
తీవ్రంగా గాయపడ్డ నాగసుబ్బయ్య, నాగసిద్ధులు
కేవీపల్లె(చిత్తూరు జిల్లా): క్రికెట్ ఆట యువకుల మధ్య చిచ్చుకు కారణమైంది. ఇరువర్గాల ఘర్షణకు దారి తీసింది. కత్తులు, కర్రలతో దాడి చేసుకోవడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు..కేవీపల్లె మండలం దిన్నెవడ్డిపల్లెకు చెందిన యువకులు గురువారం క్రికెట్ ఆడారు. గ్రామానికి చెందిన నాగసిద్ధులు (45) కుమారుడు నాగార్జున, నాగసుబ్బయ్య (34) బావమరిది నరేష్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇదే విషయంపై శుక్రవారం సాయంత్రం నాగసిద్ధులు, ఆయన కుమారులు వెంకటష్, నాగార్జున, బావమరిది యల్లయ్య, తమ్ముడు చంద్ర (43), తమ్ముని కుమారులు శ్రీనివాసులు, గిరిబాబు వర్గం, నాగసుబ్బయ్య, అతని తమ్ముడు నాగేంద్ర (32), బావమరది నరేష్ వర్గం పరస్పరం కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. (చదవండి: ఆవు తెచ్చిన తంటా!)
ఈ ఘర్షణలో నాగసిద్ధులు కడుపు, చేతిపై కత్తిపోట్లు పడి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే నాగసుబ్బయ్య తలకు తీవ్రగాయమైంది. అలాగే నాగేంద్ర, చంద్ర సైతం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ నలుగురినీ 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment