fish net
-
వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ
సాక్షి, వనపర్తి: పట్టణంలోని రాజనగరం అమ్మచెరువు కల్వర్టు వద్ద ఏర్పాటు చేసిన చేపల వలలో ఆదివారం కొండ చిలువ చిక్కింది. అటుగా వెళ్లేవారు గుర్తించి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. 8 అడుగుల కొండ చిలువను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. అనంతరం స్నేక్ సాగర్‌కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని సురక్షితంగా పట్టుకొని అడవిలో వదిలేశారు. చదవండి: Photo Feature: కుక్క.. కోతి సయ్యాట -
విశాఖ తీరంలో మరోసారి ఉద్రిక్తత
-
మత్య్సకారుల మధ్య ఘర్షణ: బోట్లపై సినీ ఫక్కీలో ఛేజింగ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రింగువలల కోసం మత్య్సకారుల మధ్య గొడవ చెలరేగింది. దీనిపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అంతటితో ఆగకుండా, రెండు వర్గాలు సినీ ఫక్కీలో సముద్రంపై ఛేజింగ్‌లు చేసుకున్నాయి. దీంతో విశాఖలోని.. పెద్ద జాలరీపేట గంగమ్మ గుడివద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం సంభవించింది. దీంతో సముద్రతీరం రణరంగంగా మారింది. చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్ భేటీ -
చేపల వేట.. వలలో పడ్డ నటరాజ విగ్రహం
తిరువొత్తియూరు: నెల్లై తామ్రభరణి నదిలో చేపలు పట్టేందుకు జాలరి విసిరిన వలలో నటరాజస్వామి విగ్రహం చిక్కింది. నెల్లై, మానూర్ సమీపం తెర్కు (సౌత్) సెళియనల్లూరుకు చెందిన గణపతి. ఇతని కుమారుడు కాళిరాజ్ (43) జాలరి. ఇతను రాత్రి సమయంలో మణిమూర్తీశ్వరం ప్రాంతంలో తామ్రభరణి నదిలో చేపలు పడుతుంటాడు. సోమవారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో ఇతను చేపలు పడుతుండగా వలలో ఒకటిన్నర అడుగుల ఎత్తు కలిగిన నటరాజస్వామి విగ్రహం ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనిపై కాళిరాజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దక్ష నల్లూర్పోలీసు ఇన్స్పెక్టర్ పెరియస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ షేక్, పోలీసులు అక్కడికి చేరుకుని నటరాజస్వామి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని నెల్లై తహశీల్దార్ నాథన్ వద్ద అప్పగించారు.