్గీయులపై ఫిర్యాదు
– కుల వివక్ష సృష్టించారని ఆరోపణ
– పింఛన్ల దందా చేస్తున్నారంటూ విమర్శ
– అధికార పార్టీలో లుకలుకలు
నంద్యాల: ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వర్గీయుల దూకుడుకు కళ్లెం వేయాలని, లేకపోతే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని నంద్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, పలు కౌన్సిలర్లు సమన్వయ కమిటీకి ఫిర్యాదు చేశారు. కర్నూలులోని మౌర్య ఇన్‌లో శుక్రవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, హౌసింగ్ కార్పొరేషన్ ౖచెర్మన్ వర్ల రామయ్య హాజరయ్యారు. పార్టీ వర్గాల సమావేశం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూమా వర్గం కౌన్సిలర్లు టీడీపీలో చేరినా విపక్ష కౌన్సిలర్లలా వ్యవహరిస్తున్నారని.. గత నెల కౌన్సిల్ మీట్‌లో కుల వివక్షతను సష్టించాలని యత్నించారని సమన్వయ కమిటీకి శిల్పా వర్గీయులు తెలిపారు. తాము సద్దుకొని పోవాలని యత్నిస్తున్నా.. కలుపుకొని వెళ్లడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తాము ఇప్పించిన పింఛన్లు రద్దు చేసి, కొత్త వాటిని ఇస్తామని భూమా వర్గీయులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారని.. రేషన్ షాపులను రద్దు చేయిస్తామని బెదిరిస్తున్నారని, ఇప్పటికే ఒక రేషన్ డీలర్‌ను తొలగించారని వివరించారు. భూమా వర్గం స్పీడ్‌కు బ్రేకులు వేయకపోతే, ఐక్యత కష్టమని, లేకపోతే మరో నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పార్టీ నేత లోకేష్ దృష్టికి తీసుకొని వెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు సమాచారం.
అగ్రనేతలు డుమ్మా..
పార్టీ సమన్వయ సమావేశానికి మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే భూమా, మాజీ మంత్రి ఫరూక్‌లతో పాటు వారి వర్గీయులు ఎవరూ హాజరు కాలేదు.
Advertisement
Advertisement