సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రింగువలల కోసం మత్య్సకారుల మధ్య గొడవ చెలరేగింది. దీనిపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అంతటితో ఆగకుండా, రెండు వర్గాలు సినీ ఫక్కీలో సముద్రంపై ఛేజింగ్‌లు చేసుకున్నాయి.
దీంతో విశాఖలోని.. పెద్ద జాలరీపేట గంగమ్మ గుడివద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం సంభవించింది. దీంతో సముద్రతీరం రణరంగంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment