
సాక్షి, వనపర్తి: పట్టణంలోని రాజనగరం అమ్మచెరువు కల్వర్టు వద్ద ఏర్పాటు చేసిన చేపల వలలో ఆదివారం కొండ చిలువ చిక్కింది. అటుగా వెళ్లేవారు గుర్తించి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. 8 అడుగుల కొండ చిలువను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. అనంతరం స్నేక్ సాగర్‌కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని సురక్షితంగా పట్టుకొని అడవిలో వదిలేశారు.
చదవండి: Photo Feature: కుక్క.. కోతి సయ్యాట
Comments
Please login to add a commentAdd a comment